లోక్‌సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ వేర్పాటువాది | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌

Published Sat, Apr 27 2024 2:34 PM

Pro Khalistani Separatist amritpal singh Contest Lok Sabha Polls

ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన తల్లి బల్విందర్‌ కౌర్ శనివారం తెలిపారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ సెగ్మెంట్‌ నుంచి అమృత్‌పాల్‌ సింగ్‌ స్వాతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని చెప్పారు.   

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తన కుమారుడు అమృత్‌పాల్‌ సింగ్‌పై ఒత్తిడి పెరుగుతోందని ఆమె తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖదూర్‌ సాహిబ్‌ సీట్లు పోటీ చేసి రాజకీయ ఇ‍న్నింగ్స్ ప్రారంభిస్తారని పేర్కొన్నారామె. ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం లేదని.. స్వాతంత్రగా పోటీ చేస్తున్నారని ఆమె వివరించారు. పంజాబ్‌లోని పలు సమస్యలపై అమృత్‌ పాత్‌కు పూర్తి అవగాహన ఉందని, వాటిపై పోరాటం చేస్తారని తెలిపారు.

ఒక రోజు క్రితం  అమృత్‌పాల్‌ సింగ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోట  చేసేది ధృవికరించలేమని ఆయన తండ్రి తార్సెమ్ సింగ్‌  చెప్పారు. అయితే ప్రజులు కోరుకుంటే ఎన్నికల బరిలోకి దిగుతారని అన్నారు. అంతకంటే  ముందు అమృత్‌ పాల్‌  లోక్‌సభ ఎన్నికల పోటీపై ఆయన లీగల్‌ కౌన్సిల్‌ రాజ్‌దేవ్‌ సింగ్ ఖాల్సా కూడా స్పందించారు. అమృత్‌ పాల్‌..  పంజాబ్‌లోని  ఖదూర్ సాహిబ్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పోటీ చేయనున్నారని తెలిపారు. ప్రస్తుతం అమృత్‌ పాల్‌ సింగ్‌ అసోంలోని డిబ్రూగఢ్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే.  గత ఏడాది ఏప్రిల్‌లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది అనుచరులను జైలుకు తరలించారు. 

ఇక.. గతేడాది ఫిబ్రవరిలో అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అమృత్‌ పాల్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటంతో ఆయన మద్దతుదారులను పోలీస్‌ స్టేషన్‌పై దాడికి దిగెలా చేశాడు. వారంతా ఫిబ్రవరి 23న పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.

లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే విద్వేష ప్రసంగాలు చేసినందుకు అమృత్‌పాల్‌ సింగ్‌పై కేసు నమోదైంది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. సుమారు 35 రోజుల పాటు వెతికి పట్టుకున్నారు పోలీసులు. అనంతరం పంజాబ్‌ పోలీసులు అమృత్‌ పాల్‌ సింగ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా అసోంలోని డిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు.

Advertisement
Advertisement