Damini
-
ఇలా చేస్తే పిడుగుపాటు నుంచి బయట పడవచ్చు!
వర్షాకాలంలో తరచూ పిడుగులు పడి మనుషులూ, పశువులూ చనిపోవడం తెలిసిందే. నిపుణులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే పిడుగుపాటు నుంచి బయట పడవచ్చు. వర్షం రాగానే చెట్ల కిందికి పరుగెత్తకూడదు. ఒంటరి చెట్టు అత్యంత ప్రమాదకరం. చెట్లు, స్తంభాల కిందకు వెళ్లకుండా ఇళ్లకు, సురక్షిత భవనాలకు చేరుకోవాలి. కారులో ఉంటే అందులో కూర్చొని, కిటికీ అద్దాలు మూసివేయాలి. చేతులు ఒళ్ళో పెట్టుకోవాలి. లోహపు తలుపులను తాకరాదు. ఇంటిలో ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అవసరం. విద్యుత్ పరికరాలను ఆపేయాలి. ఛార్జింగ్ చేస్తున్న ఫోన్ తాకకూడదు. కాంక్రీటు గోడలను, నేలను తాకకూడదు. బాల్కనీ, కిటికీలకు దగ్గరగా ఉండకూడదు. నల్లా నీటిని తాకరాదు. తాము నిలబడిన భూమి పొడిగా ఉండాలి. తడిగా ఉంటే దగ్గరలో పిడుగు పడితే విద్యుత్ఘాతానికి గురి కావచ్చు.చర్మంపై గుచ్చినట్లున్నా, వెంట్రుకలు నిక్క బొడిచినా వెంటనే పిడుగు పడబోతోందని అర్థం (ఈ సూచికలు గుర్తించే అవకాశం ప్రతిసారీ ఉండక పోవచ్చు). పొలాల్లో ఉన్నప్పుడు కాలి మునివేళ్ళ పైన తల వంచి, చెవులు మూసుకొని కూర్చోవడం ఒక మార్గం. ఇందువల్ల నేరుగా పిడుగు పడే అవకాశాలు తగ్గుతాయి. రెండు కాలి మడమలు ‘V’ ఆకారంలో వెనక తాకి ఉండాలి. ఇందువల్ల భూమిపై పిడుగు పడితే ఒక కాలిలోకి ప్రవేశించిన విద్యుత్ మరో కాలిలోంచి భూమిలోకి త్వరగా వెళ్ళిపోతుంది. అడవిలో ఉంటే గుంపుగా ఉన్న చిన్న చెట్ల కింద ఉండవచ్చు. అప్పటికే కొండపై ఉంటే ఏదేని గుహ కనిపిస్తే వెళ్ళవచ్చు. తాటి చెట్లు ఎత్తుగా, తడిగా ఉండటం వల్ల సహజంగా పిడుగులను ఆకర్షించి భూమిలోకి విద్యుత్తును ప్రవహింపచేస్తాయి. ఇంటిలో ఉండడం క్షేమమే, అయినా పక్కనే పెద్ద చెట్టు ఉంటే ఏమి జరుగుతుందో సూర్యారావుపాలెం పిడుగుపాటు చెబుతోంది. చెట్టుకు దగ్గరలో ఎండు కర్రలు, దహనశీల పదార్థాలు ఉంటే అగ్ని తీవ్రత పెరుగుతుంది. కానీ అసలు చెట్లే లేకపోతే మైదాన ప్రాంతంలో కూడా పిడుగు పడుతుంది. కనుక గ్రామాల్లో చెట్లు అన్నీ ఒకే ఎత్తులో ఉండేట్లు పై కొమ్మలు తొలగిస్తే ప్రమాదావకాశాలు కొంత తగ్గుతాయి. మైదాన ప్రాంతంలో ఉండే పాన్ డబ్బాల దగ్గర మరీ ప్రమాదకరం. చదవండి: చలికాలంలో పొంచివున్న వ్యాధులు.. జాగ్రత్తలు ఇవే‘పిడుగు వాహకాలు’ (లైట్నింగ్ కండక్టర్) గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇవి 20 ఏళ్ళకు పైగా పని చేస్తాయి. పిడుగు వాహకాలు కొద్ది మీటర్ల మేరకే రక్షణ కల్పిస్తాయి గనుక అన్ని ఎత్తైన ఇళ్ళపై ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర భూవిజ్ఞాన శాఖ ‘దామిని’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. రానున్న 40 నిమిషాల్లో చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పిడుగులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 83 ప్రాంతాల్లో నెట్ వర్క్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకులు -
పెళ్లి చేసుకుంటావా? అన్నాడు.. నో చెప్పానని సినిమాలో నుంచే..
సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందని సంబరపడేలోపే తనను మూవీలో నుంచే తీసేశారట! ఒక దర్శకుడు పెట్టిన పెళ్లి ప్రపోజల్‌కు ఒప్పుకోలేదని తనను పక్కన పెట్టేశారంటోంది అలనాటి హీరోయిన్ మీనాక్షి చౌదరి. దామిని (1993) సినిమా సమయంలో తనకు ఎదురైన ఇబ్బందులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. పెళ్లి ప్రపోజల్మీనాక్షి శేషాద్రి మాట్లాడుతూ.. 'ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంలో దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. నేను కుదరదని తిరస్కరించాను. దాని గురించి పెద్ద రచ్చ కూడా చేయలేదు. సైలెంట్‌గా ఉన్నాను. ఆయన కూడా మౌనంగానే ఉన్నాడు. నా మనసుకు అనిపించింది చెప్పాను. అదే మాట మీద నిలబడ్డాను కూడా! నో చెప్పాను కదా అని నన్ను సినిమాలో నుంచి తీసేయాలని చూస్తే ఎలా? వాళ్లు జోక్యం చేసుకోవడంతో..పరిస్థితులు వర్కవుట్ అయితే టీమ్‌గా కలిసి పని చేస్తాం, లేదంటే లేదు. ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నాను. ఆ గొప్ప సినిమా దామిని అవ్వాలనుకున్నాను. ఆ సమయంలో నిర్మాతల మండలి జోక్యం చేసుకుంది. ఆర్టిస్టుల గిల్డ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించి నేను మళ్లీ దామిని చిత్రంలో భాగమయ్యేట్లు చేసింది. అలా దామిని సినిమా షూటింగ్ సజావుగా సాగిపోయింది' అని చెప్పుకొచ్చింది.పెళ్లి తర్వాత..కాగా మీనాక్షి.. 1995లో హరీశ్ మైసూర్‌ను పెళ్లాడింది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. మరోవైపు రాజ్‌కుమార్ సంతోషి.. మనీలాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. 1996లో మీనాక్షి, రాజ్‌కుమార్ సంతోషి ఘటక్ సినిమాకు కలిసి పని చేశారు.చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే -
Holi 2021: కలర్‌ఫుల్ కలర్స్
ఒక్కరు ఆడరు. మనుషులు గుంపులు. రంగులు బోలెడు. మీసం రంగు మారుతుంది. గాజులు వేరే రంగుకొస్తాయి. ఆట ఒక రంగు. పాట ఒక రంగు. వయసులో ఉన్న కుర్రదీ కుర్రాడూ ఒక రంగు. హోలీ వెలిసిన క్షణాలను దూరంగా విసిరేస్తుంది. ఉత్సాహ కణాలను దేహంలో నింపుతుంది. ఈ పండుగను పెద్ద తెర పండుగ చేసుకుంది. హిందీ సినిమాల్లో హోలీది మహాకేళీ. అందరికీ రంగుల చెమేలీ పూలు. హోలీలో ఎన్ని రంగులు ఉంటాయి? అన్నీ. హిందీ సినిమాల్లో హోలీని అడ్డు పెట్టుకుని ఎన్ని సీన్లు ఉంటాయి? అన్నే. వెండితెర అంటేనే కలర్ఫుల్గా ఉంటుందని కదా... మరి ఆ కలర్‌ఫుల్ తెరకే రంగులు అద్దితే ఎలా ఉంటుంది? చూద్దాం.. ‘మదర్ ఇండియా’ను మొదట చెప్పుకోవాలి. కలర్లో పాత్రలు హోలీ ఆడింది ఆ సినిమాలోనే. ఆడించినవాడు దర్శకుడు మెహబూబ్ ఖాన్. ‘హోలీ ఆయిరే కన్హాయి హోలీ ఆయిరే’ పాట అందులోదే. వితుంతువైన తల్లి నర్గిస్ తన ఇద్దరు కొడుకులు సునీల్ దత్, రాజేంద్ర కుమార్ గ్రామస్తులతో కలిసి పాడుతూ ఉంటే పులకించి భర్త రాజ్‌కుమార్‌తో తాను హోలి ఆడిన రోజులను గుర్తు చేసుకుంటుంది. కొడుకుల జీవితం, భవిష్యత్తు రంగులమయం కావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కాని వారిలో ఒక కొడుకు చెడ్డ రంగును, ద్రోహపు రంగును, ఊరికి చేయదగ్గ అపకారపు రంగును పులుముకుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ రంగును కడిగి మురిక్కాలువలో పారేస్తుంది. ‘మదర్ ఇండియా’లో నర్గిస్ అదే చేస్తుంది. బందిపోటుగా మారిన కొడుకు సునీల్‌దత్‌ను ఊరి అమ్మాయిని ఎత్తుకుని పోతూ ఉంటే కాల్చి పడేస్తుంది. దేశం గురించి సంఘం గురించి ఆలోచించేవారు ఆ పనే చేస్తారు. సొంత కొడుక్కి తల్లి కావడం ఎవరైనా చేస్తారు. దేశానికి తల్లి కాగలగాలి. మదర్ ఇండియా చెప్పేది అదే. ‘కటీ పతంగ్’ రాజేష్ ఖన్నా 1969–71ల మధ్య ఇచ్చిన వరుస 17 హిట్స్‌లో ఒకటి. ఆ కథ ఒక ‘వితంతువు’ ఆశా పరేఖ్‌కు కొత్త జీవితం ప్రసాదించడం గురించి. నిజానికి ఆశాపరేఖ్ వితంతువు కాదు. మరణించిన స్నేహితురాలి కోసం వితంతువుగా మారింది. ఆమెను రాజేష్ ఖన్నా ప్రేమిస్తాడు. వైధవ్యం పాపం, శాపం కాదని అంటాడు. హోలి వస్తుంది. ‘ఆజ్ న ఛోడేంగే బస్ హమ్ జోలి’అని రాజేష్ ఖన్నా పాట అందుకుంటాడు. కాని తెల్లబట్టల్లో ఉన్న ఆశా పరేఖ్ దూరంగా ఉంటుంది. ఎందుకంటే వితంతువులు హోలి ఆడకూడదు. వారికి ఇక శాశ్వతంగా మిగిలేది తెల్లరంగే. కాని రాజేష్ ఖన్నా ఇందుకు అంగీకరించడు. పాట చివరలో రంగుల్లోకి లాక్కువస్తాడు. క్లయిమాక్స్‌లో ఆమెకు రంగుల జీవితం ఇస్తాడు. భర్త చనిపోవడంతో జీవితపు రంగులు ఆగిపోవడం ఒక వాస్తవం కావచ్చు. కాని జీవితం ముందు ఉంది. కొత్త రంగును తొడుక్కుంటే అది తప్పక మన్నిస్తుంది. ‘షోలే’లో గబ్బర్ సింగ్ మనుషుల్ని ఠాకూర్ సంజీవ్ కుమార్ ఆదేశం మేరకు అమితాబ్, ధర్మేంద్రలు తన్ని తగలేస్తారు. మరి గబ్బర్ సింగ్ ఊరుకుంటాడా? రామ్‌గఢ్‌పై దాడి చేయాలనుకుంటాడు. ‘కబ్ హై హోలి.. హోలి కబ్ హై’ అని అడుగుతాడు. ఈ సంగతి తెలియని రామ్‌గఢ్ వాసులు హోలీ వేడుకల్లో మునిగి ‘హోలికె దిన్ రంగ్ మిల్ జాయేంగే’ అని పాడుకుంటూ ఉంటారు. హటాత్తుగా గబ్బర్ ఊడిపడతాడు. ఊరంతా అల్లకల్లోలం. అగ్నిగుండం. అమితాబ్ దొరికిపోతాడు. ధర్మేంద్ర కూడా దొరక్క తప్పదు. ‘నా కాళ్ల మీద పడి క్షమాపణ కోరితే వదిలేస్తాను’ అంటాడు గబ్బర్ వాళ్లతో. అమితాబ్ బయలుదేరుతాడు. ఏం జరుగుతుందా అని అందరిలోనూ ఉత్కంఠ. గబ్బర్ కాళ్ల దగ్గరకు నమస్కారం పెట్టడానికన్నట్టు వొంగిన అమితాబ్ అక్కడ కింద ఉన్న రంగులు తీసి తటాలున గబ్బర్ కళ్లల్లో కొడతాడు. చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఈ సీన్ హోలి సీన్లన్నింటిలో తలమానికం. గబ్బర్ భరతం పట్టిన సీన్ అది. ‘సిల్సిలా’లో అమితాబ్ రేఖా ప్రేమించుకుంటారు. కాని అమితాబ్ జయా బచ్చన్‌ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. రేఖ సంజీవ్ కుమార్‌ను. రెండు జంటలూ తమ జీవితాలు గడుపుతూ ఉండగా అమితాబ్, రేఖ తిరిగి తారసపడతారు. తమలో ఇంకా ప్రేమ ఉందనుకుంటారు. తమ పెళ్లిళ్లు అర్థం లేనివని భావిస్తారు. తమ తమ భాగస్వాముల మధ్య ఆ సంగతి సూచనగా చెప్పడానికి హోలిని ఎంచుకుంటారు. ‘రంగ్ బర్సే’ పాటను అమితాబ్ పాడుతూ పరాయివ్యక్తి భార్య అని కూడా తలవకుండా రేఖ వొడిలో తల పెట్టుకుని కేరింతలు కొడతాడు. కాని పెళ్లయ్యాక ఈ దేశంలో గతన్నంతా బావిలో పారేయాల్సి ఉంటుంది. పెళ్లికే విలువ. దాని పట్లే స్త్రీ అయినా పురుషుడైనా విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. చివరిలో ఆ సంగతి అర్థమయ్యి అమితాబ్, రేఖ తమ తమ పెళ్లిళ్లకు నిబద్ధులవుతారు. కాని ఈలోపు వారి వివాహేతర ప్రేమను చూపే పద్ధతిలో ట్రీట్మెంట్ దెబ్బ తిని సినిమా కుదేలైంది. ఇదో చేదురంగు. ‘దామిని’లో హోలీ క్రూర రంగులను చూపిస్తుంది. అందులో మీనాక్షి శేషాద్రి పెద్దింటి కోడలు. కాని మరిది ఆ ఇంట్లో హోలీ రోజున ఆ గోలలో పని మనిషిపై అత్యాచారం చేస్తాడు. మీనాక్షి శేషాద్రి ఆ దుర్మార్గాన్ని చూస్తుంది. దారుణంగా బాధను అనుభవించిన పని మనిషికి న్యాయం చేయడానికి మీనాక్షి శేషాద్రి తన వైవాహిక బంధాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే అని నిలబడుతుంది. ఆమె మీద ఎన్నో దాడులు. కాని దాడులు నిండినదే లోకం అయితే లోకం ఉంటుందా? ఎవరో ఒకరు తోడు నిలుస్తారు. మీనాక్షి శేషాద్రికి తోడుగా సన్ని డియోల్ నిలుస్తాడు. పోరాడతాడు. న్యాయం జరిగేలా చూస్తాడు. న్యాయం గెలిచినప్పుడు ఆ రంగులకు వచ్చే తేజం గొప్పది. ‘డర్’ సినిమా దౌర్జన్యప్రేమను చూపిస్తుంది. అసలు ‘నో’ అనే హక్కు, స్వేచ్ఛ స్త్రీలకు ఉందని కూడా కొందరు మూర్ఖప్రేమికులకు తెలియదు. ఉన్మత్తంగా ప్రేమించినంత మాత్రాన ఆ ప్రేమ గొప్పది అయిపోదు. ‘డర్’లో జూహీ చావ్లాను ప్రేమించిన షారూక్ ఖాన్ ఆమె వివాహం అయ్యాక కూడా వెంటపడతాడు. ఆమె ఇంట్లో హోలీ చేసుకుంటూ ఉంటే ముఖాన రంగులు పూసుకుని ప్రత్యక్షమవుతాడు. భయభ్రాంతం చేస్తాడు. ఎంత హింస అది. రంగు ముఖానికి పూసుకుంటే బాగుంటుంది. కళ్లల్లో పడితే బాగుంటుందా? కళ్లల్లో పడే రంగును ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. చివరకు ఆ రంగు సముద్రంలో కలిసిపోతుంది. రంగులు అన్నీ మంచివే. కాని కొన్ని రంగులు కొందరికి నచ్చవు. అలాగే కొన్ని జీవన సందర్భాలు కూడా నచ్చవు. కాని నచ్చని రంగులు ఉన్నప్పుడే నచ్చే రంగులకు విలువ. నచ్చని జీవన సందర్భాలు ఉన్నప్పుడే నచ్చే జీవన సందర్భాలకు విలువ. పాడు రంగులనూ పాత గాయాలనూ వదిలి కొత్త రంగుల్లోకి కొత్త ఉత్సాహాల్లోకి ఈ హోలి అందరినీ తీసుకెళ్లాలని కోరుకుందాం. హ్యాపీ హోలీ. – సాక్షి ఫ్యామిలీ -
ఒక సర్కిల్.. నాలుగు కోణాలు
మనందరికీ స్నేహితులు. వాళ్లందరూ మన సర్కిల్.భిన్న వైరుధ్యాల వృత్తం అది.వృత్తంలో శృతులు తప్పుతాయి. కానీ వృత్తం శృతి తప్పదు. కుటుంబంతో పంచుకోలేనివి..సమాజంతో చెప్పుకోలేనివి..ఈ సర్కిల్లోనే ఆవిష్కృతం అవుతాయి. పరిష్కృతమూ అవుతాయి.నాలుగు స్తంభాల ఆటలోప్రతిష్టంభన ఉండదనిఈ నలుగురు అమ్మాయిల కథలు మనకు చెబుతాయి. టకీలా షాట్స్‌తో కష్టసుఖాలను పంచుకునే నలుగురు స్నేహితుల కథ.. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్! ముంబైలోని పాష్ లొకాలిటీలో నివసిస్తూ అంతే ఆధునికమైన జీవనశైలితో పురుషాధిపత్య సమాజంలోని చాలెంజెస్‌ను ఎదుర్కొంటున్న ఆ నలుగురు.. దామిని రిజ్వి రాయ్, అంజనా మీనన్, ఉమంగ్ సింగ్, సిద్ధీ పటేల్. ఇంట్రడక్షన్ దామిని (సయాని గుప్తా).. జర్నలిస్ట్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వెబ్‌సెట్‌కి ఫౌండర్. కుంభకోణాలు, రాజకీయ పర్యవసానాల మీద కథనాలు రాస్తూంటుంది. ఫియర్లెస్ జర్నలిస్ట్‌గా అవార్డులు..సోషల్ మీడియాలో పాపులారిటీ.. ట్రోలింగ్ సర్వసాధారణం ఆమెకు. అబ్సేషన్ కంపల్సివ్ డిజార్డర్.. రిలేషన్స్‌లో అసంతృప్తి కూడా ఆమె ఐడెంటిటీలో భాగమే. అంజనా మీనన్ (కృతి కుల్హరి).. ముంబైలో లీడింగ్ అడ్వకేట్. సింగిల్ మదర్. నాలుగేళ్ల కూతురు. భర్త వరుణ్ ఖన్నా. స్ట్రగులింగ్ స్క్రిప్ట్ రైటర్. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న ప్పటి నుంచీ అన్ని బాధ్యతలూ అంజనా భుజాల మీదే. కూతురు పుట్టాక కూడా వరుణ్‌లో ఎలాంటి మార్పు రాదు. కెరీర్ మీద దృష్టి పెట్టడు. అన్నిటినీ తేలికగా తీసుకునే అతని తత్వంతో విసిగిపోయి విడాకులు తీసుకుంటుంది అంజనా. అయితే కూతురు మీద భర్తకున్న హక్కును గౌరవిస్తుంది. భర్త జీవితంలోకి ఇంకో అమ్మాయి వస్తుంది. ఆమె పేరు కావ్య. తన కూతురును చాలాబాగా చూసుకుంటూంటుంది. దాంతో పాపా ఆమెకు చాలా మాలిమి అవుతుంది. ఎంతలా అంటే ప్రతి విషయంలో తల్లిని కావ్యతో పోల్చుకునేంతలా. ఇది అంజనాకు ఇబ్బందిగానే కాదు బాధగానూ ఉంటుంది. అంజనా తల్లికీ కావ్య నచ్చుతుంది. తన బిడ్డలో లేని సహనం, అమ్మతనంలోని ఓపిక ఆమెకు కావ్యలో కనపడుతుంది. దాంతో ఆమే కావ్యకు దగ్గరవుతుంది. వీటన్నిటి వల్ల కావ్యతో సఖ్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది అంజనాకు.ఉమంగ్ సింగ్ (బాని జి).. లుథియానాలో పుట్టిపెరిగిన అమ్మాయి. జిమ్ ట్రైనర్. తన సెక్సువాలిటీ మీద అవగాహన, తనకేం కావాలో స్పష్టత ఉన్న మనిషి. బై సెక్సువల్. బాలీవుడ్ స్టార్ సమారా కపూర్ (లిసా రే) అంటే క్రష్.. ప్రేమ. సిద్ధీ పటేల్ (మాన్వి గగ్రూ).. వయసు మళ్లుతున్న అవివాహిత వాళ్లమ్మ దృష్టిలో. సంపన్న కుటుంబం. భోజన ప్రియురాలు, బొద్దుగా ఉంటుంది చిన్నప్పటి నుంచీ. బయటవాళ్లకంటే తల్లి దగ్గరే బాడీ షేమింగ్‌కు గురవుతూ ఉంటుంది. ఆమె తిండి మీదే కాదు ప్రవర్తన మీద కూడా బోలెడు ఆంక్షలు విధిస్తూ ఉంటుంది తల్లి. పెళ్లే ఆ పిల్లకున్న ఏకైక లక్ష్యమన్న భావనలో కూతురిని పడేస్తుంది. దీంతో తల్లి పట్ల అసహనంగా ఉంటుంది సిద్ధీ. అమ్మ కంటే తనను పెంచిన ఆయా అంటే ఆమెకు ఇష్టం, గౌరవం. తల్లి పోరు నుంచి తప్పించుకోవడానికి పెళ్లే మార్గమని సిద్ధీ ఓ నిశ్చయానికి వచ్చేస్తుంది. ట్రక్ బార్ తను పెట్టిన వెబ్సైట్లోనే తననే కార్నర్చేస్తూ ఆ మానసిక ఒత్తిడితో దామిని, ఏ పనీపాటా లేకుండా కాలక్షేపం చేస్తున్న భర్తతో విసిగిపోయిన అంజనా.. తనకు నచ్చిన తీరులో బతకడానికి ముంబై వచ్చిన ఉమంగ్.. అమ్మ చీవాట్లతో ఆత్మాభిమానం దెబ్బతిన్న సిద్ధీ.. ట్రక్బార్కు వస్తారు. ఒకరికొకరు పరిచయం అవుతారు. గూడు కట్టుకున్న దిగులుకు ఫోర్ మోర్ షాట్స్‌తో అవుట్ లెట్ కనుక్కుంటారు. ఒకరి లైఫ్ స్టయిల్ పట్ల ఒకరికి యాక్సెప్టెన్స్ ఉండదు. అలాగని వ్యతిరేకించుకోరు. గౌరవించుకుంటారు. నలుగురినీ కలుపుతున్న కామన్ పాయింట్స్ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అని తెలుసుకుంటారు. స్నేహాన్ని గట్టిచేసుకుంటారు. ఆ నాటి నుంచి ట్రక్బార్ మీటింగ్ పాయింట్ అవుతుంది వాళ్లకు. బార్ ఓనర్ (ప్రతీక్ బబ్బర్).. పురుషాధిపత్యం మీద వీళ్లు వేసుకునే జోకులు, చేసే కామెంట్స్‌కి శ్రోత అవుతాడు. సెకండ్ ఇన్నింగ్స్ కొత్త జీవితం మొదలుపెట్టాలని నలుగురికీ ఉంటుంది. వరుణ్ గర్ల్ ఫ్రెండ్ కావ్య తనలోని అమ్మతనాన్నే కాదు స్త్రీత్వాన్నీ సవాల్ చేసినట్టు ఫీలవుతుంది అంజనా. దాంతో తన ఆఫీస్‌లో అప్రెంటిస్‌గా చేరిన ఒక యంగ్ లాయర్‌తో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలనుకుంటుంది. ఈ ఆలోచనకు, అంతర్లీనంగా దాగి ఉన్న సంప్రదాయ భావాలకు మధ్య తీవ్ర ఘర్షణ మొదలవుతుంది అంజనాలో. ఆ అబ్బాయితో బంధాన్ని కోరుకుంటుంది కాని అది తన కూతురికి తెలియకుండా దాచాలనుకుంటుంది. ఈ విషయంలో ఆ అప్రెంటీస్కి, అంజనాకు మధ్య చిన్న వాగ్వాదం జరుగుతుంది. ఆ అప్రెంటీస్ ఇచ్చిన భరోసాతో సమాధానపడి అతనిని ఇంటికి పిలుస్తుంది అంజనా. అదే సమయానికి ఆమె మాజీ భర్త వరుణ్, అతని గర్ల్‌ఫ్రెండ్ కావ్యా ఇంటికి వస్తారు కూతురిని చూడ్డం కోసం. బాయ్‌ఫ్రెండ్‌తో అంజనా కనిపించే సరికి ఓర్చుకోలేక పోతాడు వరుణ్. ఆ అసూయను అణచిపెట్టుకుని కూతురికి జబ్బు చేసినప్పుడు బయటపెడ్తాడు. కూతురు కన్నా వేరే ఆసక్తులు ఎక్కువయ్యాయని ఆమెను అపరాధిగా చేసి కూతురి బాధ్యతను అంజనా నుంచి లాక్కోడానికి ప్రయత్నిస్తాడు. తనను తాను