చాన్నాళ్ల తర్వాత మళ్లీ అలా రాబోతున్న ఆండ్రియా | Actress Andrea Jeremiah Ka Movie Release Date, Deets Inside - Sakshi
Sakshi News home page

చాన్నాళ్ల తర్వాత మళ్లీ అలా రాబోతున్న ఆండ్రియా

Published Wed, Mar 6 2024 12:39 PM

Andrea Jeremiah Ka Movie Release Date Update - Sakshi

ఎప్పటికప్పడు కాంట్రవర్సీల్లో ఉండే నటి ఆండ్రియా. ప్రస్తుతం ఈమె వయసు 42 ఏళ్లు. అయితే తనకు పెళ్లి ఆలోచన లేదని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది. నటి, గాయని, గీత రచయితగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె హీరోగా చేసిన సినిమా రిలీజై రెండేళ్లకు పైగానే అయిపోతోంది. ఇప్పుడు మరోసారి కథానాయికగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైందట. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగాస్టార్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

2022లో 'అణల్‌ మేల్‌ పణిత్తుళి' సినిమాతో వచ్చిన ఆండ్రియా.. ఈ సంక్రాంతికి తెలుగులో వచ్చిన వెంకటేశ్‌ 'సైంధవ్‌' అతిథి పాత్రలో కనిపించింది. మరోవైపు ఈమె నటిస్తున్న 'పిశాచి 2', 'నో ఎంట్రీ', 'కా' చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో 'పిశాచి 2' చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రియా నటించిన 'కా' విడుదల ఫిక్స్ చేసుకుందట. మార్చి 29న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. 

ఆండ్రియా ఇందులో వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా నటించింది. వృత్తిలో భాగంగా దట్టమైన అడవిలోకి వెళ్లిన ఆమె.. ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంది? ఇందులో నుంచి ఎలా బయటపడింది? అనేది స్టోరీ. నాంజిల్‌ దర్శకత్వం వహించగా.. సుందర్‌.సి, బాబు సంగీతమందించారు. ఏదేమైనా మళ్లీ దాదాపు రెండేళ్ల తర్వాత ఆండ్రియా తమిళ తెరపై కనిపించనుందనమాట.

(ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్)

Advertisement
 
Advertisement
 
Advertisement