నీకు తెలుగు అర్థమవుతోందా?.. యావర్‌ను ఓ ఆటాడుకున్న అశ్విని! | Sakshi
Sakshi News home page

Bigg Boss: ఆడ పిల్లని చేసి నన్ను ఆడుకుంటున్నావ్?.. యావర్‌పై అశ్విని ఫైర్!

Published Tue, Oct 31 2023 5:13 PM

Bigg Boss Latest Promo Nominations War Begins In House Ashwini and Yawar - Sakshi

తెలుగువారి రియాలిటీ షో ఈ ఏడాది ప్రేక్షకులను బాగానే ఎంటర్‌టైన్ చేస్తోంది. మొదటి నుంచే కొత్త పంథాల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎమిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో మరో వారం మొదలైపోయింది. ఎనిమిదో వారంలో సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇదిలా ఉంచితే తొమ్మిదో వారానికి నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ విషయానికొస్తే ఒకరిని ఒకరు నామినేట్ చేసే సమయంలో జరిగే వాదనలు మామూలుగా ఉండవు. సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. 

(ఇది చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!)

ఈ ప్రోమోలో కెప్టెన్‌లో హోదాలో ఉన్న గౌతమ్‌.. రతికాను నామినేట్ చేశాడు.  తర్వాత ప్రిన్స్ యావర్‌ను అశ్విని  నామినేట్ చేసింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నీకు తెలుగు అర్థమవుతోందా?.. అసలు ఎందుకు వచ్చావ్ బిగ్‌బాస్‌కి? అని అశ్విని ప్రశ్నించింది. దీనికి యావర్ బదులిస్తూ.. నువ్వు అలాంటి మాట అనడం కరెక్టేనా? అని అన్నాడు. అనంతరం ఒక ఆడపిల్లని చేసి నన్ను ఆడుకుంటున్నావ్? ‍అది కూడా నాకు అర్థమవుతోంది అంటూ అశ్విని ఓ రేంజ్‌లో ఊగిపోయింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియనంతగా యావర్ ఫేస్ ఎక్స్‌ప్రేషన్స్ ఇచ్చాడు. నువ్వు నన్ను టార్గెట్ చేశావ్.. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా. లేకపోతే నువ్వసలు నా మైండ్‌లోనే లేవు అంటూ అశ్విని రెచ్చిపోయింది. ఆ తర్వాత అమర్‌ను కెప్టెన్‌ గౌతమ్‌ నామినేట్ చేయడంతో ప్రోమో ముగిసింది. 

అంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలో యవర్ లాజిక్ లేని నామినేషన్స్ చేశాడు. కారణాలు ఏం చెప్పాలో తెలీక శోభాశెట్టి, అశ్వినిని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక - శోభాశెట్టి మధ్య వాదన గట్టిగా నడిచినట్లు ప్రోమోలో చూపించారు. శోభాతో మాట్లాడుతూ తేజ పేరు తీసుకొచ్చింది. దీంతో తేజ ముందుకొచ్చి.. 'నా పేరు ఎందుకు మధ్యలో తీసుకొచ్చావ్' అని రతికతో అతడు గొడవ పెట్టుకున్నాడు. 'దొరికిపోయావ్.. దారుణంగా జనాలకి దొరికిపోతున్నావ్' అని తేజ అన్నాడు. ఎవరు ఎవరినీ నామినేట్ చేశారో తెలియాలంటే ఇవాళ జరిగే ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది. 

(ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఆయనతో ప్రత్యేక పూజలు! )

Advertisement
 
Advertisement
 
Advertisement