సాధారణంగా ఉపగ్రహాలు లోహంతో తయారు చేస్తారు. అవి వాతావరణంలో పొరపాటున కాలిపోతే హానికరమైన చెత్తను సృష్టిస్తున్నాయి. ఈ శిథిలాల కార్యాచరణ ఇతర ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకకు గణనీయమైన ముప్పుని కలిగిస్తాయి. అందుకని ఈ సమస్యకు చెక్‌పెట్టేలా జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త ఉప్రగ్రహ్నాన్ని అభివృద్ధిచ చేశారు. దేనితో అంటే..
ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్ పరిశోధకులు లిగ్నోశాట్ అనే చిన్న చెక్క ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని సెప్టెంబర్‌లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ లిగ్నోశాట్‌ని క్యోటో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు లాగింగ్ కంపెనీ సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో రూపొందించగలిగారు.
2020 ఏప్రిల్ నుంచి ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసే పనిలోపడ్డారు. ఈ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకుమాగ్నోలియా కలపను ఎంచుకున్నారు. ఈ చెక్క ఉపగ్రహాలు అంతరిక్షంలోని వ్యర్థాల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం అందించగలవని పరిశోధకులు చెబుతున్నారు. చెక్కను ఉపగ్రహంలా మలిచేలా ప్రతివైపు పది సెంటిమీటర్లు ఉండేలా అడ్జెస్ట్ చేశారు. దీన్ని సెప్టెంబర్‌లో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్‌లో ప్రయోగించనుంది. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)కి డెలివరీ చేయడం జరుగుతుంది.
అక్కడ ఈ ఉపగ్రహం బలాన్ని, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను తట్టుకునే సామార్థ్యం ఉందా లేదా వంటి పలు టెస్ట్‌లు చేస్తారు. అందుకోసం డేటాని పంపించి పరిశీలిస్తామని సుమిటో ఫారెస్ట్రీ ప్రతినిధి తెలిపారు. ఈ సరికొత్త చెక్క ఉపగ్రహం అంతరిక్ష వ్యర్థాలపై పోరాటంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది గనుక విజయవంతమైతే కొత్తతరం పర్యావరణ అనకూల ఉపగ్రహాలను తయారు చేసేలా ఈ లిగ్నోశాట్ ఉపగ్రహం మార్గం సుగమం చేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
(చదవండి: చిట్టి పికాసో: రెండేళ్ల వయసులో పెయింటింగ్..ఎంతకు అమ్ముడయ్యాయంటే..)
Comments
Please login to add a commentAdd a comment