Anchor Vishnu Priya's Latest Pics Looks Like As Samantha In Varanasi - Sakshi
Sakshi News home page

Vishnu Priya: సమంత బాటలో విష్ణుప్రియ.. అసలేంటీ కథ!

Published Sat, Jul 22 2023 3:31 PM

Anchor Vishnu Priya Latest Pics Looks Like As Samantha In Varanasi - Sakshi

యాంకర్ విష్ణు ప్రియ పరిచయం అక్కర్లేని పేరు.  ఫోక్‌ సాంగ్స్‌ చేస్తూ యువతను అలరిస్తోంది. మానస్‌తో కలిసి స్టెప్పులు వేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.  బుల్లితెరపైనా ఈ ఇద్దరూ కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నారు.  అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఎప్పుడు వెకేషన్ అంటూ బీచ్‌లు తిరిగే విష్ణుప్రియ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక బాట పట్టింది. సమంతను ఫాలో అవుతూ ఆలయాలను సందరిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఈషా ఫౌండేషన్‌లో ఎక్కువగా కనిపించే విష్ణు ప్రియ.. ఇటీవలే నాసిక్ కూడా వెళ్లింది. తాజాగా వారణాసిలో కనిపించింది.

(ఇది చదవండి: నా సినిమా వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారంటే: కాజల్‌ అగర్వాల్‌)

యూపీలోని వారణాసికి వెళ్లిన విష్ణుప్రియ ప్రత్యేకంగా కనిపించింది. మెడలో దండ వేసుకుని పూర్తి సమంతను గుర్తుకు తెచ్చింది. ఇటీవలే సమంత ఇషా ఫౌండేషన్‌ నిర్వహించిన యోగా శిబిరంలో అచ్చం అలాగే కనిపించింది. అంతే కాకుండా తన ఫ్రెండ్‌ బర్త్‌ డే పార్టీ ఫోటోలను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.  కాగా.. ప్రస్తుతం విష్ణుప్రియ బుల్లితెరకు దూరంగా ఉంటూ.. వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. రీసెంట్‌గా విష్ణు ప్రియ ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. జేడీ చక్రవర్తి మెయిన్ లీడ్‌గా చేసిన దయాలో విష్ణుప్రియ ఓ జర్నలిస్ట్‌గా కనిపించనున్నట్లు  తెలుస్తోంది.

(ఇది చదవండి: బాలీవుడ్‌లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్‌ అడిగారు: సీరియల్‌ నటి)

Advertisement
 
Advertisement
 
Advertisement