విండీస్‌తో సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా టెస్ట్‌, వన్డే జట్ల ప్రకటన | Sakshi
Sakshi News home page

విండీస్‌తో సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా టెస్ట్‌, వన్డే జట్ల ప్రకటన

Published Wed, Jan 10 2024 7:36 AM

Cricket Australia Announce Squad For West Indies Series - Sakshi

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్ట్‌లు, మూడు వన్డేల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. వార్నర్‌ టెస్ట్‌ల నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో మ్యాట్‌ రెన్‌షాను ఎంపిక చేశారు ఆసీస్‌ సెలెక్టర్లు. వార్నర్‌ రిటైర్మెంట్‌ అనంతరం టెస్ట్‌ల్లో ఓపెనింగ్‌ అవకాశాలపై గంపెడాశలు పెట్టుకున్న కెమరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌, మార్కస్‌ హ్యారిస్‌లకు నిరాశ తప్పలేదు.

పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కెమరూన్‌ గ్రీన్‌ తిరిగి జట్టులో చోటు సంపాదించగలిగాడు. మిచెల్‌ మార్ష్‌ ఆగమనంతో సరైన అవకాశాలు దక్కని గ్రీన్‌పై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. విండీస్‌తో తొలి టెస్ట్‌కు మ్యాట్‌ రెన్‌షా, స్కాట్‌ బోలాండ్‌ తుది జట్టులో ఉంటారని ఆసీస్‌ చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ సూచనప్రాయంగా చెప్పాడు. 

టెస్ట్‌ సిరీస్‌ అనంతరం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా జట్టును ఎంపిక చేశారు ఆసీస్‌ సెలెక్టర్లు. ఈ సిరీస్‌ కోసం రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌కు రెస్ట్‌ ఇచ్చిన సెలెక్టర్లు.. స్టీవ్‌ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. వన్డే సిరీస్‌కు కమిన్స్‌తో పాటు మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ల​కు విశ్రాంతినిచ్చారు. విండీస్‌ ఈ పర్యటనలో టెస్ట్‌, వన్డే సిరీస్‌లతో పాటు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా ఆడాల్సి ఉంది. ఇందు కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించాల్సి ఉం‍ది.

వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్‌, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్‌షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్‌సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా

ఆస్ట్రేలియా వర్సెస్‌ వెస్టిండీస్‌ షెడ్యూల్‌..

  • తొలి టెస్ట్‌: జనవరి 17-21 (అడిలైడ్‌)
  • రెండో టెస్ట్‌: జనవరి 25-29 (బ్రిస్బేన్‌)

తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్‌బోర్న్‌)
రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ)
మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్‌బెర్రా)

  1. తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్‌)
  2. రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్‌)
  3. మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement