Airtel Offering Unlimited 5G Data With Free Disney+ Hotstar Subscription - Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ యూజర్లకు బంపరాఫర్‌.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే?

Published Mon, Jun 19 2023 4:38 PM

Airtel Offering Unlimited 5g Data With Free Disney+ Hotstar Subscription - Sakshi

ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత ఇంటర్నెట్ నుండి 5జీ డేటా యాక్సెస్, ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ల వరకు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అయితే, తాజాగా ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఫ్రీగా చూసే అవకాశం కల్పించేలా కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లను విడుదల చేసింది.  

మీ ప్రీపెయిడ్‌ మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లోనే మీకు కావాల్సినట్లుగా ఎయిర్‌టెల్‌ డిస్నీ+ హాట్‌స్టార్ తో పాటు 15 రకాల ఇతర ఓటీటీ ఛానెల్స్‌ను ఉచితంగా యాక్సెస్‌ చేయొచ్చు. అపరిమిత కాలింగ్, 5జీ డేటా, ఓటీటీ  ప్రయోజనాలను అందించే ఎయిర్‌టెల్‌ ప్లాన్లు ఇలా ఉన్నాయి.  

రూ. 359 ప్లాన్: ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పంపుకోవచ్చు. నెలరోజుల పాటు ప్రతి రోజు 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు అపోలో 24/7, హలెట్యూన్స్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే వంటి అనేక అదనపు ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సోనీ లీవ్‌,ఏరోస్‌ నౌ, లైన్స్‌ గేట్‌ప్లేతో పాటు 15 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను వీక్షించే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు 5జీ ఇంటర్నెట్ డేటాను వినియోగించుకోవచ్చు. 

రూ. 399 ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 3జీబీ హై-స్పీడ్ డేటా ప్రయోజనాలు పొందవచ్చు. 15+ ఓటీటీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందించే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లేకి ఉచిత యాక్సెస్‌తో సహా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. 

రూ. 499 ప్లాన్: 5జీ ప్రయోజనాలతో రూ. 399 ప్లాన్‌తో పోలిస్తే ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌కు దాదాపు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్‌తో పాటు, రీఛార్జ్ ప్లాన్ 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.

రూ. 699 ప్లాన్: మీరు ఒక నెల కంటే ఎక్కువ వ్యాలిడీ ఉన్న ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీ కోసమే. 56 రోజుల వ్యాలిడిటీతో రోజువారీ డేటా 3జీబీ, అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను సెండ్‌ చేసుకోవచ్చు.

చదవండి👉 కొత్త అనుమానాలు.. అదానీ ట్రైన్‌ టిక్కెట్ల బిజినెస్‌పై ఐఆర్‌సీటీసీ ఏమందంటే?

Advertisement
Advertisement