భారత పారిశ్రామిక దిగ్గజం,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి రిలయన్స్ జియో వంటి వివిధ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనే ఆసియాలో అతిపెద్ద మామిడి తోటను కలిగి ఉన్న వ్యక్తి కూడా. అంతేగాదు ఎక్కువ మామిడి పండ్లను పండించి ఎగుమతి చేసేది కూడా రిలయన్స్ సంస్థే. దీని వెనుక దాగున్న ఆసక్తికర కథ వింటే..ముఖేశ్ అంబానీకి సలాం కొట్టకుండా ఉండలేరు.
భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ 1990లలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఆయిల్‌ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేశారు. దీని కారణంగా పెద్ద మొత్తంలో కాలుష్యం ఏర్పడటం జరిగింది. ఈ విషయమై కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి రిలయన్స్‌కి నోటీసులు వచ్చాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం తీవ్రంగా అన్వేషించడం మొదలు పెట్టింది రిలయన్స్. దీనికి చెక్‌పెట్టగలిగేది మామిడి మొక్కలే అని డిసైడ్ అయ్యారు.
వెంటనే ఆ రిఫైనరీ ఆయిల్ సమీపంలో ఉన్న దాదాపు 600 ఎకరాల బంజరు భూములను గ్రీన్‌ఫీల్డ్‌గా మార్చేసింది. ఆ భూముల్లో ఏకంగా 200 రకాల మామిడి మొక్కలను నాటించింది. ఈ తోటకు ముఖేశ్ అంబానీ తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పేరు మీదుగా 'దీరుభాయ్ అంబానీ లిఖీబాగ్ అమ్రాయీ' అనే పేరే పెట్టారు. దీనిని లఖీభాగ్ అని పిలుస్తారు. ఇది బిహార్‌లోని దర్భంగాలో ఉంది. ఈ తోటలో అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి ప్రధాన భారతీయ రకాలే కాకుండా విదేశీ మామి రకాలు కూడా ఉన్నాయి.
ఈ లఖీబాగ్ అమ్రాయి తోట నుంచి ఏడాదికి దాదాపు 127 రకాల మామిడి పండ్లను ఉత్తత్తి చేస్తుంది. వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. అంతేగాదు రిలయన్స్ పండ్ల తోటలను సందర్శించి వినూత్న పద్ధతులను నేర్చుకోమని రైతులను ప్రోత్సహిస్తోంది కూడా. పైగా ప్రతి ఏడాది ఏకంగా ఒక లక్షకుపైగా మామిడి మొక్కలను ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. ఇక్కడ ఒక సమస్య పరిష్కారాన్ని కనుగొని దాన్నుంచి కూడా వ్యాపారం చేసి లాభాలు ఆర్జించిన గొప్ప వ్యాపారవేత్త మన ముఖేశ్ అంబానీ. నిజంగా బిజినెస్ మ్యాన్ అసలైన నిర్వచనం, స్ఫూర్తి కూడా అతడే కదూ..!.
(చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!)
Comments
Please login to add a commentAdd a comment