ఎకరాకు రూ.14 వేల బోనస్‌ ఎందుకివ్వడం లేదు?  | Sakshi
Sakshi News home page

ఎకరాకు రూ.14 వేల బోనస్‌ ఎందుకివ్వడం లేదు? 

Published Sat, Apr 20 2024 5:29 AM

BRS and Congress Party Leaders Join in BJP Party in Karimnagar - Sakshi

ఎంపీ బండి సంజయ్‌ 

కరీంనగర్‌ టౌన్‌: అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్‌ వడ్లకు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, ఈ లెక్కన ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల చొప్పున బోనస్‌ ఎందుకివ్వడం లేదని బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఇచ్చిన హామీల మేరకు తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు కొనాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌కు చెందిన తాజా, మాజీ సర్పంచులు పలువురు బీజేపీలో చేరారు.

వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సంజయ్‌ మాట్లాడు తూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పాలనలో సర్పంచుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. మోదీ ప్రభు త్వం పంచాయతీలకు నిధులివ్వడంతోనే సిబ్బందికి జీతాలిస్తున్నారని తెలిపారు. దేశమంతా మోదీ గాలి వీస్తుందని, తొలివిడతలోనే 102 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు.

 
Advertisement
 
Advertisement