Bigg Boss 3 Contestant Himaja Buy Diamond Necklace for Mother - Sakshi
Sakshi News home page

Himaja: తల్లికి డైమండ్‌ నెక్లెస్‌ గిఫ్టిచ్చిన హిమజ

Published Wed, Jan 12 2022 1:35 PM

Bigg Boss 3 Contestant Himaja Buy Diamond Necklace for Mother - Sakshi

బిగ్‌బాస్‌ తర్వాత క్రేజ్‌ రెట్టింపైనవారిలో హిమజ ఒకరు. బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొన్న ఆమె షోలో ఉన్నప్పుడు కొంత నెగెటివిటీ మూటగట్టుకున్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం షాప్‌ లాంఛింగ్‌లకు, ఈవెంట్లకు వెళ్తూ బాగానే సంపాదించింది. సినిమాలు, షోలు, ఫొటోషూట్లతో అభిమానులకు టచ్‌లో ఉంటున్న ఈ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ తాజాగా తన తల్లికి ఖరీదైన బహుమతినిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఆమె దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసింది.

ఇక ఈ వీడియోలో మొదటిసారి అమ్మకు డైమండ్‌ నెక్లెస్‌ తీసుకుంటున్నానంటూ తెగ ఎగ్జయిట్‌ అయింది హిమజ. అమ్మకు సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకున్నా కానీ ఆమెకు నచ్చింది తీసుకుంటే బాగుంటుందని తనను కూడా షాప్‌కు తీసుకొచ్చానని తెలిపింది. తల్లికి డైమండ్‌ నెక్లెస్‌ కొన్న ఈ నటి తన కోసం కూడా నగలు కొనుక్కుంది. వజ్రాల ఆభరణంతో పాటు రెండు బంగారు నెక్లెస్‌ల సెట్‌ను, ఒక బంగారు వడ్డాణాన్ని సైతం కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement