Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..? | Sakshi
Sakshi News home page

Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?

Published Thu, May 9 2024 4:52 PM

Curry Leaves On Empty Stomach check these Health Benefits

భారతీయ వంటల్లో కరివేపాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దీని వల్ల వంటలకు సువాసనను, రుచిని అందించడమే కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి  చూద్దాం.

ఉదయాన్నే శుభ్రమైన కరివేపాకును నమిలి తినవచ్చు.  లేదా కరివేపాకు నీటిని తాగవచ్చు.

కరివేపాకు డీటాక్స్‌  వాటర్‌ 
గ్లాసుడు నీళ్లలో కొంచెం కరివేపాకులు వేసి మరిగించాలి. అలాగే పుదీనా ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి కొన్ని నిమిషాలు మరిగించాలి.  దీనికి కొద్దిగా తేనె లేదా, నిమ్మరసం కలపు కొని తాగవచ్చు.

జీర్ణక్రియలో సహాయపడుతుంది
ఫైబర్ నిండిన కరివేపాకు జీర్ణవ్యవస్థకు మంచిది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. కరివేపాకు నీటిని ఉదయాన్నే మోతాదుగా తీసుకుంటే  మంచిది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది: కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్ లక్షణం శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది.  ముఖ్యంగా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జుట్టు పెరుగుదలకు గ్రేట్: జుట్టుకు సహాయపడే గుణాలకు ప్రసిద్ధి చెందిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.  దీంతో జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యానికి సాయపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది: యాంటీఆక్సిడెంట్లతో నిండిన కరివేపాకు చర్మానికి హాని కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అల్పాహారానికి ముందు క్రమం తప్పకుండా ఈ నీటిని తాగితే చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.  సహజమైన, ప్రకాశవంతమైన మెరుపు వస్తుంది.

రోగనిరోధకశక్తికి బూస్టర్‌: కరివేపాకులో పోషకాలు ఎక్కువ. ఫైబర్‌ ఎక్కువ  విటమిన్ సీ,  ఇతర శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన కరివేపాకు సహజంగానే రోగనిరోధక శక్తి బూస్టర్‌లా పనిచేస్తుంది. కరివేపాకు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు ,  వ్యాధులకు వ్యతిరేకంగా శరీర శక్తి పెరుగుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: కరివేపాకు గుండె ఆరోగ్యానికి చాలామంచిది. అవి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకున్న కరివేపాకు నీళ్లతో గుండె సంబంధిత సమస్యలును నివారించుకోవచ్చు.

బ్లడ్‌ షుగర్‌: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం. హై పోగ్లైసీమిక్ లక్షణాలతో కూడిన కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థ వంతంగా సమతుల్యం చేస్తుంది.

అధిక బరువు: ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే కరివేపాకును నమిలి తింటే అధిక బరువుతో బాధపడుతున్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. కరివేపాకు వాటర్‌ ఆకలిని నియంత్రిస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. 

నోట్‌: ఇది  అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఆహారంలో ఏవైనా మార్పులు  చేసే ముందు డైటీషియన్ లేదా మీ వైద్యుడిని సంప్రదించండి.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement