refinery oils
-
ఐవోసీ రూ.21,000 కోట్ల పెట్టుబడి
పట్నా: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) రూ.21,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. బిహార్‌లోని బరౌనీ రిఫైనరీ విస్తరణ, ఆ రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు ఐవోసీ ఈడీ సుమన్ కుమార్ వెల్లడించారు.‘సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో బరౌని రిఫైనరీని పెట్రోకెమికల్ ప్లాంట్‌తో కలిపి ప్రస్తుత 6 మిలియన్ టన్నుల నుంచి సంవత్సరానికి 9 మిలియన్ టన్నులకు విస్తరిస్తున్నాం. 27 నగరాల్లో ఆటోమొబైల్స్‌కు, గృహాలు, పరిశ్రమలకు పైపుల ద్వారా సీఎన్జీని సరఫరా చేయడానికి నెట్వర్క్ ఏర్పాటుకై మరో రూ.5,600 కోట్లు పెట్టుబడి పెడతాం. 2,00,000 టన్నుల తయారీ సామర్థ్యంతో పాలీప్రొఫైలిన్ కేంద్రాన్ని కూడా 2025 చివరినాటికి ఏర్పాటు చేస్తాం. 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము? రూ.2 లక్షల కోట్ల కంటే అధిక పెట్టుబడి110 బిలియన్ డాలర్ల విలువైన ఐవోసీ..దూకుడుగా మూలధన విస్తరణ ప్రణాళికను రూపొందించింది. రిఫైనింగ్ సామర్థ్యం, పెట్రోకెమికల్ ఇంటిగ్రేషన్, అనుబంధ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన ఆస్తులను విస్తరించడానికి దశాబ్దంలో రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న నేపథ్యంలో దేశ ఇంధన అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ‘ద ఎనర్జీ ఆఫ్ ఇండియా’గా సంస్థ 2050 నాటికి భారత ఇంధన అవసరాలలో 12.5 శాతం సమకూర్చడం ద్వారా ముందు వరుసలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ పానిపట్ రిఫైనరీని సంవత్సరానికి 15 మిలియన్ టన్నుల నుంచి 25 మిలియన్ టన్నులకు, గుజరాత్ రిఫైనరీని 13.7 మిలియన్ టన్నుల నుండి 18 మిలియన్ టన్నులకు విస్తరిస్తోంది. -
పొల్యూషన్‌కి మామిడి మొక్కలతో చెక్ పెట్టి..దాన్నే బిజినెస్‌గా మార్చేశాడు!
భారత పారిశ్రామిక దిగ్గజం,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి రిలయన్స్ జియో వంటి వివిధ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనే ఆసియాలో అతిపెద్ద మామిడి తోటను కలిగి ఉన్న వ్యక్తి కూడా. అంతేగాదు ఎక్కువ మామిడి పండ్లను పండించి ఎగుమతి చేసేది కూడా రిలయన్స్ సంస్థే. దీని వెనుక దాగున్న ఆసక్తికర కథ వింటే..ముఖేశ్ అంబానీకి సలాం కొట్టకుండా ఉండలేరు.భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ 1990లలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఆయిల్‌ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేశారు. దీని కారణంగా పెద్ద మొత్తంలో కాలుష్యం ఏర్పడటం జరిగింది. ఈ విషయమై కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి రిలయన్స్‌కి నోటీసులు వచ్చాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం తీవ్రంగా అన్వేషించడం మొదలు పెట్టింది రిలయన్స్. దీనికి చెక్పెట్టగలిగేది మామిడి మొక్కలే అని డిసైడ్ అయ్యారు. వెంటనే ఆ రిఫైనరీ ఆయిల్ సమీపంలో ఉన్న దాదాపు 600 ఎకరాల బంజరు భూములను గ్రీన్‌ఫీల్డ్‌గా మార్చేసింది. ఆ భూముల్లో ఏకంగా 200 రకాల మామిడి మొక్కలను నాటించింది. ఈ తోటకు ముఖేశ్ అంబానీ తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పేరు మీదుగా 'దీరుభాయ్ అంబానీ లిఖీబాగ్ అమ్రాయీ' అనే పేరే పెట్టారు. దీనిని లఖీభాగ్ అని పిలుస్తారు. ఇది బిహార్‌లోని దర్భంగాలో ఉంది. ఈ తోటలో అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి ప్రధాన భారతీయ రకాలే కాకుండా విదేశీ మామి రకాలు కూడా ఉన్నాయి. ఈ లఖీబాగ్ అమ్రాయి తోట నుంచి ఏడాదికి దాదాపు 127 రకాల మామిడి పండ్లను ఉత్తత్తి చేస్తుంది. వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. అంతేగాదు రిలయన్స్ పండ్ల తోటలను సందర్శించి వినూత్న పద్ధతులను నేర్చుకోమని రైతులను ప్రోత్సహిస్తోంది కూడా. పైగా ప్రతి ఏడాది ఏకంగా ఒక లక్షకుపైగా మామిడి మొక్కలను ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. ఇక్కడ ఒక సమస్య పరిష్కారాన్ని కనుగొని దాన్నుంచి కూడా వ్యాపారం చేసి లాభాలు ఆర్జించిన గొప్ప వ్యాపారవేత్త మన ముఖేశ్ అంబానీ. నిజంగా బిజినెస్ మ్యాన్ అసలైన నిర్వచనం, స్ఫూర్తి కూడా అతడే కదూ..!.(చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!) -
రూ.280 కోట్లతో ‘కార్గిల్’ వంటనూనెల శుద్ధి కర్మాగారం
సాక్షి, అమరావతి: ప్రముఖ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ కార్గిల్ ఇండియా తమ దక్షిణ భారతదేశ వ్యాపార విస్తరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.280 కోట్లతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ప్రపంచస్థాయి ప్రమాణాలతో వివిధ వంట నూనెల తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసి ఆధునీకరించినట్లు తెలిపింది. బుధవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘జెమిని ప్యూరిట్’ బ్రాండ్ పేరుతో సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా కార్గిల్ ఇండియా ఇన్‌గ్రిడియంట్స్ (దక్షిణాసియా) కన్జూమర్ బిజినెస్ లీడర్ అవినాష్ త్రిపాఠి మాట్లాడుతూ దేశవ్యాప్త సన్‌ఫ్లవర్ వినియోగంలో 70 శాతం దక్షిణ భారతదేశంలోనే జరుగుతోందని, దీంతో దక్షిణ దేశ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ‘జెమిని ప్యూరిట్’ని విజయవాడలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణపట్నం వద్ద సన్‌ఫ్లవర్, రిఫైండ్ పామాయిల్, పామోలిన్, వనస్పతి, బేకరీ షార్టెనింగ్స్‌ను తయారు చేసి అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశంలోనే అతిపెద్ద 4.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
ఐపీవో దిశలో రెండు కంపెనీలు
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ భారత్ హైవేస్ ఇన్విట్, వైట్ ఆయిల్స్ తయారీ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఈ జాబితాలో చేరాయి. ఈ రెండు సంస్థలూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. వివరాలు ఇలా.. రూ. 2,000 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా భారత్ హైవేస్ ఇన్విట్ బుక్బిల్డింగ్ ద్వారా రూ. 2,000 కోట్ల విలువైన యూనిట్లను ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమకూర్చుకోనుంది. నిధులను ప్రాజెక్టŠస్ ఎస్పీవీకి చెందిన కొన్ని రుణాల చెల్లింపుతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎస్పీవీ ప్రాజెక్టŠస్లో.. పోర్బందర్– ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, వారణాశి– సంగమ్ ఎక్స్‌ప్రెస్‌వే, జీఆర్ సంగ్లీ– సోలాపూర్ హైవే, జీఆర్ అక్కల్కోట్– సోలాపూర్ హైవే, జీఆర్ ఫగ్వారా ఎక్స్‌ప్రెస్‌వే, జీఆర్ గుండుగొలను– దేవరాపల్లి హైవే ఉన్నాయి. 2022 ఆగస్ట్‌లో ఏర్పాటైన భారత్ హైవేస్ ఇన్విట్ ప్రాజెక్ట్ ఎస్పీవీలో ప్రతీ ప్రాజక్టులోనూ 100 శాతం చొప్పున వాటా కొనుగోలు చేయనుంది. ప్రాథమికంగా 49 శాతం వాటాను సొంతం చేసుకుంటుంది. రూ. 500 కోట్లపై కన్ను పబ్లిక్ ఇష్యూలో భాగంగా గాంధార్ ఆయిల్ రిఫైనరీ రూ. 357 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఎక్విప్మెంట్ కొనుగోలుసహా.. సిల్వస్సా ప్లాంటులో ఆటోమోటివ్ ఆయిల్ తయారీ సామర్థ్య విస్తరణకు అవసరమైన సివిల్ వర్క్‌లకూ వెచ్చించనుంది. అంతేకాకుండా తలోజా ప్లాంటులో పెట్రోలియం జెల్లీతోపాటు.. సంబంధిత కాస్మెటిక్ ప్రొడక్టుల తయారీ విస్తరణకు సైతం వినియోగించనుంది. వైట్ ఆయిల్స్ తయారీకి మరిన్ని బ్లెండింగ్ ట్యాంకులను సైతం ఏర్పాటు చేయనుంది. -
దేశంలో తగ్గిన చమురు ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అంతకంతకూ తగ్గుతోంది. నవంబర్‌లో 2 శాతం క్షీణించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడాయిల్ ఉత్పత్తి గతేడాది నవంబర్‌లో 2.48 మిలియన్ టన్నులుగా ఉండగా, ఈ ఏడాది నవంబర్‌లో 2.43 టన్నులకు పరిమితమైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇది 2.5 మిలియన్ టన్నులుగా నమోదైంది. పరికరాలు, యంత్రాలను సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఉత్పత్తి 3 శాతం తగ్గి 1.6 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఆయిల్ ఇండియా ఉత్పత్తి 2,43,200 టన్నుల నుంచి 2,41,420 టన్నులకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్–నవంబర్ మధ్య) దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి 2.74 శాతం క్షీణించి 19.86 మిలియన్ టన్నులుగా నమోదైంది. దేశీయంగా ఇంధన అవసరాల కోసం భారత్ ఏటా 85 శాతం మేర క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు, కోవిడ్ దెబ్బతో కుదేలైన ఎకానమీ క్రమంగా పుంజుకుంటూ ఉండటంతో ఇంధన వినియోగం పెరిగి, రిఫైనరీల్లో ప్రాసెసింగ్ సైతం గణనీయంగా మెరుగుపడింది. రిఫైనరీలు .. నవంబర్‌లో 21.48 మిలియన్ టన్నుల క్రూడాయిల్ (గత నవంబర్‌తో పోలిస్తే 3.38 శాతం అధికం) ప్రాసెస్ చేశాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో ఇది 11.7% వృద్ధి చెంది 155.73 మిలియన్ టన్నులుగానమోదైంది. | గ్యాస్ 23 శాతం అప్.. నవంబర్‌లో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ఉత్పత్తి 23 శాతం పెరిగి 2.86 బిలియన్ ఘనపు మీటర్లుగా (బీసీఎం) నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ ఆధ్వర్యంలోని కేజీ–డీ6 బ్లాకులో కొత్త క్షేత్రాలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడింది. కేజీ–డీ6 నుంచి ఉత్పత్తి 1,251 శాతం ఎగిసి 581.36 బీసీఎంకి చేరగా, ఓఎన్జీసీ క్షేత్రాల్లో మాత్రం 5.28 శాతం క్షీణించి 1.72 బీసీఎంకి తగ్గింది. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో గ్యాస్ ఉత్పత్తి 21.78 శాతం పెరిగి 22.77 బీసీఎంకి చేరింది. చదవండి: Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు! -
8 కీలక పరిశ్రమల వృద్ధి ఓకే...
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు ఆగస్టులో 3.7 శాతంగా నమోదయ్యింది. జూలైలో ఈ రేటు 3.1 శాతం. ఎనిమిది పరిశ్రమల్లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పతి సూచీ (ఐఐపీ)లో వీటి వాటా దాదాపు 38%. ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ కొంత మెరుగైన ఫలితాలను నమోదుచేసుకోవడం వల్ల ఈ కీలక పరిశ్రమల వృద్ధి రేటు 7 నెలల గరిష్ట స్థాయిని తాకింది. ఆగస్టు ఐఐపీ గణాంకాలపై ఈ సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు విశ్లేషకుల అంచనా. 2012 ఆగస్టుతో పోల్చి 2013 ఆగస్టులో గణాంకాలను రంగాల వారీగా చూస్తే... ఎరువులు: గణాంకాలు క్షీణత (-2.1 శాతం) నుంచి వృద్ధి బాటకు ఎగశాయి. 1.7 శాతం వృద్ధి నమోదయ్యింది. ఉక్కు: వృద్ధి 2.9% నుంచి 4.3 శాతానికి ఎగసింది. సిమెంట్: ఉత్పత్తి వృద్ధి రేటు 0.4 శాతం నుంచి 5.5 శాతానికి చేరింది. విద్యుత్: భారీగా ఉత్పత్తి వృద్ధి 1.9 శాతం నుంచి 6.7 శాతానికి ఎగసింది. బొగ్గు: ఉత్పత్తి వృద్ధి రేటు 18.8 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గింది. రిఫైనరీ ప్రొడక్టులు: ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 31.8% నుంచి భారీగా 4.9 శాతానికి పడిపోయింది. క్రూడ్ ఆయిల్: క్షీణత (-) 0.6 శాతం నుంచి మరింతగా 1.5 శాతానికి జారింది. సహజ వాయువు: ఈ రంగంలో క్షీణత సైతం 13.5 శాతం నుంచి 16.1 శాతానికి పడిపోయింది. కాగా 2012 ఇదే నెలలో కీలక రంగాల వృద్ధి 6.1%. ఈఏడాది ఏప్రిల్- ఆగస్టు మధ్య గ్రూప్ వృద్ధి రేటు 2.3%. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 6.3 శాతం.