నిరూపించుకోవడానికి అంజనా తన రిలేషన్‌కు స్వస్తి చెప్పి కూతురిని తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇటు దామిని కూడా ఆఫీస్ పాలిటిక్స్‌తో విసిగిపోతుంది. వెబ్సైట్ కో ఫౌండర్స్ న్యూయార్క్‌లో మాస్ కామ్ చేసిన ఓ కొత్త అమ్మాయిని అప్పాయింట్ చేస్తారు గ్లామర్ న్యూస్‌తో వ్యూస్‌ను మరింత పెంచడానికి. సెలబ్రిటీల ప్రైవేట్ వ్యవహారాల మీద పెన్ పెట్టమని రిపోర్టర్లను ఆదేశిస్తుంది ఆ కొత్త అప్పాయింటీ. ఖంగు తింటుంది దామినీ. రానురాను తన ప్రాపకం, ప్రభావం తగ్గడంతో డీలా పడిపోతుంది. ఆ టైమ్‌లో ఆమెకు అండగా నిలుస్తాడు ట్రక్బార్ ఓనర్ (ప్రతీక్ బబ్బర్). అతనికి దగ్గరవుతుంది దామినీ. అనుకున్నట్టుగానే సమారాకు దగ్గరవుతుంది ఉమంగ్. ఆమెకు పర్సనల్ జిమ్ ట్రైనర్‌గా చేరి. అయితే తనకున్న పబ్లిసిటీ, ఫ్యాన్‌ఫాలోయింగ్ దృష్ట్యా ఉమంగ్‌ను తన పార్టనర్‌గా ఎక్కడా పరిచయం చేయదు సమారా. పార్టీల్లో కూడా కేవలం జిమ్ ట్రైనర్‌గానే పరిచయం చేస్తుంది. అవమానంగా భావిస్తుంది ఉమంగ్. ఈలోపే వాళ్లిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటోగ్రాఫ్ మీడియా, సోషల్ మీడియాలో వైరలై సమారా ఒక లెస్బియన్ అనే వార్తలు వస్తాయి. ఇది తన కెరీర్‌ను దెబ్బతీయనుందని ఉమంగ్‌తో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటుంది సమారా. అలా ఉమంగ్ మళ్లీ ఒంటరిదైపోతుంది. తల్లి పెట్టే నసతో ఆత్మన్యూనతకు గురైన సిద్ధీ.. అడల్ట్ వెబ్సైట్లో మొహం కనపడకుండా అర్థనగ్నంగా ఫోజులిస్తూ.. దానికి ఫాలోయింగ్‌తో ఆత్మస్థయిర్యం పెంచుకుంటూంటుంది. బ్లాక్మెయిల్ దామినీ బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి గోవా టూర్ వెళ్తారు నలుగురూ. అక్కడ సిద్ధీకి తన చిన్ననాటి స్నేహితుడు కనిపిస్తాడు. అతను సిద్ధీని ఇష్టపడ్తుంటాడు. అతని సాహచర్యం సిద్ధీకీ నచ్చుతుంది. అతనితో ఉన్నప్పుడే ఒకసారి సిద్ధీకి బ్లాక్మెయిల్ మెస్సేజ్ వస్తుంది.. ‘‘నిన్ను హాఫ్ న్యూడ్‌గా చూడాలి.. వెంటనే ఆన్‌లైన్‌లోకి రా.. లేదంటే నీ ఫోటోస్ నీ బాయ్‌ఫ్రెండ్‌కి షేర్ చేస్తా’’ అంటూ. షాక్ అవుతుంది సిద్ధీ. గోవా నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ బ్లాక్మెయిల్ వెంటాడుతుంది. సిద్ధీ ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్లకు తెలిసి.. సంతోషంగా వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటారు. అటువైపు పేరెంట్స్ కూడా అభ్యంతరపెట్టరు. కాని ఎందుకనో సిద్ధీయే ఆనందంగా ఉండదు. అప్పుడే పెళ్లి చేసుకోవాలని అనిపించదు ఆమెకు. ఇంతేనా జీవితం? అనుకుంటుంది. ఏదో సాధించాలనే తపన మొదలవుతుంది. ఈలోపు మళ్లీ బ్లాక్మెయిల్ మెస్సేజ్ వస్తుంది. ఫ్రెండ్స్‌ని బార్కి పిలుస్తుంది ఆ విషయం చెప్పడానికి. సిద్ధీకి కాబోయే మామగారు కనిపిస్తారు బార్లో. మెస్సేజ్‌లో వాడిన భాషతో మాట్లాడుతుంటాడు. అప్పుడు అర్థమవుతుంది సిద్ధీకి ఆ బ్లాక్మెయిల్ తనకు కాబోయే మామ నుంచే అని. అతన్ని చెంప దెబ్బ కొడ్తుంది. ‘‘ఛీ నీలాంటి దాన్నా నా ఇంటికి కోడలుగా చేసుకునేది?’ అంటాడు. ‘‘ముందు నీలాంటి వాడి ఇంటికి కోడలుగా రావడానికి నేను సిద్ధంగా లేను’’ అని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇటు దామిని కలిసి ఉండాలనుకున్న ట్రక్ బార్ ఓనర్ దగ్గరకు అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ వచ్చేస్తుంది. అలా దామినీ ఒంటరే అయిపోతుంది. అలా మళ్లీ నలుగురు.. ట్రక్ బార్లో కలుసుకొని ఫోర్ మోర్ షాట్స్ తీసుకుని సడలని ఆత్మవిశ్వాసంతో ఒంటరి పోరాటానికి సిద్ధపడ్తారు. ఇదీ కథ. టకీలా బాటిల్లో స్త్రీ సాధికారతను.. షాట్స్‌లో ఆమె స్వేచ్ఛను పోసి స్ట్రీమింగ్ చేస్తోంది అమేజాన్ ప్రైమ్ ‘‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’’ పేరుతో! – సరస్వతి రమ -
ఈ భామ ఎవరో చెప్పుకోండి చూద్దాం..
ముంబై: ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టండి చూద్దాం... ఒక అరగంటలోఈ అమ్మాయి ఎవరో చెప్పాలి.. నో క్లూస్ ప్లీజ్... అవును... చుక్కల్లారా.. మబ్బుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆపద్బాంధవుడు హీరోయిన్, బాలీవుడ్ నటి మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్ హీరో రిషీ కపూర్ తన అభిమానులకు ఈ పరీక్ష పెట్టారు. ఈ అమ్మాయి ఎవరో చెప్పుకోండి.. నేనైతే అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా.. మరి మీరు.. ఎలాంటి క్లూ లేవు.. అంటూ ఒక ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ మధ్యకాలంలో ట్విట్టర్లో పలు సామాజిక అంశాలపై స్పందిస్తున్న బాబీ హీరో.. తాను మీనాక్షి శేషాద్రితో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో ట్విట్టర్లో సందడి చేసింది. దీంతోపాటు ఫ్యాన్స్ కు మీనాక్షికి సంబంధించిన వివరాలను అందించారు. మైసూరుకు చెందిన హరీష్‌ను పెళ్ళి చేసుకుని ఒక పాప, బాబుతో అమెరికాలోని డలస్లో చాలా సంతోషంగా జీవిస్తోందని తెలిపారు. మంచి పాత్ర వస్తే సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉంది అన్నారు. నటిగా మీనాక్షికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన దామిని హిందీ సినిమాలో రిషీకపూర్‌తో కలిసి జంటగా నటించారు మీనాక్షి. అయితే ఇటీవల ముంబైలో ఒక ఫంక్షన్లో ప్రత్యక్షమవడంతో ఆమె మళ్లీ సినిమాలో నటించబోతున్నారనే వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత మీనాక్షి ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని ఆ వార్తలను తేలిగ్గా తోసిపుచ్చారు.