ఆర్బీఐ కంటే ముందే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ కంటే ముందే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కీలక నిర్ణయం

Published Wed, Nov 8 2023 7:35 AM

HDFC Bank hikes lending rates in select tenors by 0 05pc - Sakshi

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొన్ని కాలపరిమితుల రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా 0.05 శాతం (ఐదు బేసిస్‌ పాయింట్లు) పెంచింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గడచిన ఐదు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లోనూ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5%) పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ తాజా రేటు పెంపు నిర్ణయం తీసుకుంది.

దీని ప్రకారం, ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ 8.65 శాతానికి పెరిగింది.  మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 9.30 శాతానికి ఎగసింది. కాగా, సాధారణంగా అధిక రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది రుణ రేటు మాత్రం 9.20 శాతం వద్ద స్థిరంగా ఉంది.

Advertisement
Advertisement