అతన్ని ఆ మాట అనకుండా ఉండాల్సింది: శోభా శెట్టి ఎమోషనల్ | Sakshi
Sakshi News home page

Bigg Boss: ఆ మాట అనకుండా ఉండాల్సింది: శోభా శెట్టి

Published Sun, Dec 10 2023 6:23 PM

Bigg Boss Latest Promo Out Of Latest Epiosde - Sakshi

తెలుగువారి రియాలిటీ షో బిగ్‌ బాస్‌ చివరి ఘట్టానికి చేరుకుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న షో మరో వారంలో ముగియనుంది. ఈ వారంలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండగా.. చివరి వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో ఉండనున్నారు. ఇప్పటికే ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌ ఎవరో కూడా తెలిసిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఏడుగురిలో శోభాశెట్టి బయటకు రానుంది. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో హోస్ట్‌గా నాగార్జున 14 వారాల్లో మీరు పశ్చాత్తాప పడిన సందర్భం ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి హౌస్‌మేట్స్ అందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

(ఇది చదవండి: నా సామిరంగ.. నిన్ను ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా!)

మొదట అంబటి అర్జున్ మాట్లాడారు. కేవలం బలం ఉంటే సరిపోదు.. బలంతో పాటు జనాల ప్రేమ కూడా కావాలనేది ఆ వారంలో తెలిసింది సార్ అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టి మాట్లాడుతూ యావర్‌ను పిచ్చోడా ‍అని అనేశాను. తాను ఆ మాట అనకుండా ఉండాల్సింది అన్నారు. ఆ తర్వాత యావర్ మాట్లాడుతూ 11 వారంలో ఫౌల్‌ జరిగింది.. కానీ నేను అది కావాలని చేయలేదు అన్నాడు. ఆ తర్వాత 14 వారంలో నేను వాడిన పదాలు నా వ్యక్తిగత అనుకున్నా.. కానీ ‍అది ఇతరులకు టచ్‌ అవుతుందనేది మీరు చెప్పాక తెలిసిందని శివాజీ అన్నాడు. నేను అన్నది పొరపాటు అయిండొచ్చు.. నేను అన్న మాటల్లో ఆ పదం అనుకోకుండా దొర్లింది. నా కోసం నేను స్టాండ్ తీసుకున్నప్పుడు ఏది జరగలేదు అన్నారు. అయితే నాగార్జున శివాజీని ఉద్దేశించి బతుకు.. బతికించు అన్న పదం వాడావు.. అది నీ ఫీలాసఫీ అని నాకు అర్ధమైంది అన్నారు. దీంతో ప్రోమో ముగిసింది. మిగిలిన కంటెస్టెంట్స్‌ కూడా ఎక్కడ తప్పు చేశారో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. 

(ఇది చదవండి: ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపించి షాకిచ్చిన హీరో.. ఎందుకంటే?)

Advertisement
 
Advertisement
 
Advertisement