ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి చూశాం ఫ చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోలేం ఫ మనసు విప్పిన ‘తూర్పు’ ఫ ఉమ్మడి జిల్లాలో ‘సాక్షి’ రోడ్‌ షో ఫ ఆరు నియోజకవర్గాల్లో 82 కిలోమీటర్ల మేర నిర్వహణ | Sakshi
Sakshi News home page

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి చూశాం ఫ చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోలేం ఫ మనసు విప్పిన ‘తూర్పు’ ఫ ఉమ్మడి జిల్లాలో ‘సాక్షి’ రోడ్‌ షో ఫ ఆరు నియోజకవర్గాల్లో 82 కిలోమీటర్ల మేర నిర్వహణ

Published Thu, May 9 2024 9:25 AM

ఫ మా

రాజమహేంద్రవరం లలితానగర్‌కు బుధవారం ఉదయం 8.30 గంటలకు చేరుకున్నాం. అప్పుడే అపార్టుమెంట్‌లో నైట్‌ వాచ్‌మన్‌గా పని చేసి ఉదయాన్నే ఇంటికి వెళుతున్న టేకి శ్రీనును కలిశాం. ‘జగనన్న పథకాలతో మా ఇంట్లో అందరం లబ్ధి పొందాం. ఇప్పటి వరకూ ఎవ్వరూ అలా చేయలేదు. ఇల్లు కట్టుకోవడానికి మాకు స్థలం వచ్చింది. మా కుమార్తెకు అమ్మ ఒడి వచ్చింది. మా అత్తయ్యకు చేయూత రూ.18 వేలు అందాయి. మేము ఇన్ని రకాలుగా జగన్‌ వల్ల మేలు పొందాం. ఉన్న పథకాలను కొనసాగిస్తామని జగన్‌ చెప్పారు. ఇక ఆయనకు కాకుండా మరెవరికి ఓటేస్తాం చెప్పండి!’ అని శ్రీను సంతోషంగా చెప్పారు.

● అనంతరం మోరంపూడి చేరుకున్నాం. అక్కడ ఒక హోటల్‌లో టిఫిన్‌ చేస్తున్న నాగేశ్వరరావు, వెంకన్న అనే ఇద్దరు రోజు కూలీలతో మాటలు కలిపాం. ‘ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దళారీలు లేకుండా పథకాలన్నీ నూరు శాతం మా ఇంటికి చేర్చిన జగన్‌ను ఎలా మరచిపోతాం?’ అని నాగేశ్వరరావు సంతోషంగా అన్నారు. ‘పైన ముఖ్యమంత్రి జగన్‌, ఇక్కడ భరత్‌ ఎంతో అభివృద్ధి చేసి రాజమండ్రిని సుందరమైన నగరంగా తీర్చిదిద్దారు. వారిని మరోసారి గెలిపించుకుంటాం’ అని చెప్పారు.

● అక్కడి నుంచి కలెక్టరేట్‌ సమీపాన రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని హార్లిక్స్‌ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నాం. రోడ్డు పక్కన చిన్న కిళ్లీ దుకాణం వద్ద కొద్దిసేపు ఆగి దుకాణ యజమాని రమేష్‌తో మాట కలిపాం. ఆయన ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా ‘ఈ ప్రభుత్వం వల్లే కదా మా కుటుంబమంతా లోటు లేకుండా నడిచిపోతోంది’ అని అన్నారు. అదెలాగని అడిగాం. ‘దేనినైనా తీసుకోండి. ఒకటేమిటి మా కుటుంబంలో అన్ని పథకాలూ అందాయని చెప్తే మొదట్లో చాలామంది నమ్మలేదు. తరువాత తరువాత మా ఖాతాల్లో డబ్బులు చూసి నిజం తెలిసొచ్చింది’ అని చెప్పారు.

● వేమగిరి జంక్షన్‌ వద్ద చేరుకునేసరికి 10.10 గంటలైంది. జాతీయ రహదారి క్రాస్‌ చేసి కడియం వెళ్లేందుకు రోడ్డు దాటాం. వేమగిరి గ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని మేజర్‌ పంచాయతీ. ఆ జంక్షన్‌లో మిఠాయి దుకాణం నడుపుతున్న 60 ఏళ్ల వెంకటేశ్వరరావును కలిశాం. ‘అన్ని పథకాలూ బాగానే వస్తున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా ఎవరి అవసరం లేకుండా బ్యాంక్‌ ఖాతాలో డబ్బు వేసేస్తున్నారు’ అని చాలా సంతోషంగా చెప్పారు. అయితే ఇసుక కాస్త త్వరగా దొరికేటట్టు చేస్తే మరింత బాగుంటుందని అన్నారు.

● వేమగిరి జంక్షన్‌ దాటి అర కిలోమీటరు ముందుకు వెళ్లేసరికి ఆర్టీసీ బస్సు కోసం వేచి చూస్తున్న తాపీ మేస్త్రి నారాయణ కుటుంబం కనిపించింది. వారిది మండపేట నియోజకవర్గంలోని తాపేశ్వరం గ్రామం. నారాయణను పలకరిస్తే ‘పనులు బాగా దొరుకుతున్నాయి. పనులు లేక ఇక్కడి జనం ఎక్కడెక్కడికో మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోతున్నారంటూ ప్రభుత్వాన్ని కావాలనే బ్యాడ్‌ చేస్తున్నారు’ అని ధైర్యంగా చెప్పారు. అతని భార్య మంగమ్మతో మాట కలిపితే ‘ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేశాను. వారికి ఇద్దరేసి పిల్లలు. ముగ్గురు మనవరాళ్లకు ఎవరి దయాదాక్షిణ్యాలతో పని లేకుండా అమ్మ ఒడి రూ.15 వేలు క్రమం తప్పకుండా వారి ఖాతాల్లో నేరుగా పడింది. ప్రభుత్వ బడులు చాలా బాగు చేశారు. పిల్లలు కూడా చాలా ఆనందంగా స్కూలుకు వెళుతున్నారు. డ్వాక్రా రుణ మాఫీ అయ్యింది. సున్నా వడ్డీ సొమ్ములు కూడా పడ్డాయి. చేయూత కూడా ఈ మధ్యనే వచ్చింది. ఇంతకంటే ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది?’ అని అన్నారామె.

● కడియం వెళ్లేసరికి జిల్లా గ్రంథాలయ సంస్థ రిటైర్డ్‌ ఉద్యోగి చిట్టిబాబు కనిపించారు. ‘గతంలో ప్రభుత్వ సాయం కావాలంటే మధ్యలో దళారీలకు ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు చూశాం. ఈ ఐదేళ్లలో ఎప్పుడూ ఏ పనికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాలని అడిగిన వాడు లేడంటే నమ్ముతారా! నమ్మాల్సిందే! కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం.. ఇలా ఏది కావాల్సి వచ్చినా క్షణాల్లో పది అడుగులు వేస్తే వచ్చే గ్రామ సచివాలయంలోనే తీసుకుంటున్నాం. నిజంగా ప్రజల వద్దకు పాలన అంటే ఇదే అనేలా ప్రభుత్వ పాలనను పల్లెల్లోకి తీసుకు వచ్చారు. ఈ డెవలప్‌మెంట్‌ను ఎవరు మాత్రం మరచిపోతారు చెప్పండి’ అని ఆయనన్నారు.

