అది విజనరీ కాదు..‘విష’నరీ | Sakshi
Sakshi News home page

అది విజనరీ కాదు..‘విష’నరీ

Published Wed, May 8 2024 10:04 AM

False Election Promises Of Chandrababu Naidu

సాక్షి, విశాఖపట్నం/అనంతగిరి:  ‘అరకు నియోజకవర్గంలో పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకుంటున్నా. స్మార్ట్‌ విలేజ్‌గా మార్చేస్తా. ప్రతి ఇంటికీ నిరంతరం నీటిని అందిస్తాను’ అని సీఎం హోదాలో చంద్రబాబు 2015 జనవరిలో బీరాలు పలికారు. ఏడాదిన్నర గడిచినా ఆ ఊరి వైపు కన్నెత్తి  చూడలేదు. చివరికి ప్రజలు రోడ్డెక్కడంతో 2016 మేలో ఆగమేఘాలపై అక్కడకు వచ్చి మంచినీటి కుళాయిల కోసం రూ.5 కోట్లు, సిమెంట్‌ రోడ్లకు రూ.9 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ నిధులూ వచి్చంది లేదు.. పనులు జరిగిందీ లేదు. అయితే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక బాబు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. ప్రతి ఇల్లు అభివృద్ధి పథంలో నడుస్తోంది. గిరి గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఆయా గ్రామాలు నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పెదలబుడు మేజర్‌ పంచాయతీలో ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు వెచి్చంచారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ అందుబాటులోకి వచ్చాయి. మూడు సచివాలయాల పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలు రూ.37 కోట్ల లబ్ధి పొందారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement