బాండ్లను డ్రాప్‌ బాక్స్‌లో పడేశారు.. | Sakshi
Sakshi News home page

బాండ్లను డ్రాప్‌ బాక్స్‌లో పడేశారు..

Published Tue, Mar 26 2024 6:31 AM

TMC adhered to all norms while redeeming electoral bonds - Sakshi

ఎవరిచ్చారో తెలీదు: టీఎంసీ

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల పథకం ద్వారా వందల కోట్ల విరాళాలను అందుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ దాతలు ఎవరో తెలీయదని చెప్పొకొచి్చంది. ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టులను సంపాదించిన కంపెనీలే ఆయా అధికార పారీ్టలకు వందల కోట్ల ముడుపులను ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో ముట్టజెప్పాయన్న ఆరోపణల నడుమ తృణమూల్‌ కాంగ్రెస్‌ స్పందించడం విశేషం.

టీఎంసీకొచి్చన బాండ్లపై పశ్చిమబెంగాల్‌లో సోమవారం ఒక పత్రికా సమావేశంలో ఆ పార్టీ నేత కునాల్‌ ఘోష్‌ మాట్లాడారు. ‘‘ మా పారీ్టకి ఎవరు విరాళంగా ఇచ్చారో మాకు తెలీదు. ఎంత పెద్ద మొత్తాలను ఇచ్చిందీ తెలీదు. అసలు ఈ బాండ్ల పథకాన్ని తెచి్చందే బీజేపీ. రాజకీయ పారీ్టలకు నిర్వహణ వ్యయాలను ప్రభుత్వాలే భరించాలని 1990దశకం నుంచీ మమతా బెనర్జీ మొత్తుకుంటూనే ఉన్నారు.

వేలకోట్ల నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడాలని ఆమె కాంక్షించారు. అయినా సరే ఎవరిమాటా వినకుండా బీజేపీ ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని తెచి్చంది. వేరే దారి లేక మేమూ ఆ పథకం నిబంధనలను పాటించాం. మాకు ఎన్ని బాండ్లు ఇచ్చారో, ఎవరిచ్చారో తెలీదు. సాధారణంగా పార్టీ ఆఫీస్‌ బయట ఒక డ్రాప్‌బాక్స్‌ ఉంటుంది. అందులోనే ఈ బాండ్లు ఎవరో పెట్టి వెళ్లారు. ఆ బాండ్లపై దాతల పేర్లు ఉండవు. కేవలం ఆల్ఫా–న్యూమరిక్‌ నంబర్‌ ఉంటుంది. దాత పేరు, వివరాలు బీజేపీకైతే తెలుస్తాయి.

ఎందుకంటే వాళ్లే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సీబీఐ, ఈడీని తమ చెప్పుచేతల్లో ఉంచుకుని వాటి ద్వారా బెదిరించి మరీ విరాళాల వసూళ్ల పర్వాన్ని బీజేపీ యథేచ్ఛగా కొనసాగింది. బాండ్ల ద్వారా మేం అందుకున్న మొత్తాలను టీఎంసీ అధికారిక బ్యాంక్‌ ఖాతాల్లోనే జమచేశాం’’ అని కునాల్‌ ఘోష్‌ చెప్పారు.

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఎలక్టోరల్‌ బాండ్ల గణాంకాల ప్రకారం తృణమూల్‌ కాంగ్రెస్‌కు 10 మంది అతిపెద్ద విరాళాల దాతల నుంచే ఏకంగా రూ.1,198 కోట్లు వచ్చాయి. ఫ్యూచర్‌ గేమింగ్, హోటల్‌ సరీ్వసెస్‌ సంస్థ ఒక్కటే టీఎంసీకి రూ.542 కోట్లు విరాళంగా ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచించిన కాలపరిమితిలో ఎస్‌బీఐ నుంచి దాదాపు 1,300 సంస్థలు/వ్యక్తులు రూ.12,000 కోట్లకుపైగా విలువైన బాండ్లను కొనుగోలుచేసి 23 రాజకీయపారీ్టలకు తమకు నచి్చన మొత్తాలను విడివిడిగా విరాళంగా ఇవ్వడం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ బాండ్ల వివరాలన్నింటినీ ఎన్నికల సంఘానికి
అందజేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement