సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న కంపెనీ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ప్రముఖ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ కార్గిల్ ఇండియా తమ దక్షిణ భారతదేశ వ్యాపార విస్తరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.280 కోట్లతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ప్రపంచస్థాయి ప్రమాణాలతో వివిధ వంట నూనెల తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసి ఆధునీకరించినట్లు తెలిపింది. బుధవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘జెమిని ప్యూరిట్’ బ్రాండ్ పేరుతో సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ సందర్భంగా కార్గిల్ ఇండియా ఇన్‌గ్రిడియంట్స్ (దక్షిణాసియా) కన్జూమర్ బిజినెస్ లీడర్ అవినాష్ త్రిపాఠి మాట్లాడుతూ దేశవ్యాప్త సన్‌ఫ్లవర్ వినియోగంలో 70 శాతం దక్షిణ భారతదేశంలోనే జరుగుతోందని, దీంతో దక్షిణ దేశ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ‘జెమిని ప్యూరిట్’ని విజయవాడలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణపట్నం వద్ద సన్‌ఫ్లవర్, రిఫైండ్ పామాయిల్, పామోలిన్, వనస్పతి, బేకరీ షార్టెనింగ్స్‌ను తయారు చేసి అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశంలోనే అతిపెద్ద 4.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment