ఫైనల్‌కు.. ‘ప్రేరణ’! | Sakshi
Sakshi News home page

ఫైనల్‌కు.. ‘ప్రేరణ’!

Published Mon, Apr 8 2024 1:10 AM

- - Sakshi

● పూర్తయిన పాఠశాల స్థాయి ఎంపికలు ● ఈనెల 10న జిల్లాస్థాయి విద్యార్థుల ఎంపిక ● ప్రతీ జిల్లా నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం!

ప్రేరణకు ఎంపికై తే..

ప్రేరణకు ఎంపికై న విద్యార్థులను వాద్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో పురావస్తు, చారిత్రక కట్ట డాలకు తీసుకెళ్తారు. వివిధ రాష్ట్రాలకు చెంది న విద్యార్థులు ఇక్కడికి వస్తారు. ఇతర రాష్ట్రాల జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. చంద్రుడిపై చంద్రయాన్‌ ల్యాండింగ్‌ నుంచి పలు విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజె న్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, నాయకత్వ లక్షణాలు, భి న్నత్వంలో ఏకత్వం, యోగా, ధైర్యసాహసాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.

మంచిర్యాలఅర్బన్‌: వేసవి సెలవుల్లో విద్యార్థుల మేధస్సుకు పదునుపెట్టి సృజనాత్మకతను వెలికితీసేలా కేంద్ర ప్రభుత్వం ప్రేరణ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చది వే తొమ్మిది, పది, ఇంటర్‌ విద్యార్థులు అర్హులుగా ప్రకటించారు. ఈమేరకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో పాఠశాలస్థాయిలో మెరిట్‌ ఆధారంగా జిల్లాస్థాయికి విద్యార్థుల ను ఎంపిక చేశారు. వీరి నుంచి ఇద్దరు విద్యార్థుల ను జిల్లా తరఫున ఎంపిక చేయనున్నారు. ప్రేరణకు ఎంపికై న విద్యార్థులకు గుజరాత్‌లోని మోహసానా జిల్లా వాద్‌నగర్‌లోని వెర్నాక్యులర్‌ పాఠశాలలో వారం రోజులు శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రేరణ ఉత్సవం ఇలా..

జిల్లాలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠశాలస్థాయి, జిల్లాస్థాయి ప్రేరణ ఉత్స వం నిర్వహిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12 వరకు చదివే విద్యార్థులు ఈ ఉ త్సవంలో పాల్గొనేందుకు అర్హులు. ఇప్పటికే పాఠశా ల స్థాయి ఎంపిక పూర్తి చేశారు. వీరికి ఈనెల 10 వి కసిత భారతం, సమాజానికి, దేశానికి నా యొక్క చేయూత అనే అంశాలపై పోటీ నిర్వహించనున్నా రు. నోడల్‌ అధికారి, ప్రిన్సిపాల్‌ కేంద్రీయ విద్యాలయం పర్యవేక్షణలో పోటీలు జరుగనున్నాయి.

పాఠశాల స్థాయిలో ఇలా..

‘ప్రేరణ’ ఉత్సవ్‌లో భాగంగా పాఠశాల స్థాయిలో వ్యక్తృత్వ, పాటలు, పెయింటింగ్‌, స్టోరీ రైటింగ్‌ పోటీలు నిర్వహించారు. వీటిలో ప్రతిభ కనబరిచిన వి ద్యార్థులను జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. ఇలా జి ల్లా వ్యాప్తంగా 170 మంది జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 10న కేంద్రీయ విద్యాలయంలో వీ రికి ప్రేరణకు నన్ను ఎందుకు ఎంపిక చేయాలి, భా రతదేశంపై నావిజన్‌, వికసిత్‌ భారత్‌, అనే అంశాలపై పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపి న 30(బాలురు, బాలికలు)విద్యార్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. వీరిలో నుంచి ఇద్దరిని జిల్లా తరఫున ఎంపిక చేశారు.

విద్యార్థులకు మంచి అవకాశం

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రేరణ కార్యక్రమం వి ద్యార్థులకు మంచి అవకాశం. జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ప్రేరణ ద్వారా ప్రేరణకు ఎంపికవుతారు. వీరిని వారం రోజులపాటు గుజారాత్‌ వాద్‌నగర్‌లో శిక్షణ ఇస్తారు. పురవస్తు, చారిత్రక కట్టడాలు చూసే అవకాశం ఉంటుంది.

– ఎస్‌.యాదయ్య, డీఈవో

1/1

Advertisement
Advertisement