-
బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా
తెలుగు బిగ్‌బాస్ ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షోతో చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు సినిమాల్లో సెటిలైపోయిన వాళ్లు ఉన్నారు. అయితే మూడో సీజన్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచిన అలీ రెజా కూడా ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు. గతంలో బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చిన తర్వాత ఓ ఛానెల్ తనపై నిషేధం విధించిందని చెబుతూ అప్పుడు జరిగిన వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'ఆపరేషన్ వాలంటైన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది అప్పుడేనా?) 'బిగ్ బాస్ షోకి వెళ్లకముందు సీరియల్ చేస్తుండేవాడిని. షోకి వెళ్లొచ్చిన తర్వాత తిరిగి మళ్లీ సీరియల్లో చేరాలని అనుకున్నాను. కానీ బిగ్‌బాస్ స్టేజీపై ఉన్నప్పుడే 'వైల్డ్ డాగ్' మూవీలో రోల్ గురించి నాగార్జున సర్ చెప్పారు. దర్శకుడిని కలవడంతో ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. ఫైట్ సీన్స్ కోసం రోజూ పొద్దునే ప్రాక్టీస్ ఉండేది. రెండు రోజులు రాకపోతే సినిమాలో నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని ముందు చెప్పారు. సరిగ్గా అదే టైంలో సీరియల్ వాళ్లు పిలిచి క్లోజ్ చేస్తున్నాం, నువ్వు రావాలి అన్నారు. అప్పటికీ నేను వస్తానని, కాకపోతే టైమింగ్స్ బట్టి వస్తానని చెప్పాను' 'నేను వచ్చే విషయమై డిస్కషన్ జరుగుతుండగానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్లి పరిస్థితి అంతా వివరించాను. ఆ తర్వాత ఓ రోజు 'వైల్డ్ డాగ్' షూటింగ్లో ఉన్నాను. అప్పుడు.. కౌన్సిల్లో మీటింగ్ ఉంది రావాలని ఫోన్ కాల్ వచ్చింది. నేను ఇప్పుడు రాలేను, సాయంత్రం ఓ గంట పర్మిషన్ తీసుకుని వస్తానని చెప్పాను. ఇది జరిగిన రెండు రోజులకు నాకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. నన్ను బ్యాన్ చేసినట్లు, రెండేళ్లు ఎవరూ షూటింగ్స్, షోలకు పిలవొద్దు అని అందులో ఉంది. చాలా బాధపడ్డాను. ఇలా ఎలా చేస్తారనిపించింది' అని అలీ రెజా చెప్పుకొచ్చాడు. అలీ రెజాతో పాటు నటి పల్లవి గౌడని కూడా సదరు ఛానెల్ వాళ్లు పలు కారణాలతో నిషేధించారు. కానీ అలీ రెజా సినిమా నటుడిగా సెటిలైపోయాడు. పల్లవి గౌడ మాత్రం ప్రస్తుతం అదే ఛానెల్లో రీఎంట్రీ ఇచ్చి సీరియల్స్ చేసుకుంటోంది. (ఇదీ చదవండి: ‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ) -
'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్
'బిగ్‌బాస్' తెలుగు రియాలిటీ షోపై టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు ఇబ్బందికి గురయ్యామని చెప్పాడు. తన భార్య వితిక అయితే చాలా సఫర్ అయిందని అసలు విషయం బయటపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? వీళ్లిద్దరూ బిగ్‌బాస్ షోలో ఎప్పుడు పాల్గొన్నారు? ఏం జరిగింది? తెలుగులో సరికొత్త ట్రెండ్ చేసిన రియాలిటీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. అయితే ఈ షో మూడో సీజన్లో భార్యభర్తలైన యాక్టర్స్ వరుణ్ సందేశ్-వితిక జంటగా పాల్గొన్నారు. అయితే షోలో కెమిస్ట్రీ పండిస్తూనే కొన్నాళ్లు గొడవపడ్డారు. ఏదైతేనేం ఎంటర్టైన్మెంట్ బాగానే ఇచ్చారు. అయితే షో చూసి బాగా ఇన్వాల్వ్ అయిన కొందరు ఆడియెన్స్.. వీళ్లిద్దరూ బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చెప్పుకోలేని విధంగా కామెంట్స్ పెట్టారట. దీని గురించే వరుణ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) వరుణ్ ఏం చెప్పాడు? 'బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత వితిక చాలా బాధపడింది. అరే నన్ను ఇలా చూపించారు, అలా ఎడిట్ చేసి చూపించారని చెబుతూ చాలా ఫీలైంది. తనకు వచ్చిన కొన్ని మెసేజుల్ని నాకు చూపించింది. అవి చూసిన తర్వాత నాకే బాధేసింది. నిజంగా అలాంటి మెసేజులు పెట్టిన వాళ్లని ఏమనాలో, ఏం చేయాలో కూడా తెలీదు. ఎందుకంటే గంట ఎపిసోడ్లో ఓ మనిషిని చూసి వాళ్ల క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు. అది నన్ను చాలా బాధించింది. రియాలిటీ షోలో మమ్మల్ని చూసి ఎలా జడ్జ్ చేస్తారా అనిపించింది. 'బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చాక వితిక కొన్నాళ్ల పాటు మనిషి కాలేకపోయింది. ఎందుకంటే ఆమెకు అలాంటి మెసేజులు వచ్చాయి మరి. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని మెసేజులు చేశారు. కొన్నయితే నేను ఆ మాటల్ని అస్సలు చెప్పలేను. అయితే ఆమె సూపర్ ఉమెన్ కాబట్టి తట్టుకోగలిగింది. ఆ ట్రామా నుంచి బయటకు రాగలిగింది' అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూట్యూబర్‌గా వితిక బిజీగా ఉండగా, వరుణ్ మాత్రం నటుడిగా మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
బాయ్ ఫ్రెండ్ వల్ల నరకం అనుభవించాను: రోహిణి
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన రోహిణి తర్వాత బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. జబర్దస్త్‌లోనూ తన కామెడీ టైమింగ్, పంచులతో కమెడియన్‌గా రాణిస్తోంది. బుల్లితెరకే పరిమితం కాకుండా అటు వెండితెరపైనా సత్తా చాటుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇటీవల రోహిణి తన కాలు సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని నెలలుగా ఆమె తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె కొంతమేరకు కోలుకుంది. దీంతో మళ్లీ స్క్రీన్‌పై కనిపేందకు రెడీ అయింది. (ఇదీ చదవండి: ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా..?) తాజాగ రోహిణి ఓ షోలో మొట్టమొదటిసారి తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రోహిణికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? లేడా..? అనే విషయం చాలామందికి తెలియదు.ఇదే విషయంపై ఆమె రివీల్ చేసింది. తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చింది. అతనితో వచ్చిన కొన్ని విబేదాల వల్ల బ్రేకప్ అయ్యానని, దాంతో చాలా నరకాన్ని అనుభవించానని ఆమె పేర్కొంది. అప్పుడు తానెంతో డిప్రెషన్లోకి వెళ్లానని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తన ఫ్రెండ్స్ ఎంతగానో సపోర్ట్‌గా నిలిచారని చెప్పింది. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ అన్న మాటలను మరోసారి గుర్తుచేసుకుంది. 'నా ఫ్రెండ్స్ అందరూ అసలు వాడెవడు.. నీ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు. అప్పుడు, వీడు ఒక ఆఫ్ట్రాల్ గాడు.. వీడి గురించి ఇంతలా ఆలోచించడం ఏంటని నన్ను నేను ప్రశ్నించుకున్నా.. అలా వారి సపోర్ట్‌తోనే ఆ కష్ట సమయం నుంచి బయటపడ్డాను.' అని రోహిణి తెలిపింది. దీంతో రోహిణిని ప్రేమించి వదిలేసిన అబ్బాయి ఎవరని నెట్టింట తన అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. రోహిణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. -
పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్.. ఛీ ఛీ నన్నెందుకు ఇరికిస్తారు?
బిగ్‌బాస్ షోతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది పునర్నవి భూపాలం. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పున్ను ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా వర్కవుట్ కాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్ మూడో సీజన్లో అడుగుపెట్టిందో అప్పుడే యూత్ క్రష్‌గా మారిపోయింది. ఈ రియాలిటీ షోలో పునర్నవి- రాహుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాక్ బాగా క్లిక్కయింది. కానీ బయటకు వచ్చాక మాత్రం ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. పునర్నవితో రాహుల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న పునర్నవి గర్భం దాల్చిందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై పున్నూ ఘాటుగా స్పందిస్తూ పిచ్చిరాతలు రాయకండి. నేను ప్రెగ్నెంట్ ఏంటి? అని సీరియస్‌గానే కౌంటరిచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అషూ రెడ్డితో రాహుల్ ఈ విషయంపై రాహుల్ మాట్లాడుతూ.. 'ఛీ ఛీ.. నన్నెందుకు ఇరికిస్తారు? జీవితంలో ఇద్దరం ఎవరిదారి వారు చూసుకున్నాం. బిగ్‌బాస్ తర్వాత ఎన్నో హిట్ పాటలు పాడా. బిజినెస్ మొదలుపెట్టా. తన కెరీర్లో తను బిజీగా ఉంది. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుంటామంతే! అషూ విషయానికి వస్తే తను నా బెస్ట్ ఫ్రెండ్. తను ఎంత మంచిదంటే.. చుట్టూ ఉన్న ఎంతో మందికి సాయం చేస్తుంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం మాకు తెలుసు. ప్రతిసారి అందరికీ వివరించి చెప్పలేను' అని చెప్పుకొచ్చాడు. -
గేతో పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ పిచ్చిరాతలు.. స్పందించిన నటి
బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పునర్నవి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని యూత్ క్రష్‌గా మారిపోయిందీ బ్యూటీ. ఆ మధ్య వెబ్‌సిరీస్‌లో కనిపించినా ఆ తర్వాత సినిమాలు, సిరీస్‌లకు గుడ్‌బై చెప్పేసి లండన్‌కు వెళ్లిపోయింది. సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్చేసుకునేది. ఈ క్రమంలో రీసెంట్గా పునర్నవి పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన ఫోటోల్లో పునర్నవి పొట్ట భాగం కాస్త పెద్దదిగా కనిపించడంతో ఈ రూమర్స్‌కి మరింత వైరల్ అయ్యాయి. ఈ విషయం పునర్నవి దాకా చేరడంతో ఆమె కాస్త బోల్డ్‌గానే స్పందించింది. ''నా గే బెస్టీతో ప్రెగ్నెన్సీ వచ్చిందని కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో ఇష్టారీతిన వార్తలు రాసేశారు. ఇది నాన్ సెన్స్. గత నెలలో నేను కాస్త సిక్ అయ్యాయని చెబితే, ప్రాణాపాయం అని రూమర్స్ సృష్టించారు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్ అని రాశారు. సోషల్ మీడియాలో చూసి నమ్మేయకండి. ఏది నిజమో, కాదో తెలుసుకోండి. మీరు రాసే పిచ్చిరాతలు అవతలి మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి'' అంటూ ఘుటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం పునర్నవి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement