‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్‌ అసహనం | Sakshi
Sakshi News home page

‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్‌ అసహనం

Published Tue, May 7 2024 7:17 PM

Anant Sharma Slams City Infra And Weather

దేశాన్ని విడిచి వెళ్లాలా? అంటూ బెంగళూరు ఇన్ఫ్రా, వాతావారణంపై ఆంత్రప్రెన్యూర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీశాయి.  

ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన బెంగళూరు ఇప్పుడు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొటోంది. ఈ తరుణంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోమో మీడియా కో-ఫౌండర్‌, క్రియేటీవ్‌ హెడ్‌ అనంత్‌ శర్మ బెంగళూరు నగరంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బెంగళూరులో మౌలిక సదుపాయాలు, వాతావరణం, నీటి సమస్యపై ఎక్స్‌ వేదికపై అనంత్‌ శర్మ స్పందించారు. శర్మ తాను ముంబై లేదా పూణే షిఫ్ట్‌ అవ్వడం మంచిదా లేకా దేశం విడిచిపెట్టి వెళ్లడం మంచిదా అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.  
 


‘బాడ్ ఇన్‌ఫ్రా, బ్యాడ్‌ వెదర్‌, బ్యాడ్‌ వాటర్‌. నేను ముంబై లేదా పూణేకు షిఫ్ట్‌ అవ్వాలా? లేదా? దేశం విడిచి వెళ్లాలా? అంటూ నెటిజన్ల అభిప్రాయాల్ని కోరారు.  

అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎక్కువ మంది నెటిజన్లు తన అభిప్రాయంతో ఏకీభవించారు. కొందరు మరో ప్రాంతానికి షిఫ్ట్‌ అవ్వండి అంటూ సలహా ఇస్తే.. మరికొందరు మాత్రం బెంగళూరులో సానుకూల అంశాలను చర్చించారు.  

మీకు ఆర్థిక స్థోమత ఉంటే వదిలేయండి అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. బెంగుళూరుతో ఉన్న వ్యవస్థాగత సమస్య ఏమిటంటే ప్రజలు దీనిని వలస నగరంగా భావించడం. ఓటు బ్యాంకుగా మారితే తప్ప నగరాన్ని మార్చాలని ఎవరూ కోరుకోరని నిట్టూర్చాడు. 

 
Advertisement
 
Advertisement