8 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి యూపీఐ, ఆధార్‌ కీలకం.. ఎలాగో తెలుసా.. | Sakshi
Sakshi News home page

8 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి యూపీఐ, ఆధార్‌ కీలకం.. ఎలాగో తెలుసా..

Published Thu, Feb 22 2024 11:26 AM

UPI And Aadhaar Will Be Key To Indian Economy Reaching 8 Trillion - Sakshi

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌ఫేస్ (యూపీఐ), ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) వల్ల 2030 నాటికి ఇండియా ఆర్థిక  వ్యవస్థ 8 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంలో కీలకంగా పనిచేయనున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

యూపీఐ, డీపీఐల ద్వారానే ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించగలదని నాస్కామ్‌ ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలియజేస్తుంది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్‌‌తో కలిసి నాస్కామ్ ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. డీపీఐలు భారతదేశ జనాభాలో 97 శాతం మందిపై ప్రభావం చూపుతున్నాయి. మెచ్యూర్డ్ డీపీఐల వల్ల 31.8 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరిగింది. ఇది 2022లో భారతదేశ జీడీపీలో 0.9 శాతానికి సమానం. 

ఇదీ చదవండి: ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్‌పే యాప్‌ స్టోర్‌..? ప్రత్యేకతలివే..

డైరెక్ట్​ బెనిఫిట్స్​ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో ఆధార్‌ను పరిచయం చేయడం ద్వారా దాదాపు 15.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి. యూపీఐ వల్ల నగదు లావాదేవీలు, పేపర్​ వాడకం  తగ్గింది. దాంతో కాలుష్యమూ తగ్గినట్లు నివేదికలో తేలింది. పేపర్‌వాడకం తగ్గడం వల్ల లాజిస్టిక్స్, రవాణా రంగంలో 2022లో 3.2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి.

Advertisement
Advertisement