హీరోగా స్టార్ కమెడియన్.. మరో మాస్ చిత్రం రెడీ | Sakshi
Sakshi News home page

హీరోగా స్టార్ కమెడియన్.. మరో మాస్ చిత్రం రెడీ

Published Sat, Jan 20 2024 2:59 PM

Soori Garudan Movie Teaser And Details - Sakshi

తెలుగులో తక్కువ గానీ తమిళంలో పలువురు కమెడియన్స్ కూడా హీరోలుగా రాణిస్తున్నారు. సంతానం.. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. తాజాగా కమెడియన్ సూరి కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోతున్నాడు. గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు 'గరుడన్'గా వచ్చేందుకు రెడీ అయిపోయాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)

ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ రాసిన స్టోరీతో 'గరుడన్' మూవీ తీశారు. ఇందులో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో యువన్‌ శంకర్‌ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. అలానే హీరోని కుక్కతో పోల్చుతూ చెప్పిన డైలాగ్స్, విజువల్స్ కూడా సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాలు వెల్లడించనున్నారు.

(ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ)

Advertisement
 
Advertisement
 
Advertisement