ఎన్‌ఆర్‌ఐ అభిజిత్‌ది హత్యా? ఆత్మహత్యా? పోలీసుల ప్రకటన ఆంతర్యం ఏమిటి? | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐ అభిజిత్‌ది హత్యా? ఆత్మహత్యా? పోలీసుల ప్రకటన ఆంతర్యం ఏమిటి?

Published Tue, Mar 19 2024 10:39 AM

Abhijeeth Indian Dies In US Family Alleges Murder Cops Rule Out Crime Angle - Sakshi

అమెరికాలో  గుంటూరుకు చెందిన  విద్యార్థి  అభిజిత్‌ అనుమానాస్పద మరణం

హత్య అని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు

 ప్రాథమికంగా ఎలాంటి ఆధారాల్లేవు : పోలీసులు

అమెరికాలో  అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన  20 ఏళ్ల భారతీయ విద్యార్థి పరుచూరి  అభిజిత్‌ది హత్యకాదని అమెరికా  పోలీసులు తేల్చారు. హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు  మొదలు  పెట్టిన పోలీసులు తమ ప్రాథమిక విచారణలో హత్య అని అనుమానించేందుకు ఆధారాలేవీ లేవని  చెప్పినట్లు న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు.  అభిజిత్‌ అకాల మరణంపై విచారాన్ని వ్యక్తం చేసిన కాన్సులేట్, అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు అన్ని ఏర్పాటు చేశామని, ఈ విషయంలో స్థానిక అధికారులతో పాటు భారతీయ-అమెరికన్ కమ్యూనిటీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ ఎక్స్‌( ట్విటర్‌) పోస్ట్‌లో పేర్కొంది. దీంతో అభిజిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడా?అనే అనుమానాలు తలెత్తెతున్నాయి. అదే నిజమైతే అభిజిత్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.  అసలు డెడ్‌ బాడీ అడవిలోకి ఎలా వెళ్లింది?  అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. 

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన  పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల  తమ తనయుడు అభిజిత్‌ను మార్చి 11న యూనివర్శిటీ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని కారులో అడవిలో వదిలివెళ్లారని  ఆరోపించిన సంగతి తెలిసిందే.  చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులు చాన్నాళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్‌ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు.

వీరి కుమా­రుడు అభిజిత్‌ బోస్టన్‌లోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్‌ నుంచి ఎలాంటి సమాచారం రాక­పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్ర­యించారు. విచారణ చేపట్టిన పోలీసులు అతని సెల్‌ నంబర్‌ ఆధారంగా అభిజిత్‌ మృత­దేహాన్ని బోస్టన్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో అదే రోజు గుర్తించడం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిజిత్‌ భౌతిక కాయానికి స్వస్థలం బుర్రిపాలెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.  కాగా ఏడాది (2024) ప్రారంభం నుండి,  అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు తొమ్మిది మంది మరణించడం విషాదం.

Advertisement
 
Advertisement