వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్‌ | West Indies announce squad for T20 World Cup 2024 | Sakshi
Sakshi News home page

T20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్‌

Published Fri, May 3 2024 8:48 PM | Last Updated on Fri, May 3 2024 9:05 PM

West Indies announce squad for T20 World Cup 2024

టీ20 వరల్డ్‌కప్‌-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోవ్‌మన్ పావెల్ సారథ్యం వహించనున్నాడు. అదేవిధంగా ఈ వరల్డ్‌కప్‌ జట్టులో పవర్‌ హిట్టర్‌ షిమ్రాన్ హెట్‌మైర్‌కు చోటు దక్కింది. 

హెట్‌మైర్‌ చివరగా గతేడాది డిసెంబర్‌లో విండీస్‌ తరపున ఆడాడు. అదేవిధంగా విండీస్‌ యవ పేస్‌ సంచలనం షమర్ జోసెఫ్‌కు కూడా ఈ మెగా టోర్నీ జట్టులో సెలక్టర్లు ఛాన్స్‌ ఇచ్చారు. అదే విధంగా ఈ జట్టులో నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్,షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రోమారియో షెఫర్డ్ వంటి విధ్వంస ఆటగాళ్లు ఉన్నారు. 

పేపర్‌పై బలంగా కన్పిస్తున్న కరేబియన్లు తమ సొంత గడ్డపై ఎలా రాణిస్తారో వేచి చూడాలి. ఇక ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ వంటి క్రికెట్‌ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్‌ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డల్లాస్‌ వేదికగా అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి.

టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్‌ జట్టు
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్‌), అల్జారీ జోసెఫ్ (వైస్‌ కెప్టెన్‌), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రోమారియో షెఫర్డ్.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement