IPL 2023, PBKS Vs RR: Yuzvendra Chahal Surpasses Lasith Malinga Record - Sakshi
Sakshi News home page

Yuzvendra Chahal: చహల్‌ చరిత్ర.. మలింగను దాటి రెండో స్థానంలోకి

Published Thu, Apr 6 2023 12:10 AM

Chahal Breaks Lasith Malinga Record Become 2nd Highest Wicket-Taker-IPL - Sakshi

రాజస్థాన్‌ స్టార్‌ స్పిన్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ చరిత్ర సృష్టించాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో జితేశ్‌ శర్మ వికెట్‌ తీయడం ద్వారా చహల్‌ ఐపీఎల్‌లో 171 వ వికెట్‌ సాధించాడు ఈ క్రమంలో ఐపీఎల్‌లో అ‍త్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చహల్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 133 మ్యాచ్‌లు ఆడి 171 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్‌ లసిత్‌ మలింగ​ సైతం 161 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు పడగొట్టి.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్‌తో సమానంగా ఉన్నాడు. తాజాగా చహల్‌ మలింగను దాటి రెండో స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. ​ఇక ఈ సీజన్‌లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్‌లో హైయెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా నిలుస్తాడు. ప్రస్తుత సీజన్‌లో చహల్‌కు మినహా మరే బౌలర్‌కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్‌ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్‌ (రాజస్థాన్‌, 158), భువనేశ్వర్‌ కుమార్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌, 154), సునీల్‌ నరైన్‌ (కేకేఆర్‌, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement