Defamation Case: Supreme Court Issues Notice On Rahul Gandhi Plea To Stay Conviction - Sakshi
Sakshi News home page

PM Modi Surname Row: మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసు

Published Sat, Jul 22 2023 6:15 AM

Supreme Court issues notice on Rahul Gandhi plea to stay conviction - Sakshi

న్యూఢిల్లీ: మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై పరువు నష్టం  కేసులో తనకి పడిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయడానికి నిరాకరించిన హైకోర్టు తీర్పుని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ కేసులో ప్రతివాదులైన గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్‌ మోదీ, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాలను నోటీసులు పంపింది.

దీనిపై రెండు వారాల్లోగా స్పందించాలని ఆదేశించిన జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్, జస్టిస్‌ పి.కె. మిశ్రాలతో కూడిన సుప్రీం బెంచ్‌ తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. రాహుల్‌ గాంధీ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్‌ అడ్వొకేట్‌ అభిషేక్‌ సింఘ్వి గత 111 రోజులుగా రాహుల్‌ ఎంతో వ్యధ అనుభవిస్తున్నారని, ఇప్పటికే ఒక పార్లమెంట్‌ సెషన్‌కు దూరమయ్యారని కోర్టుకు చెప్పారు. రాహుల్‌ గాం«దీపై అనర్హత వేటు పడడంతో ఎంపీగా ఆయన కోల్పోయిన వయనాడ్‌ నియోజకవర్గం ఎన్నికల నోటిఫికేషన్‌ ఏ క్షణంలోనైనా రావచ్చునని, అందుకే త్వరితగతిన ఈ కేసుని విచారించాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement