పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా? | Sakshi
Sakshi News home page

పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?

Published Thu, Jan 25 2024 10:04 AM

Stickers On Fruits: Deciphering What They Mean - Sakshi

మాములుగా అందరం ఆరోగ్యం కోసం పళ్లను తినడం జరుగుతుంది. అయితే చాలా పండ్లలో కొన్నింటికి మాత్రం వాటిపై స్టిక్కర్లు అంటించి ఉంటాయి. ఎందుకిలా స్టిక్కర్లు అంటిస్తారనేది చాలామందికి తెలియదు. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్లకు ఇలా స్టిక్కర్లు ఉంటాయోమో అనుకుంటాం . మరికొందరూ అలా స్టిక్కర్లు ఉన్న పళ్లే మంచివని కూడా అనుకుంటారు. అసలు ఇంతకీ ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అంటిస్తారు?. దానికేమైన అర్థం ఉందా? తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా!.

పండ్లపై ఉండే స్టిక్కర్ల గురించి ఇటీవలేఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ స్టిక్కర్ల వినియోగం గురించి కీలక ప్రకటన చేసింది. ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అతికిస్తారు, వాటి అర్థం ఏంటో సవివరంగా వెల్లడించింది. ఇక ఫుడ్‌ సేఫ్టి అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకారం..నాణ్యత, ధరతో పాటు పండ్లను ఏ విధంగా పండించారనే సమాచారాన్ని ఈ స్టిక్కర్లు సూచిస్తాయి.

ఫ్రూట్స్కు అంటించే స్టిక్కర్లలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఐదు నంబర్లు ఉండి అది 9తో మొదలైతే ఆ పండ్లు ఆర్గానిక్ ఫామ్ లో పండించారని, వందకు వంద శాతం నాచురల్ అని అర్థం. అదే కోడ్ ఐదు నంబర్లు ఉండి 8తో స్టార్ట్ అయితే ఆ ఫ్రూట్స్ సగం ఆర్గానిక్, సగం కెమికల్స్ వినియోగించినట్లని తెలుస్తోంది. ఒకవేళ నాలుగు నంబర్లు ఉడి అది నాలుగుతో స్టార్ట్ అయితే అది పూర్తిగా కెమికల్స్తో పండించారని, ఇన్ఆర్గానిక్ అని భావించవచ్చు. అలాగే స్టిక్కర్లపై ఎటువంటి నంబర్లు లేకపోతే మార్కెట్లో అమ్మకం దారులు మోసం చేస్తున్నారని అర్థం. ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసే సమయంలో ఆలోచించి కొనుగోలు చేయండి.

(చదవండి: చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకూడదంటే ఇలా చేయండి!)

Advertisement

తప్పక చదవండి

Advertisement