జియోకి పోటీగా ఎయిర్‌టెల్‌, అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌.. | Sakshi
Sakshi News home page

జియోకి పోటీగా ఎయిర్‌టెల్‌, అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌..

Published Mon, Jul 17 2023 5:10 PM

Poco C51 4g Smartphone With Airtel Prepaid Connection To Cost Rs 5,999 - Sakshi

దేశీయ టెలికాం రంగంలో దిగ్గజ సంస్థలైన ఎయిర్‌టెల్‌, జియోల మధ్య పోటీ నెలకొంది. ఇతర టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, కొత్త యూజర్లను రాబట్టుకునేందుకు జియో, ఎయిర్‌టెల్‌లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్‌ జియో అతి తక్కువ ధర (రూ.999)కే 4జీ ఫోన్‌ను యూజర్లకు అందించింది. ఇందుకోసం కార్బన్‌ కంపెనీతో జతకట్టింది. జులై 7 నుంచే ఈ ఫోన్‌ అమ్మకాలు సైతం ప్రారంభమయ్యాయి.

ఈ తరుణంలో మరో టెలికం కంపెనీ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ తయారీ సంస్థ పోకోతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ మేరకు, ఎయిర్‌టెల్‌ కస్టమర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా పోకో సీ51 ను  అందుబాటులోకి తెచ్చింది. జులై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999కే సేల్స్‌ ప్రారంభం కానున్నాయి.

పోకో సీ51లో 6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ ప్యానెల్‌,120 హెచ్‌జెడ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, స్మూత్‌ అండ్‌ రెస్పాన్సీవ్‌ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్‌, 

మూమెమ్స్‌ను క్యాప్చర్‌ చేసేందుకు 8 ఎంపీ ఏఐ డ్యూయల్‌ రేర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరాతో రానుంది. 

పనితీరు బాగుండేందుకు ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియా జీ 36 ఎస్‌ఓఎస్‌తో వస్తుంది. 

యాప్స్‌, మీడియా, ఫైల్స్‌ స్టోరేజ్‌కోసం 4జీబీ ఇంటర్నల్‌ స్టోర్‌జ్‌ను అందిస్తుంది. 

5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రోజంతా వినియోగించుకోవచ్చు. 10డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. 

ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, 2.4జీహెచ్‌జెడ్‌ వైఫై వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 

ఇక ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు బంపరాఫర్‌ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ కస్టమర్లుగా ఉన్నవారు, కొత్తగా ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లోకి పోర్ట్‌ అవ్వాలనుకునే వారు ఈ మొబైల్‌ను కొనుగోలుపై పలు ఆఫర్లు అందిస్తుంది. ఫోన్‌ కొనుగోలు చేసిన యూజర్లు 18 నెలల పాటు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌కు లాక్‌ అయ్యి ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.199 చొప్పున ఏ ప్లాన్‌ అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌తోనైనా రీఛార్జి చేసుకోవచ్చు. 18 నెలల తర్వాత ఇతర నెట్‌వర్క్‌ సిమ్‌ను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు 50జీబీ డేటా ఉచితం. 10 జీబీ చొప్పున మొత్తం 5 కూపన్లు ఐదు నెలల పాటు లభించనున్నట్లు  సంయుక్తంగా విడుదల చేసిన ఎయిర్‌టెల్‌ -పోకో’ల ప్రకటనలో తెలిపాయి. 

జియో ఫోన్‌ ఎంతంటే?
ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారత దేశంలో 25కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికీ 2జీని వినియోగిస్తున్నారు. వారందరి కోసం మార్కెట్​లోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ఫోన్ జియోభారత్​ V2ని రిలయన్స్‌ విడుదల చేసింది. ఈఫోన్‌ ధర రూ.999కే నిర్ధేశించింది. ఇక ఈ ఫోన్‌ 1.77 అంగుళాల స్క్రీన్, 0.3మెగాపిక్సెల్ కెమెరా ఎస్​డీ కార్డ్​తో 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం, హెచ్​డీ వాయిస్ కాలింగ్, లౌడ్ స్పీకర్, 1000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, జియో సినిమా, యూపీఐ పేమెంట్స్​ చేసేందుకు వీలుగా జియోపేని యూజర్లకు అందిస్తుంది.

చదవండి👉 మీరు స్టూడెంట్సా? యాపిల్‌ బంపరాఫర్‌.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్‌ పాడ్స్‌!

Advertisement
Advertisement