ఇండోర్: ఫలాల్లో రారాజు ‘మామిడి’ పండ్ల ఖ‍్యాతి రోజు రోజుకు మరింత ఇనుమడిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ ఇమేజ్‌కు తోడు ఇపుడిక భారీ క్రేజ్ కూడా దక్కుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన మరో రైతు మామిడి సాగులో తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను పండించిన మామిడికాయలను కిలో వెయ్యిరూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.
మామిడి కాయల సాగులో మధ్యప్రదేశ్ రైతుల ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా ఇటీవల ‘నూర్జాహాన్’ రకం పళ్లు ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్‌పురా గ్రామానికి రామేశ్వర్, జగదీశ్ తోటలో దేశీ, విదేశీ రకాల మామిడి పండ్లను పండించారు. దీంతో ఇవి కిలో వెయ్యి రూపాయలు పలకడం విశేషంగా నిలిచింది. తమ తోటలో జాతీయ అంతర్జాతీయ రకాల మామిడి పండ్లను పండించడం సంతోషంగా ఉందని. వీటిలో మెక్సికో, ఆఫ్ఘనిస్తాన్ దేశాల రకాలు ప్రధానంగా ఉన్నాయని రామేశ్వర్ ఆనందం వ్యక్తం చేశారు. విదేశీ జాతి పండ్లు చూసేందుకు, రుచిలో కూడా చాలా భిన్నంగా ఉంటాయన్నారు.అందుకే వీటిని కిలోకు 1000 రూపాయల చొ ప్పున విక్రయిస్తున్నామని చెప్పారు.
Rameshwar & Jagdish from Madhya Pradesh's Rajpura village have both Indian & International variety of mangoes in their orchard, including mangoes from countries like Mexico, Afghanistan. "Mangoes from outside India are different in taste appearance & sold at Rs 1000/kg,"they said pic.twitter.com/JXGvsKjveq
— ANI (@ANI) July 3, 2021
Comments
Please login to add a commentAdd a comment