Mohan Babu Serious On Manchu Vishnu And Manoj Clashes Video Viral - Sakshi
Sakshi News home page

Manchu Vishnu Vs Manoj: వీడియో షేర్‌ చేసిన మనోజ్‌.. సీరియస్‌ అయిన మోహన్‌బాబు

Published Fri, Mar 24 2023 12:46 PM

Mohan Babu Serious On Manchu Vishnu And Manoj Clashes Video Viral - Sakshi

మంచు ఫ్యామిలీలో చిచ్చు​ రేగింది. అన్నాదమ్ములు మంచు విష్ణు, మనోజ్‌ మధ్య గత కొంతకాలంగా పొసగడం లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే మనోజ్‌ పెళ్లిలో కూడా విష్ణు అంటీముట్టనట్టుగా ఉన్నాడని ప్రచారం జరిగింది. వాటిని నిజం చేస్తూ.. అన్నాదమ్ముల మధ్య విభేదాలకు సంబంధించి ఓ వీడియో బయటికొచ్చింది. తన అనుచరుల పట్ల విష్ణు అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని మనోజ్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశాడు. ‘విష్ణు తన ఇంటికి వచ్చి తన మనుషులను ఇలా కొడతాడు’ అంటూ మనోజ్ ఓ‌ వీడియో పోస్టు చేశాడు. 
(చదవండి: మనోజ్‌ పెళ్లి వేడుకలో విష్ణు చేసిన పనికి షాక్‌ అవుతున్న నెటిజన్లు)

అది కాస్తా వైరల్‌ కావడంతో ఇంటి గుట్టు రచ్చకీడ్చారని కుమారులపై మోహన్‌బాబు సీరియస్‌ అయినట్టుగా సమాచారం. వీడియో డిలీట్ చెయ్యమని మనోజ్‌ను మోహన్ బాబు ఆదేశించాడు. తండ్రి ఆజ్ఙానుసారం మనోజ్ వీడియో డిలీట్ చేశాడు. కానీ, అప్పటికే అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు గొడవ ఎక్కడ మొదలైంది? సారథి ఇంట్లో ఏమి జరిగింది అనే విషయంపై మోహన్ బాబు ఆరా తీస్తున్నారట! అన్నదమ్ముల మధ్య వివాదాలు ఏనాడు బయట పడలేదు.. ఇప్పుడేకంగా సోషల్‌ మీడియాలో వీడియో బయటకు రావడం చర్చనీయాంశమైంది.
(చదవండి: మంచు మనోజ్‌, విష్ణుల మధ్య వివాదం.. షాకింగ్‌ వీడియో వైరల్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement