చిన హనిమిరెడ్డి ఆస్తుల వివరాలు | Sakshi
Sakshi News home page

చిన హనిమిరెడ్డి ఆస్తుల వివరాలు

Published Tue, Apr 23 2024 8:35 AM

- - Sakshi

అద్దంకి: ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దంకిలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సురేష్‌ మాట్లాడుతూ అద్దంకికి హనిమిరెడ్డి లాంటి మంచి వ్యక్తి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరికాడని తెలిపారు. ఆయన్ను గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. హనిమిరెడ్డి మాట్లాడుతూ నామినేషన్‌కు స్వచ్ఛందంగా హాజరైన నాయకులు, కార్యకర్తలను చూసి ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయమని పేర్కొన్నారు. ఈ అభిమానాన్ని బట్టి ఈసారి అద్దంకిలో భారీ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ఐదు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ఉప్పొంగిన అభిమానం తరంగం

అభిమాన తరంగం ఎగసిందా అన్నట్లు ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్‌కు తరలివచ్చారు. భారీ గజమాలతో అభిమాన నేతల్ని సత్కరించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకే అద్దంకి భవానీ సెంటర్‌కు చేరుకున్నారు. మోటార్‌ బైకులపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఎండను సైతం లెక్కచేయకుండా డ్యాన్స్‌లు చేశారు. నామినేషన్‌కి వచ్చిన జనాన్ని చూస్తే ఈసారి వైఎస్సార్‌ సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అట్టహాసంగా ర్యాలీ

శింగరకొండలో తొలుత చిన హనిమిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అట్టహాసంగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు తరలి వెళ్లారు. తరువాత తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ను అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు మారం వెంకారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ వై.వి. భద్రారెడ్డి పాల్గొన్నారు.

ఇతర రాష్ట్రాలలో ఉంటూ అతిథిగా నియోజకవర్గానికి వచ్చి ప్రలోభాలకు గురిచేసే వ్యక్తుల్ని నమ్మరాదని సూచించారు. నిజాంపట్నానికి వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ వస్తే తీరప్రాంతంలోని వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించేవని తెలిపారు. విషపు రాజకీయాలతో వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ను అడ్డుకున్నది చంద్రబాబేనని, నేడు అది వస్తే ఉద్యోగాలు వచ్చేవంటూ మొసలి కన్నీరు కార్చుతున్నాడని ధ్వజమెత్తారు. ఆ నాడు కేంద్రంలోని సోనియాగాంధీ కాళ్లుపట్టుకుని వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవటంతో పాటు జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తనపై అక్రమ కేసులు పెట్టిన ప్రధాన కారకరుడు చంద్రబాబేనని ఆరోపించారు. రంగా హత్యలో ప్రధాన కారకుడైన చంద్రబాబు పంచన పవన్‌ కల్యాణ్‌ చేరి కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని తెలిపారు. కాపులకు ఆది నుంచి రాజకీయ అవకాశాలు, అండదండలు కల్పించింది ఆ నాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అయితే, నేడు జగన్‌మోహన్‌రెడ్డి సముచిత స్థానం కల్పించారని వివరించారు. గతంలో దివంగత నేత వైఎస్సార్‌ ముస్లింలకు కల్పించిన మూడు శాతం రిజర్వేషన్‌ను తమ కూటమి అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రసంగించటాన్ని ముస్లింలు గమనిస్తూనే ఉన్నారన్నారు. అధికారం కోసమే అపవిత్ర కలయికతో ఎన్నికలకు సిద్ధమైన కూటమి నేతల్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.800కోట్లకుపైగా నిధులతో నియోజకవర్గ రూపురేఖలతో పాటు పట్టణ రూపురేఖలు మార్చింది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

అద్దంకిలో అట్టహాసంగా హనిమిరెడ్డి నామినేషన్‌ తరలివచ్చిన అశేష ప్రజలు తొలుత శింగరకొండలో ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ భద్రారెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు వెంకారెడ్డి

ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి సోమవారం ఆస్తులను ప్రకటించారు. అఫిడవిట్‌లో చూపిన వివరాల ప్రకారం ఆయనది పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనిర్సిటీలో ఎంబీఏ చదివారు. ఆయనకు చరాస్తులు రూ.9,61,49,916, భార్యకు రూ.35,57,436 ఉన్నాయి. స్థిరాస్తులు రూ.9,56,77,000 ఉన్నట్లు చూపించారు. దీంతో పాటు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, రెసిడెన్షియల్‌ భవనాల వివరాలు, వాటి విలువ పొందుపరిచారు.

రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు 
అందిస్తున్న అభ్యర్థి చిన హనిమిరెడ్డి
1/1

రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న అభ్యర్థి చిన హనిమిరెడ్డి

Advertisement
Advertisement