● కడియం గ్రామంలోనే మహిళ శెట్టి వరలక్ష్మితో మాట్లాడాం. ‘ఈ సంక్షేమ పథకాలు మాలాంటి పేదలకు చేదోడవుతున్నాయి. జగన్‌ మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని దేవుళ్లందరినీ వేడుకుంటున్నాం. నా కుటుంబానికి ఆయన చేసిన సహాయం మరచిపోలేనిది. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మా గ్రూపునకు రూ.7.55 లక్షలు రావడం మా అందరి కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఒక్కొక్కరికి రూ.18,875 వచ్చాయి. కాపు నేస్తంగా రూ.15 వేలు నా బ్యాంక్‌ ఖాతాలో వేశారు. సున్నా వడ్డీగా రూ.21 వేలు వచ్చాయి’ అని చెప్పారు.

● మండపేట నియోజకవర్గం కేశవరంలో రోడ్డు పక్కన చిన్న రేకుల షెడ్డులో ఉన్న టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకురాలు పద్మజతో మాట్లాడాం. ‘మా పెద్ద పిల్లాడు ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశాడు. ఎంసెట్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. రెండో కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇది వరకు ప్రభుత్వ బడుల్లో తెలుగు చదవడమే గగనమైపోయేది. మూడేళ్లుగా ఇంగ్లిషుపై జగనన్న ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో మా పిల్లలు ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడగలుగుతూండటం చూస్తే చాలా సంతోషమనిపిస్తోంది. ఇలా రాణిస్తారని కలలో కూడా ఊహించలేదు’ అని అన్నారు.

● ద్వారపూడిలో కళ్లంలో ధాన్యం ఆరబెట్టుకుంటున్న మధ్యతరగతి రైతు కె.సత్యనారాయణతో కొద్దిసేపు మాట కలిపాం. ‘జగన్‌ ప్రభుత్వం వచ్చాక ధాన్యం ఇలా అమ్మితే అలా ఖాతాలో డబ్బు వచ్చి పడింది. రెండెకరాలు సాగు చేస్తే 80 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. కళ్లాల్లో ఉండగానే అమ్మేశాను. నాలుగు రోజులు కూడా తిరగకుండానే కనీస మద్దతు ధర రూ.1,560 వంతున ప్రభుత్వం మా ఖాతాల్లో వేసేసింది. గతంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడమనేదే ఉండేది కాదు’ అని ఆయనన్నారు.

● ద్వారపూడి నుంచి కె.గంగవరం మండలం కోటిపల్లి కోట చేరుకున్నాం. వలలు కుట్టుకునే టైలర్‌ నాగభైరవస్వామి తారసపడితే మాట కలిపాం. ‘ఈ రోజు చమురు సంస్థల పరిహారం మాకు అందిందంటే జగన్‌ వల్లే సాధ్యమైంది. గతంలో చమురు సంస్థల పరిహారం అందలేదు. అప్పటి మా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ద్వారా పరిహారం ఇవ్వాలని కోరినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వంలో మా అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ పుణ్యమా అని మా కుటుంబాలలో కొంతమందికి చమురు సంస్థల పరిహారం అందింది. నాకు పెన్షన్‌ వస్తోంది. ఒకటో తేదీనే వలంటీర్‌ పట్టుకుని వచ్చి ఇస్తున్నారు’ అని భైరవస్వామి చెప్పారు.

● కోటిపల్లి కోట గ్రామానికి చెందిన మత్స్యకారుడు పెమ్మాడి మల్లేశ్వరరావును కలిశాం. ‘ఏటా వేట విరామం సమయంలో మూడు నెలల పాటు నష్టపరిహారం రూపంలో రూ.70 వేలు అందుకున్నాం. ఆ సొమ్ముతో అప్పులు తీర్చుకున్నాం. చేపల వేటకు అవసరమైన వలలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసుకున్నాం. దీంతో కుటుంబ పోషణకు ఆసరా దొరికింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మత్స్యకారులను నవరత్నాల పథకాలతో ఆదుకోవడంతో పాటు చమురు సంస్థల నుంచి నష్ట పరిహారం తగిన సమయంలో అందేలా చేస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న వారిలో పిల్లి సూర్యప్రకాష్‌ను గెలిపించుకుంటాం’ అని చెప్పారు.

● Æ>Ð]l$-^èl…-{§ýlç³#Æý‡… Ð]l$…yýlÌS…ÌZ° §ýl„ìS×æ M>ÖV> õ³Æö…¨¯]l {§é„>-Æ>Ð]l$ {V>Ð]l$…ÌZ Ð]l$íßæâýæ ¯]l$¯]l² }§ólÑ™ø Ð]l*sêÏ-yé…. "¯é ¿ýæÆý‡¢ ™éï³ Ðól$[íÜ¢. ¯ól¯]l$ OsñæÌS-Ç…VŠæ ^ólçÜ$¢…-sê¯]l$. Ð]l* MýS$r$…-»ê-°MìS fVýS-¯]l¯]l² {糿¶æ$-™èlÓ…ÌZ AÐ]l$à Jyìl, fVýS-¯]l¯]l² ^ól§øyýl$, OÐðlGÝëÞÆŠ‡ çÜ$¯é² Ð]lyîlz, OÐðlGÝëÞÆŠ‡ BçÜÆ> ç³£ýl-M>Ë$ A…§éƇ$$. Òsìæ™ø ´ër$ C…sìæ çܦÌS… MýS*yé Ð]l$…þOÆð‡…¨. AƇ¬™ól Mö°² Ýë…MóS-†MýS M>Æý‡×êÌS M>Æý‡×æ…V> C…M> B C…sìæ çܦÌS… Ð]l*MýS$ A«¨M>Æý‡$Ë$ ^èl*í³…-^èlÌôæ§ýl$. Mö…™èl-Ð]l$…¨ ™ðlË$-VýS$§ólÔèæ… ¯éĶæ$-MýS$Ë$ ÐéâýæÏ {糿¶æ$™èlÓ… Ð]lõÜ¢ ^èl…{§ýl-»êº$ Æð‡…yýl$ òÜ…rÏ çܦÌS… CÝë¢Æý‡° ÑçÜ¢–™èl…V> {ç³^éÆý‡… ^ólçÜ$¢¯é²Æý‡$. M>± ™ðlË$VýS$§ólÔ¶æ… ´ëÈt ¯éĶæ$MýS$Ë Ð]l*rÌSOò³ Ð]l*MýS$ ¯]lÐ]l$ÃMýS… Ìôæ§ýl$. OÐðlG‹Ü fVýS¯ŒæÐðl*çß毌æÆð‡yìlz Ð]l$äÏ Ð]l¬QÅ-Ð]l$…{† AĶæ*ÅMýS Ð]l*MýS$ C_a¯]l òÜ…r$-¯]l²Æý‡ çܦÌS…ÌZ C…sìæ °Æ>Ã×æ… ^ólçÜ$Mø-Ð]l-yé-°MìS A°² Ñ«§éÌê çÜçßæMýS-Ç-Ýë¢-Æý‡¯]l² ¯]lÐ]l$ÃMýS… E…¨. BĶæ$¯]l Ð]l*r C^éaÆý‡…sôæ °Ë$ç³#MýS$…sêÆý‡$. Ðól$… M>ç³# MýS$Ìê°MìS ^ðl…¨¯]l ÐéâýæÏ…. Ð]l* A»ê¾Æ‡$$ Ððl¬¯]l²sìæ Ð]lÆý‡MýS* ç³Ð]l¯ŒS MýSÌêÅ׊æ A…r* f¯]lõܯ]l ´ëÈt ™èlÆý‡$çœ#¯]l †Ç-VóS-Ðéyýl$. G糚-Oyðl™ól ç³Ð]l¯ŒS MýSÌêÅ׊æ sîæyîlï³, ½gôæï³™ø ´÷™èl$¢-ÌS™ø Ð]l¬…§ýl$MýS$ Ð]l^éayø Aç³µyól ÐéyìlMìS MýS*yé ç³Ð]l-¯ŒSMýSÌêÅ׊æOò³ ¯]lÐ]l$ÃMýS… ç³NÇ¢V> ´ùƇ$$…-¨. A…§ýl$MóS {ç³çÜ$¢™èl… CMýSPyýl OÐðlGÝëÞÆŠ‡ ïÜï³ GÐðl$ÃÌôæÅ A¿ýæÅ-Ǧ í³ÍÏ çÜ*Æý‡Å-{ç³-M>-ÔŒæ™ø MýSÌSíÜ G°²MýSÌS {ç³^é-Æý‡…ÌZ ´ëÌŸY…-r$¯é²yýl$' A° }§ólÑ ^ðl´ëµÆý‡$. ḍ

సాయం చేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటారు తూర్పు గోదావరి జిల్లా వాసులు. అటువంటి వారు.. చరిత్రలోనే తొలిసారిగా గడచిన ఐదేళ్లలో లంచాలు లేని పాలనను ప్రజల ముంగిటకే తెచ్చిన ప్రభుత్వంపై ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కూలీల నుంచి ఒక మోస్తరు మధ్య తరగతి కుటుంబీకుల వరకూ అందరి నోటా ‘మా జగనన్న చేసిన సాయం ఎలా మరచిపోతాం’ అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో జనం నాడి తెలుసుకునే చిరు ప్రయత్నాన్ని ‘సాక్షి’ రోడ్‌ షో ద్వారా చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నగరం నుంచి మొదలైన ఈ రోడ్‌ షో రాజమహేంద్రవరం రూరల్‌, మండపేట, రామచంద్రపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల మీదుగా కాకినాడ నగరం వరకూ సాగింది. నగరం, పట్టణం, మండల కేంద్రం, మేజర్‌ గ్రామ పంచాయతీ, మైనర్‌ పంచాయతీ.. ఇలా ఎక్కడ ఎవరిని కదిలించినా ప్రతి కుటుంబంలోనూ నలుగురైదుగురికి సంక్షేమ పథకాలతో ప్రభుత్వం సాయం అందించి, తమ జీవితాల్లో వెలుగులు నింపిందని నిండైన కృతజ్ఞతతో చెబుతున్న వారే కనిపించారు. చిల్లిగవ్వ లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సాయం ఎప్పటికీ మరచిపోలేమని చెప్పారు. అటువంటి నాయకుడిని తప్ప మరెవరిని కోరుకుంటామని అన్న వారే ఎక్కువగా కనిపించారు. ఇంత మంచి పాలన అందించడం ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఎందుకు సాధ్యం కాలేదని దారి పొడవునా ఉన్న పల్లెల్లో ప్రజలు ఆడ, మగ అనే తేడా లేకుండా అడిగారు. ఎన్నికల ముందు ఆయన ఉత్తుత్తి హామీలు ఇచ్చి తర్వాత ముఖం చాటేశారని, మళ్లీ ఇప్పుడు ఇస్తున్న హామీలను నమ్మలేమనే మాట అందరి నోటా వినిపించింది.

రామచంద్రపురం మెయిన్‌ సెంటర్‌లో చిన్నకారు రైతు సుందర జ్యోతికుమార్‌ కనిపించారు. ఆయనది కె.గంగవరం ఎస్సీ పేట. ‘జగన్‌ ప్రభుత్వంతో మా ఇంట్లోని ప్రతి ఒక్కరికీ లబ్ధి కలిగింది. ఆ మేలు మరచిపోలేం. మళ్లీ జగనన్నకే ఓటు వేసి సీఎంను చేయడానికి మా పేట అంతా కలసికట్టుగా ఉంది. మా అబ్బాయికి అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి. నాకు రైతు భరోసా సొమ్ములు పడ్డాయి. మా నాన్నకు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించాను. ఆయనకు నెలనెలా పింఛన్‌ సొమ్ములు వస్తున్నాయి. మా అమ్మకు ఆసరా సొమ్ములు వచ్చాయి. మా కుటుంబంలో అందరికీ మేలు జరిగింది. నేను జగన్‌, వైఎస్సార్‌ సీపీ వెంటే ఉంటాను. మా ఎస్సీ పేటలో మాలాగా లబ్ధి పొందిన వారు చాలామంది జగన్‌మోహన్‌రెడ్డి అంటేనే నమ్ముతున్నారు’ అని జ్యోతికుమార్‌ అన్నారు.

రామచంద్రపురం – కాకినాడ వెళ్లే దారిలో నరసాపురపుపేటలో పండ్ల వ్యాపారి సలాది నారాయణ మణికంఠను కలిశాం. ‘ఈ ఐదేళ్లలో పేదలకు బాగా సాయం జరిగింది. సాయం చేసిన వారిని మా ప్రాంతంలో గుండెల్లో పెట్టుకుంటారు. నా దుకాణం వద్దకు వచ్చే వారిలో చాలామంది ప్రభుత్వం బాగా పని చేస్తోందనే చెబుతున్నారు. నా అభిప్రాయం కూడా అదే’ అని అన్నారు.

కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కరప మండలం వేళంగిలో మండిపోతున్న ఎండకు తాళలేక చెట్టు నీడన కూర్చున్న రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి పి.వీర వెంకట సత్యనారాయణను కలిశాం. ‘గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా ప్రజల బాగోగులు చూసిన వాళ్లను ఇన్నేళ్ల సర్వీసులో నేను ఎప్పుడూ చూడలేదు. రేషన్‌ దుకాణం వద్దకు వెళ్లనవసరం లేకుండా మా ఇంటికే వచ్చి ఇస్తున్నారు. వయస్సు మీద పడిన నాలాంటి వారికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి’ అని ఆయన ప్రశ్నించారు. ‘మా ఇంటికి కూతవేటు దూరంలోనే గ్రామ సచివాలయం ఉంది. ఏ అవసరం వచ్చినా నాలుగడుగులు వేసి వెళ్తే అక్కడి ఉద్యోగులు ఏ పనయినా నిమిషాల్లో చేసి పెడుతున్నారు. వచ్చేది కూడా జగన్‌ ప్రభుత్వమే. వచ్చే ఎన్నికల్లో పైన జగన్‌మోహన్‌రెడ్డిని, మా నియోజకవర్గంలో కురసాల కన్నబాబును గెలిపించుకుంటాం’ అని స్పష్టంగా చెప్పారు.

కాకినాడ తూరంగి వద్ద అప్పుడే తాపీ పనికి సహాయకురాలిగా వెళ్లి, ఆటోలో తిరిగి ఇంటికి వస్తున్న శాంతమ్మను కలిశాం. ‘మా బోటి కుటుంబాల్లో ఈ రోజు మేమంతా సంతోషంగా ఉన్నామంటే జగనన్న ప్రభుత్వం చేసిన మేలే కారణం. సకాలంలో డ్వాక్రా రుణాలు ఇచ్చారు. ఆ ఇచ్చిన రూ.లక్షతో ఇంటి వద్ద చిన్న దుకాణం పెట్టుకున్నాను. ఉదయం పూట పనిలోకి వెళ్లి వచ్చి మధ్యాహ్నం నుంచి దుకాణం చూసుకుని పిల్లలను చదివించుకుంటున్నాను. జగన్నాథపురంలో ఒకప్పుడు శ్లాబులు ఊడిపోయి కూలిపోతుందనేలా ఉండే పాఠశాలకు పంపాలంటే భయపడే వాళ్లం. ఇప్పుడు మా బడి బాగా బాగు చేశారు. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు’ అని శాంతమ్మ చెప్పారు.

– సాక్షి ప్రతినిధి, కాకినాడ,

– సాక్షి, రాజమహేంద్రవరం, సాక్షి, అమలాపురం

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి
1/6

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి
2/6

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి
3/6

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి
4/6

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి
5/6

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి
6/6

ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి

Advertisement
 
Advertisement
 
Advertisement