పెళ్లి చేసుకుంటావా? అన్నాడు.. నో చెప్పానని సినిమాలో నుంచే.. | Meenakshi Seshadri Ousted from Damini after she Refused Rajkumar Santoshi marriage proposal During Damini Movie | Sakshi
Sakshi News home page

సెట్‌లో దర్శకుడి పెళ్లి ప్రపోజల్‌.. పరువు బజారుకీడ్చి రచ్చ చేసే రకం కాదు!

Published Mon, Jun 3 2024 3:46 PM | Last Updated on Mon, Jun 3 2024 3:55 PM

Meenakshi Seshadri Ousted from Damini after she Refused Rajkumar Santoshi marriage proposal During Damini Movie

సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చిందని సంబరపడేలోపే తనను మూవీలో నుంచే తీసేశారట! ఒక దర్శకుడు పెట్టిన పెళ్లి ప్రపోజల్‌కు ఒప్పుకోలేదని తనను పక్కన పెట్టేశారంటోంది అలనాటి హీరోయిన్‌ మీనాక్షి చౌదరి. దామిని (1993) సినిమా సమయంలో తనకు ఎదురైన ఇబ్బందులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. 

పెళ్లి ప్రపోజల్‌
మీనాక్షి శేషాద్రి మాట్లాడుతూ.. 'ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంలో దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. నేను కుదరదని తిరస్కరించాను. దాని గురించి పెద్ద రచ్చ కూడా చేయలేదు.  సైలెంట్‌గా ఉన్నాను. ఆయన కూడా మౌనంగానే ఉన్నాడు. నా మనసుకు అనిపించింది చెప్పాను. అదే మాట మీద నిలబడ్డాను కూడా! నో చెప్పాను కదా అని నన్ను సినిమాలో నుంచి తీసేయాలని చూస్తే ఎలా? 

వాళ్లు జోక్యం చేసుకోవడంతో..
పరిస్థితులు వర్కవుట్‌ అయితే టీమ్‌గా కలిసి పని చేస్తాం, లేదంటే లేదు. ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నాను. ఆ గొప్ప సినిమా దామిని అవ్వాలనుకున్నాను. ఆ సమయంలో నిర్మాతల మండలి జోక్యం చేసుకుంది. ఆర్టిస్టుల గిల్డ్‌ కూడా ఈ వ్యవహారంపై స్పందించి నేను మళ్లీ దామిని చిత్రంలో భాగమయ్యేట్లు చేసింది. అలా దామిని సినిమా షూటింగ్‌ సజావుగా సాగిపోయింది' అని చెప్పుకొచ్చింది.

పెళ్లి తర్వాత..
కాగా మీనాక్షి.. 1995లో హరీశ్‌ మైసూర్‌ను పెళ్లాడింది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. మరోవైపు రాజ్‌కుమార్‌ సంతోషి.. మనీలాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. 1996లో మీనాక్షి, రాజ్‌కుమార్‌ సంతోషి ఘటక్‌ సినిమాకు కలిసి పని చేశారు.

చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‍‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement