Bigg Boss 7: ముగ్గురికీ హింట్స్‌ ఇచ్చిన కుటుంబ సభ్యులు,​ ఏడిపించేశారు.. | Bigg Boss 7 Telugu Day 65 Episode Highlights: Shivaji, Ashwini Sri And Ambati Arjun Family Members Into BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Nov 7th Highlights: అర్జున్‌ చేతుల మీదుగా భార్యకు సీమంతం.. సీక్రెట్స్‌ చెప్పిన ఆ ముగ్గురు.. గుండె బరువెక్కడం ఖాయం!

Published Wed, Nov 8 2023 7:55 AM

Bigg Boss Telugu 7: Sivaji, Ashwini Sri, Ambati Arjun Family In BB House - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఓ మ్యాజిక్‌ ఉంది. తిట్టుకున్నా, కొట్టుకున్నా, ద్వేషించినా, ప్రేమించినా ఫ్యామిలీ వీక్‌ వచ్చేసరికి మాత్రం అంతా కలిసిపోతారు. ఆయా కంటెస్టెంట్ల అభిమానులు కూడా ఆ ఒక్కవారం ఏ కంటెస్టెంట్‌ మీదా విమర్శించలు గుప్పించడానికి ఇష్టపడరు. ఇంటి సభ్యులను చూసి కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకుంటే వారిని చూసి ప్రేక్షక జనాలు సైతం ఎమోషనల్‌ అవుతుంటారు. మరి తాజా(నవంబర్‌ 7నాటి) ఎపిసోడ్‌లో ఏయే కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారో చూసేద్దాం..

కాలేజ్‌గా మారిన బిగ్‌బాస్‌
ఈ వారం ఫ్యామిలీ వీక్‌ కావడంతో ఇంకా అప్పుడే టాస్కుల జోలికి పోలేదు బిగ్‌బాస్‌. అంతేగాక బిగ్‌బాస్‌ హౌస్‌ను బీబీ కాలేజ్‌గా మార్చాడు. ఇక్కడ అందరూ విద్యార్థులుగా ఉంటారని, సమయానుసారం వీరిలో కొంతమంది టీచర్లుగా మారి పాఠాలు చెప్పాల్సి ఉంటుందన్నాడు. అంతిమంగా వినోదాన్ని అందించాలన్నాడు. ఇంతలో శివాజీని మెడికల్‌ రూమ్‌కు రమ్మన్నాడు బిగ్‌బాస్‌. అక్కడ ముఖానికి మాస్కు, తలకు క్యాప్‌ వేసుకుని ఉన్న డాక్టర్‌.. శివాజీ ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. ఎక్సర్‌సైజులు చేస్తున్నారా? అని అడగ్గా చేస్తున్నట్లు చెప్పాడు శివాజీ. రెండు, మూడు రోజుల్లో నొప్పి తగ్గిపోతుందని డాక్టర్‌ చెప్పగానే థాంక్యూ అంటూ అక్కడి నుంచి వెళ్లబోయాడు.

శివాజీకి హింటిచ్చిన పెద్ద కుమారుడు
ఇంతలో  డాక్టర్‌.. నాన్న అని పిలవడంతో షాకైన శివాజీ వెనక్కు తిరిగాడు. వెంటనే మాస్కు, క్యాప్‌ అన్నీ తీసేయగా డాక్టర్‌గా వచ్చింది నా పెద్ద కొడుకా అని ఒక్కసారిగా ఏడ్చేశాడు. కెన్నీ.. శివాజీతో కబుర్లాడుతూ ఓ సలహా ఇచ్చాడు కెన్నీ. హౌస్‌లో అందరినీ నమ్మకు. యావర్‌, ప్రశాంత్‌ గురించి కాదు. మిగిలినవాళ్లు ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు. మాటలు జారుతున్నావు, చూసుకో అని హెచ్చరించాడు. హౌస్‌ నుంచి వెళ్లేటప్పుడు కూడా వీకెండ్‌లో నాగ్‌ సర్‌ ఇచ్చే పాయింట్లు దృష్టిలో పెట్టుకుని ఆడమన్నాడు. తర్వాత అర్జున్‌ అంబటి భార్య సురేఖ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గర్భవతిగా ఉన్న భార్యను చాలారోజుల తర్వాత చూడటంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు అర్జున్‌.

నీపై కోపం వస్తోంది: అర్జున్‌ భార్య
సురేఖపై ముద్దుల వర్షం కురిపించాడు. నీ ఎమోషన్స్‌ దాచుకోకు.. బయటపెట్టు. నువ్వు రియాక్ట్‌ అవ్వట్లేదని నాకు కోపం వస్తుంది.. నువ్వు రియాక్ట్‌ అయితే చూడాలనుంది అంటూ అర్జున్‌కు సలహా ఇచ్చింది అతడి భార్య. భర్తకు ప్రేమగా గోరుముద్దలు పెడుతూ డల్‌గా ఉండకు.. కప్పు ముఖ్యం బిగిలూ అని తన లక్ష్యాన్ని గుర్తు చేసింది. ఇంతలో ఆమెకు సీమంతం చేసేందుకు బిగ్‌బాస్‌ పసుపు-కుంకుమ, పళ్లు, పూలు, గాజులు.. అన్నీ పంపించాడు. హౌస్‌ అంతా కలిసి సురేఖకి సీమంతం చేశారు. భర్త చేతుల మీదుగా సీమంతం జరుపుకున్న ఆనందాన్ని గుండె నిండా నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది సురేఖ.

బంగారుతల్లి.. ఏడ్చేసిన అశ్విని తల్లి
కాసేపటికి హౌస్‌లో ఉన్న అందరినీ కదలకుండా ఉండాలన్నాడు బిగ్‌బాస్‌. సరిగ్గా అప్పుడే అశ్విని తల్లి ఎంట్రీ ఇచ్చింది. నా బంగారుతల్లి.. అంటూ అశ్వినిని పట్టుకుని ఏడ్చేసింది ఆమె తల్లి. అశ్విని అయితే నేనూ నీతో వచ్చేస్తానమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పెద్దవాళ్లతో కలిసుండు.. నా అని నువ్వు ఎవరిని అనుకుంటావో వాళ్లు నీవాళ్లు కాదు.. ఎవరైతే కాదనుకుంటావో ఆ పెద్దవాళ్లే న్యాయంగా ఉంటారు. అని సలహా ఇచ్చింది అశ్విని తల్లి. ఇంతలో బిగ్‌బాస్‌ అశ్వినికి తన కుక్కపిల్ల(సోను) ఫోటోను గిఫ్ట్‌గా పంపాడు. తర్వాత భారంగా తల్లికి వీడ్కోలు పలికింది అశ్విని. అలా ఈరోజు ఎపిసోడ్‌ మొత్తం ఎమోషన్‌తో పిండేశారు.

చదవండి: ఆ ఒక్క ఘటనతో కుదేలైన కెరీర్‌.. ఇప్పుడు ఫుల్‌ ఫామ్‌లో ఉన్న త్రిష

Advertisement
 
Advertisement
 
Advertisement