Mango Arcade
-
పొల్యూషన్‌కి మామిడి మొక్కలతో చెక్ పెట్టి..దాన్నే బిజినెస్‌గా మార్చేశాడు!
భారత పారిశ్రామిక దిగ్గజం,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి రిలయన్స్ జియో వంటి వివిధ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనే ఆసియాలో అతిపెద్ద మామిడి తోటను కలిగి ఉన్న వ్యక్తి కూడా. అంతేగాదు ఎక్కువ మామిడి పండ్లను పండించి ఎగుమతి చేసేది కూడా రిలయన్స్ సంస్థే. దీని వెనుక దాగున్న ఆసక్తికర కథ వింటే..ముఖేశ్ అంబానీకి సలాం కొట్టకుండా ఉండలేరు.భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ 1990లలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఆయిల్‌ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేశారు. దీని కారణంగా పెద్ద మొత్తంలో కాలుష్యం ఏర్పడటం జరిగింది. ఈ విషయమై కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి రిలయన్స్‌కి నోటీసులు వచ్చాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం తీవ్రంగా అన్వేషించడం మొదలు పెట్టింది రిలయన్స్. దీనికి చెక్పెట్టగలిగేది మామిడి మొక్కలే అని డిసైడ్ అయ్యారు. వెంటనే ఆ రిఫైనరీ ఆయిల్ సమీపంలో ఉన్న దాదాపు 600 ఎకరాల బంజరు భూములను గ్రీన్‌ఫీల్డ్‌గా మార్చేసింది. ఆ భూముల్లో ఏకంగా 200 రకాల మామిడి మొక్కలను నాటించింది. ఈ తోటకు ముఖేశ్ అంబానీ తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పేరు మీదుగా 'దీరుభాయ్ అంబానీ లిఖీబాగ్ అమ్రాయీ' అనే పేరే పెట్టారు. దీనిని లఖీభాగ్ అని పిలుస్తారు. ఇది బిహార్‌లోని దర్భంగాలో ఉంది. ఈ తోటలో అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి ప్రధాన భారతీయ రకాలే కాకుండా విదేశీ మామి రకాలు కూడా ఉన్నాయి. ఈ లఖీబాగ్ అమ్రాయి తోట నుంచి ఏడాదికి దాదాపు 127 రకాల మామిడి పండ్లను ఉత్తత్తి చేస్తుంది. వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. అంతేగాదు రిలయన్స్ పండ్ల తోటలను సందర్శించి వినూత్న పద్ధతులను నేర్చుకోమని రైతులను ప్రోత్సహిస్తోంది కూడా. పైగా ప్రతి ఏడాది ఏకంగా ఒక లక్షకుపైగా మామిడి మొక్కలను ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. ఇక్కడ ఒక సమస్య పరిష్కారాన్ని కనుగొని దాన్నుంచి కూడా వ్యాపారం చేసి లాభాలు ఆర్జించిన గొప్ప వ్యాపారవేత్త మన ముఖేశ్ అంబానీ. నిజంగా బిజినెస్ మ్యాన్ అసలైన నిర్వచనం, స్ఫూర్తి కూడా అతడే కదూ..!.(చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!) -
Mangoes: ధర అడగొద్దు! ఆ టేస్టే వేరు!!
ఇండోర్: ఫలాల్లో రారాజు ‘మామిడి’ పండ్ల ఖ్యాతి రోజు రోజుకు మరింత ఇనుమడిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ ఇమేజ్‌కు తోడు ఇపుడిక భారీ క్రేజ్ కూడా దక్కుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన మరో రైతు మామిడి సాగులో తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను పండించిన మామిడికాయలను కిలో వెయ్యిరూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. మామిడి కాయల సాగులో మధ్యప్రదేశ్ రైతుల ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా ఇటీవల ‘నూర్జాహాన్’ రకం పళ్లు ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్‌పురా గ్రామానికి రామేశ్వర్, జగదీశ్ తోటలో దేశీ, విదేశీ రకాల మామిడి పండ్లను పండించారు. దీంతో ఇవి కిలో వెయ్యి రూపాయలు పలకడం విశేషంగా నిలిచింది. తమ తోటలో జాతీయ అంతర్జాతీయ రకాల మామిడి పండ్లను పండించడం సంతోషంగా ఉందని. వీటిలో మెక్సికో, ఆఫ్ఘనిస్తాన్ దేశాల రకాలు ప్రధానంగా ఉన్నాయని రామేశ్వర్ ఆనందం వ్యక్తం చేశారు. విదేశీ జాతి పండ్లు చూసేందుకు, రుచిలో కూడా చాలా భిన్నంగా ఉంటాయన్నారు.అందుకే వీటిని కిలోకు 1000 రూపాయల చొ ప్పున విక్రయిస్తున్నామని చెప్పారు. Rameshwar & Jagdish from Madhya Pradesh's Rajpura village have both Indian & International variety of mangoes in their orchard, including mangoes from countries like Mexico, Afghanistan. "Mangoes from outside India are different in taste appearance & sold at Rs 1000/kg,"they said pic.twitter.com/JXGvsKjveq — ANI (@ANI) July 3, 2021 -
ఒక నిమిషం – ఒక విషయం
ద్వారానికి అంత ప్రాముఖ్యం ఎందుకు ఇస్తారు? ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపం అందుకే దానికి మామిడి తోరణం కడతారు. కింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయడం వల్ల క్రిమికీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు. పంచామృతం, పంచగవ్యాలు తేడా ఏమిటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారల మిశ్రమాన్ని పంచామృతం అంటారు. దీనిని పూజలో దేవునికి నివేదిస్తారు. ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంల మిశ్రమమే పంచగవ్యం. దీనిని పంటల రోగనివారణకు వాడతారు. అన్నప్రాశన ఎన్నో నెలలో చేయాలి ? ఆడపిల్లలకు ‘5‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్నప్రాశన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది. కొందరు ఆడపిల్లలకు ఏడవనెల ఏడవరోజున చేయాలని అంటారు. 6వ నెల ఆరవ రోజు లేదా ఏడవనెల ఏడవ రోజు చేసేటప్పుడు ముహూర్తం చూడనక్కరలేదనీ, ఆ రోజున ఏ తిథి అయినా మంచిదేననీ అంటారు. తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు? తొలితీర్థం శరీర శుద్ధికి, శుచికి. రెండవ తీర్థం ధర్మ, న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కొరకు. ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది? గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో, దేవతా సన్నిధిలో చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిధిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కూర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఃఖం, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.