వివాదంలో యూకే ప్రధాని.. కాంట్రాక్ట్‌లన్నీ ‘మామకే’ అప్పనంగా కట్టబెట్టేస్తున్నాడు!? | Sakshi
Sakshi News home page

వివాదంలో యూకే ప్రధాని.. కాంట్రాక్ట్‌లన్నీ ‘మామకే’ అప్పనంగా కట్టబెట్టేస్తున్నాడు!?

Published Mon, Feb 5 2024 4:00 PM

Tory Trade Minister Dominic Johnson Accused Of Given VIP Access To Rishi Sunak Wife Company In The UK - Sakshi

యూకే ప్రతిపక్ష ‘లేబర్‌ పార్టీ’, పలు మీడియా సంస్థలు బాంబు పేల్చాయి. భారత్‌కు చెందిన రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ యూకేలో వృద్ది సాధించేలా, అందుకు తాను సహాయం చేయడంపై సంతోషంగా ఉన్నట్లు ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి లార్డ్‌ డొమినిక్ జాన్సన్ అన్నారని, అందుకు ఊతం ఇచ్చేలా కొన్ని ఫోటోల్ని, పలు కీలక డాక్యుమెంట్లను బహిర్గతం చేశాయి. ఇంతకి ఆ ఫోటోలు ఎవరివి? ఆ డాక్యుమెంట్లలో ఏముంది?

లేబర్‌ పార్టీ విడుదల చేసిన డాక్యుమెంట్లలో.. యూకేలో ప్రైవేట్‌, ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలంటే అందుకు తప్పని సరిగా ప్రభుత్వ అనుమతులు ఇవ్వడంతో పాటు బిడ్డింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. అవేం లేకుండా నేరుగా యూకే ప్రభుత్వం ఇన్ఫోసిస్‌కు ప్రైవేట్‌,ప్రభుత్వ కాంట్రాక్ట్‌లను అప్పనంగా కట్టబెడుతున్నాయి ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.  

ఇన్ఫోసిస్‌కు 750 మిలియన్‌ పౌండ్స్‌ కాంట్రాక్ట్‌
యూకేలో 750 మిలియన్‌ పౌండ్‌ల విలువైన కాంట్రాక్ట్‌ను రిషిసునాక్‌, ఆయన భార్య, ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ నారాయణ కుమార్తెకు వాటాలున్నా ఇన్ఫోసిస్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లు మీడియా సంస్థలు జరిపిన అంతర్గత విచారణలో తేలినట్లు పేర్కొన్నాయి. ఇటీవల 750 మిలియన్‌ పౌండ్‌ల కంటే ఎక్కువ విలువైన యూకే ప్రభుత్వ కాంట్రాక్టులను పేరున్న ఐటీ కంపెనీలకు అందించేలా రిషి సునాక్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన జాబితాలో ఇన్ఫోసిస్‌ ఉన్నట్లు సమాచారం.


 
250 మిలియన్‌ పౌండ్స్‌ కాంట్రాక్ట్‌
అంతేకాదు ‘ఇంటెలిజెంట్ ఆటోమేషన్’ అని పిలవబడే కాంట్రాక్ట్‌ను ఎన్‌హెచ్‌ఎస్‌ షేర్డ్ బిజినెస్ సర్వీసెస్ అనే సంస్థ యూకేలో 250 మిలియన్‌ పౌండ్ల కాంట్రాక్ట్‌ను 25 ఐటీ కంపెనీలకు అప్పగించినట్లు, వాటిల్లో భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఉన్నట్లు లేబర్‌ పార్టీ విడుదల చేసిన ఆ డాక్యుమెంట్లలో ఉంది.  

నేరుగా కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి
రిషి సునాక్‌ ప్రభుత్వ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్‌సీఏ) విభాగానికి ఐటీ సేవలు అత్యవసరం. ఇందుకోసం 562.5మిలియన్ల విలువైన కాంట్రాక్ట్‌ కోసం 62 సంస్థలు పోటీ పడ్డాయి. వాటిల్లో ఇన్ఫోసిస్‌ ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ‘ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్‌’ కిందకి వస్తాయి. అంటే టెండరింగ్ లేకుండా ప్రభుత్వ సంస్థలు నేరుగా కాంట్రాక్టులను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు అనుమతిస్తాయి. ఇక యూకే ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్‌లు పొందినందుకు ఎలాంటి చెల్లింపులు జరపలేదని, ట్యాక్స్‌ చెల్లించే అవకాశం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్‌సీఏ ప్రతినిధులు మాత్రం తాజా డిజిటల్ సర్వీసెస్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్నవే తప్పా.. మేం ఇంకా ఎవరికి ఎలాంటి కాంట్రాక్టులను ఇవ్వలేదని తెలిపారు.

ఇన్ఫోసిస్‌కు సాయం.. సంతోషంలో యూకే మంత్రి
పైన పేర్కొన్నట్లుగా 750 మిలియన్ల పౌండ్ల ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను ఇన్ఫోసిస్‌కు అప్పగించే సమయంలో యూకే వాణిజ్య శాఖ మంత్రి లార్డ్‌ డొమినిక్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు లేబర్‌ పార్టీ విడుదల చేసిన డాక్యుమెంట్లలో హైలెట్‌ చేసింది. తమ దేశంలో ఇన్ఫోసిస్‌ వృద్ది సాధించేందుకు తన వంతు చేస్తున్న ‘సహాయం’పై  జాన్సన్‌ సంతోషం వ్యక్తం చేసినట్లు విమర్శలు కురిపిస్తుంది. అంతే కాదు, యూకేలో ఇన్ఫోసిస్‌ బిజినెస్‌ పరంగా తనవల్ల ఎంత మేరకు లాభం చేకూరుతుందో అంత చేయాలని ఇన్ఫోసిస్‌ ప్రతిధినిధులు జాన్సన్‌తో చెప్పారని పేర్కొన్నాయి.

బెంగళూరులో ఇన్ఫోసిస్‌ మంత్రి ప్రత్యక్షం
యూకేలో వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన అంశంలో భారత్‌లోని ఇన్ఫోసిస్‌ ప్రధాన కార్యాలయంలో బెంగళూరులో యూకే వాణిజ్య శాఖ మంత్రి డొమినిక్‌ జాన్సన్‌ ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన ఫోటోల్ని విడుదల చేసింది. ఈ అంశంపై ఇన్ఫోసిస్‌, అటు రిషి సునాక్‌లు స్పందించాల్సి ఉంటుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement