అనన్య.. ప్రతిభ | Sakshi
Sakshi News home page

అనన్య.. ప్రతిభ

Published Wed, Apr 17 2024 1:30 AM

తల్లిదండ్రులతో అనన్యరెడ్డి (ఫైల్‌)  - Sakshi

సివిల్స్‌లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ

బుధవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

వివరాలు IIలో u

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

అమ్రాబాద్‌/అచ్చంపేట రూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ పిలుపునిచ్చారు. పదర మండలం రాయలగండి తండా సమీపంలో మంగళవారం అమ్రాబాద్‌, పదర మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి, అధికారంలో రావడం ఖాయమన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి, మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఆయా మండలాల అధ్యక్షులు రామలింగయ్యయాదవ్‌, హరినారాయణగౌడ్‌ ఉన్నారు.

● అచ్చంపేట మండలంలోని పల్కపల్లిలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మార్నింగ్‌వాక్‌ నిర్వహించి, సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట గోపాల్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, హరీష్‌, యాదయ్య, వెంకటేష్‌ ఉన్నారు.

క్రీడలతో

మానసిక వికాసం

నాగర్‌కర్నూల్‌ క్రైం: క్రీడలతో మానసిక వికాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందని డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన టెన్నిస్‌ కోర్టును మంగళవారం కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా డీఐజీ మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులకు క్రీడలు అవసరమన్నారు. ప్రతి మనిషి జీవితంలో క్రీడలు భాగం కావాలని సూచించారు. ఎస్సీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌కు క్రీడలపై ఎంతో ఆసక్తి ఉందని.. ఈనేపథ్యంలోనే టెన్నిస్‌ కోర్టు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామేశ్వర్‌ పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

ఉప్పునుంతల: మండలంలోని వెల్టూరు, చాకలి గుడిసెలు, అయ్యవారిపల్లి, తండా, సూర్యతండా, ఫిరట్వానిపల్లి గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం సెక్టోరియల్‌ అధికారి జ్ఞానేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ర్యాంప్‌ సౌకర్యం, పోలింగ్‌ సిబ్బందికి ఫర్నిచర్‌ తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

తాత దిశానిర్దేశంతోసివిల్స్‌ వైపు అడుగులు

సొంతంగా ప్రిపరేషన్‌..మొదటి ప్రయత్నంలోనే విజయం

సొంతూరు పొన్నకల్‌..బాల్యమంతా మహబూబ్‌నగర్‌లోనే..

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌/ అడ్డాకుల: యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో పాలమూరు బిడ్డ సత్తాచాటింది. సివిల్స్‌– 2023 ఫలితాల్లో జిల్లాకేంద్రానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సివిల్స్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం పట్ల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలన్న ఆశయం ఉన్న ఆమె బాల్యమంతా మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోనే గడిచింది. ఆమె ఐఏఎస్‌ కావాలన్న కలలకు స్ఫూర్తినిచ్చింది తాత కృష్ణారెడ్డి ఆయన సలహాలు, సూచనలతో చిన్నప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా చదువుకున్నట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.

ఇంటర్‌ ప్రారంభం నుంచే..

అనన్య ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని గీతం పాఠశాలలో చదివారు. ఎస్సెస్సీలో మంచి గ్రేడింగ్‌తో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్‌ ప్రారంభం నుంచి ఐఏఎస్‌ వైపు అడుగులు పడ్డాయి. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని నారాయణ ఐఏఎస్‌ అకాడమీలో చేర్చారు. ఇంటర్‌ పూర్తయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్‌ కళాశాలలో ఏబీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌)లో చేరారు. డిగ్రీ పూర్తయ్యాక 2020 నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్‌ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సివిల్స్‌లో ఆప్షనల్‌ సబ్జెక్టులుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఈ ఒక్క ఆంత్రపాలజీ కోసం ఆన్‌లైన్‌లోనే శిక్షణ తీసుకున్నారు. దీంతో మిగతా సబ్జెక్టులు అన్ని కూడా సొంత ప్రిపరేషన్‌తో ముందుకు సాగారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు సిద్ధమయ్యాయని చెప్పారు.

సొంత ప్రిపరేషన్‌

సివిల్స్‌కు సిద్ధమయ్యే క్ర మంలో అనన్యరెడ్డి సొంత ప్రిపరేషన్‌పైనే ఎక్కు వగా దృష్టిపెట్టారు. ప్రతి రోజు 12 గంటల నుంచి 14 గంటలపాటు చదువుకునేవారు. సబ్జెక్టులో ప్రతి అంశాన్ని నోట్‌గా రాసుకునే అలవాటు ఉండటంతో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా సులువుగా లక్ష్యాన్ని చేరు కుని ప్రణాళిక ప్రకారం నిర్దేశిత సమయంలో సిలబస్‌ను పూర్తిచేసే విధంగా ఆమె ప్రిపరేషన్‌ కొనసాగించారు. సివిల్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో సీనియర్ల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడినట్లు అనన్యరెడ్డి చెప్పారు.

మెకానికల్‌ ఇంజినీర్‌కు 627వ ర్యాంక్‌

వెల్దండ: సివిల్స్‌ ఫలితాల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి ఉమ్మడి పంచాయతీ పోషమ్మగడ్డతండాకు వడ్తావత్‌ యశ్వంత్‌నాయక్‌ జాతీయ స్థాయిలో 627వ ర్యాంకుతో సత్తాచాటారు. తండాకు చెందిన ఉమాపతి, పద్మ దంపతుల మొదటి కుమారుడు యశ్వంత్‌. ఇతను ఇంటర్మీడియట్‌ నారాయణ కళాశాలలో, ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్‌ ఇంజినీయక్‌ పూర్తిచేశారు. తర్వాత సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా చదివి.. రెండోసారి ప్రయత్నంలో మెరుగైన ర్యాంకు సాధించాడు. తమ కుమారుడు సివిల్స్‌ సాధించడంతో తల్లిదండ్రులు పద్మ, ఉమాపతి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థి సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించడంతో తండావాసులు, బంధువులు అభినందించారు.

న్యూస్‌రీల్‌

పొన్నకల్‌లో సంబరాలు

అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పొన్నకల్‌వాసికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు అనన్యరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనన్యరెడ్డి తండ్రి సురేష్‌రెడ్డి గ్రామంలో కొన్నాళ్లపాటు వ్యవసాయం చేశారు. 20 ఏళ్ల కిందట ఇద్దరు కుమార్తెల చదువుల కోసం మహబూబ్‌నగర్‌ వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే వ్యాపారాలు చేస్తూ కుమార్తెలను చదివించారు.

1/3

2/3

కుమారుడు యశ్వంత్‌కుస్వీటు తినిపిస్తున్న తల్లి పద్మ
3/3

కుమారుడు యశ్వంత్‌కుస్వీటు తినిపిస్తున్న తల్లి పద్మ

Advertisement
Advertisement