ఆధునిక వ్యవసాయ విధానంతో మెరుగైన ఫలితాలు | Sakshi
Sakshi News home page

ఆధునిక వ్యవసాయ విధానంతో మెరుగైన ఫలితాలు

Published Tue, Apr 23 2024 8:40 AM

మాట్లాడుతున్న డాక్టర్‌ ప్రశాంతి. చిత్రంలో విస్తరణ సంచాలకులు డాక్టర్‌ నాయక్‌  - Sakshi

మహారాణిపేట : అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ విధానాలను ఉపయోగించుకుని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని ఆచార్య ఎన్‌.జి. రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు ఎల్‌. ప్రశాంతి అన్నారు. ఉత్తర కోస్తా మండల పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం విశాఖ జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ ఉత్తర కోస్తా మండలంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లితో పాటు నాలుగు వ్యవసాయ పరిశోధనా స్థానాలు, నాలుగు విస్తరణ కేంద్రాలు రైతులకు సేవలందిస్తున్నాయన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ పి.వి.కె. జగన్నాథరావు ఉత్తర కోస్తా మండలంలో 2023– 24 సంవత్సరంలో జరిగిన పరిశోధన, విస్తరణ ప్రగతి గురించి వివరించారు. విస్తరణ సంచాలకులు కె.ఎస్‌.ఎస్‌. నాయక్‌ మాట్లాడుతూ ఏరువాక కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రాలు డ్రోన్‌ టెక్నాలజీ, మైక్రో ఇరిగేషన్‌ అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ ప్రతినిధి బాలునాయక్‌ మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందజేసే సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయుక్తమన్నారు. ఈ కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగుతుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్‌ పీవీకే జగన్నాథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఎఫ్‌ఆర్‌ఏ డైరెక్టర్‌ డాక్టర్‌ జో కిజకుడన్‌, ఉత్తర కోస్తా మండలంలోని వ్యవసాయ శాఖ డీఏవోలు, ఉద్యానవన శాఖ అధికారులు, నాబార్డ్‌ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఆత్మ అధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement