మిస్‌ వరల్డ్‌గా చెక్‌ రిపబ్లిక్‌ సుందరి క్రిస్టినా పిజ్‌కోవా | Sakshi
Sakshi News home page

మిస్‌ వరల్డ్‌గా చెక్‌ రిపబ్లిక్‌ సుందరి క్రిస్టినా పిజ్‌కోవా

Published Sun, Mar 10 2024 5:11 AM

Czech Republic Krystyna Pyszkova Wins Miss World 2024 - Sakshi

మిస్‌ వరల్డ్‌–2024 కిరీటాన్ని చెక్‌ రిపబ్లిక్‌ సుందర్‌ క్రిస్టినా పిజ్‌కోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం ఫైనల్స్‌ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలండ్‌కు చెందిన ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ కరోలినా కిరీటం ధరింపజేశారు. రన్నరప్‌గా మిస్‌ లెబనాన్‌ యాస్మినా జెటౌన్‌ ఎంపికయ్యారు.

భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్‌ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు.   మిస్‌ వరల్డ్‌ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్‌ ఆతిథ్యమిచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement