HDFC Senior Care FD Scheme Extended Details - Sakshi
Sakshi News home page

HDFC: ఆ స్కీమ్ గడువు మళ్ళీ పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ - కస్టమర్లకు పండగే!

Published Mon, May 29 2023 7:51 PM

HDFC senior care fd scheme extended details - Sakshi

HDFC Senior Citizen Scheme: ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ ప్రత్యేకంగా తీసుకువచ్చిన సీనియర్ సిటిజన్స్ ఓన్లీ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువును మరింత పొడిగించింది. 60 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న వారికి 'స్పెషల్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ' ద్వారా గరిష్ఠ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ స్కీమ్ 2020లోనే అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దాని గడువును 2023 జులై 7 వరకు పెంచింది.

ఈ స్కీమ్ ద్వారా సీరియర్ సిటిజన్ ఇన్వెస్టర్లకు అదనంగా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు లభిస్తుంది. అంటే దీని ప్రకారం సాధారణ కస్టమర్లకు ఇప్పటికే అందించే 50 బేసిస్ పాయింట్లకు అదనంగా సీనియర్ సిటిజన్లకు 25 బేసిస్ పాయింట్లు కలుస్తాయి. అంటే దీని ప్రకారం సీనియర్ సిటిజన్స్ 0.75 శాతం ఎక్కువ వడ్డీని పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో సీనియర్ సిటిజన్ ఐదు సంవత్సరాలకంటే ముందే ప్రీమెచ్యూర్ చేస్తే వారికి 1% వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల తరువాత దీనిపైన 1.25% శాతం వడ్డీ లభిస్తుంది.

(ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్‌యువి700 సన్‌రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు.. 

  • 7 రోజుల నుంచి 14 రోజులకు & 15 నుంచి 29 రోజులకు వడ్డీ 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు వడ్డీ 4.0 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజుల & 61 రోజుల నుంచి 89 రోజుల వరకు వడ్డీ 5.0 శాతం
  • 90 రోజుల నుంచి 6 నెలల లోపు వరకు వడ్డీ 5.0 శాతం
  • 6 నెలల ఒక రోజు నుంచి 9 నెలల లోపు 6.25 శాతం
  • 9 నెలల ఒక రోజు నుంచి ఒక సంవత్సరం లోపు 6.50 శాతం
  • ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు 7.10 శాతం
  • 15 నెల్ల నుంచి 18 నెలల లోపు 7.60 శాతం
  • 18 నెలల నుంచి 21 నెలల లోపు 7.50 శాతం
  • 21 నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు 7.50 శాతం
  • రెండు సంవత్సరాల ఒక రోజు నుంచి రెండు సంవత్సరాల 11 నెలల వరకు 7.50 శాతం
  • 2 ఏళ్ల 11 నెలలు (35 నెలలకు) వడ్డీ 7.70 శాతం
  • 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ 7.75 శాతం

Advertisement
Advertisement