మార్కెట్‌లో కొనుగోళ్లు చేపట్టాలి | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో కొనుగోళ్లు చేపట్టాలి

Published Sat, Apr 20 2024 1:55 AM

మార్కెట్‌ ఆవరణలో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు - Sakshi

జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో పదిరోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో సరుకులను అమ్ముకునేందుకు వచ్చే రైతులతో పాటు మార్కెట్‌పై ఆధారపడిన హమాలీలు, దడువాయిలు, స్వీపర్లు, కమీషన్‌ ఏజెంట్లు(అడ్తి) ఇబ్బంది పడుతున్నారు.. తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని ది గ్రెయిన్‌ మార్కెట్‌ అడ్తి అసోసియేషన్‌ అధ్యక్షుడు మాశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌కు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల మార్కెట్‌కు ధాన్యం అధికంగా రావడంతో కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడుతోందని ఆపివేశారని, దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రైతులతో పాటు మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కొనుగోళ్లు త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం గౌర అధ్యక్షుడు బుస్సా లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి సముద్రాల హన్మంతరావు, కోశాధికారి కాచం సురేష్‌, గోవింద్‌ లోహియా, శర్విరాల ఉపేందర్‌, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేశేఖర్‌, నాగభూషణం, అశోక్‌, సత్యకుమార్‌, రామాంజనేయులు, ప్రభాకర్‌, రాజు, మధు తదితరులు ఉన్నారు.

గ్రెయిన్‌ మార్కెట్‌ అడ్తి అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

Advertisement
Advertisement