SA VS IND 2nd T20: భారత్‌పై సౌతాఫ్రికా విజయం | Sakshi
Sakshi News home page

SA VS IND 2nd T20: భారత్‌పై సౌతాఫ్రికా విజయం

Published Tue, Dec 12 2023 8:16 PM

SA VS IND 2nd T20: South Africa Won The Toss And Opted To Bowl First - Sakshi

భారత్‌పై సౌతాఫ్రికా విజయం
భారత్‌పై ఐదు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. సౌతాఫ్రికా స్కోరు 154-5

ఐదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా 
139 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ ఐదో వికెట్‌ కోల్పోయింది. మిల్లర్‌ ఔటయ్యాడు.

నాలుగవ వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా 
108 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగవ వికెట్‌ కోల్పోయింది. హేఇన్రిచ్ క్లాసేన్ ఔటయ్యాడు.

టార్గెట్‌ 152.. 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసిన సౌతాఫ్రికా
152 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 56/1గా ఉంది. మార్క్రమ్‌ (14), హెండ్రిక్స్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
42 పరుగుల వద్ద (2.5 ఓవర్) సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. అనవసర  పరుగుకు ప్రయత్నించి బ్రీట్జ్కీ (16) రనౌటయ్యాడు. 

టార్గెట్‌ 152.. 2 ఓవర్లలోనే 38 పరుగులు బాదిన సౌతాఫ్రికా
152 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా శరవేగంగా పరుగులు సాధిస్తుంది. ఆ జట్టు 2 ఓవర్లలోనే 38 పరుగులు పిండుకుంది. హెండ్రిక్స్‌ (19), బ్రీట్జ్కీ (14) క్రీజ్‌లో ఉన్నారు.

తగ్గిన వర్షం.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే..?
వర్షం తగ్గిన అనంతరం అంపైర్లు ఓవర్లను కుదించారు. భారత ఇన్నింగ్స్‌ను 19.3 ఓవర్ల వద్దనే ముగించిన అంపైర్లు.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన సౌతాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులకు మార్చారు. 

వర్షం అంతరాయం
భారత ఇన్నింగ్స్‌ మరో 3 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం మొదలైంది. 19.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్‌ 180/7గా ఉంది. గెరాల్డ్‌ కొయెట్జీ బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్లో రవీంద్ర జడేజా (19), అర్షదీప్‌ సింగ్‌(0) ఔటయ్యారు. రింకూ సింగ్‌ (68)తో పాటు సిరాజ్‌ క్రీజ్‌లో ఉన్నాడు. 

రింకూ మెరుపు అర్ధశతకం
రింకూ సింగ్‌ కేవలం 30 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో తన కెరీర్‌లో తొలి అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీనికి ముందు జితేశ్‌ శర్మ (1) మార్క్రమ్‌ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
125 పరుగుల వద్ద (13.5 ఓవర్లలో) టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. షంషి బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్యకు​మార్‌ యాదవ్‌ (56) ఔటయ్యాడు. రింకూ (34), జితేశ్‌ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
55 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. కొయెట్జీ బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి తిలక్‌ వర్మ (29) ఔటయ్యాడు. 

ధాటిగా ఆడుతున్న తిలక్‌, స్కై
ఓపెనర్లు గిల్‌, యశస్వి డకౌట్‌లు అయ్యాక తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి భారత్‌ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు (53) దాటింది. స్కై (21), తిలక్‌ (28) క్రీజ్‌లో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. గిల్‌ డకౌట్‌
6 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో యశస్వి జైస్వాల్‌ డకౌట్‌ కాగా.. రెండో ఓవర్‌ ఆఖరి బంతికి శుభ్‌మన్‌ గిల్‌ కూడా సున్నా పరుగులకే ఔటయ్యాడు. లిజాడ్‌ విలియమ్స్‌ బౌలింగ్‌లో గిల్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

మూడో బంతికే వికెట్‌ కోల్పోయిన టీమిండియా
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మూడో బంతికే వికెట్‌ కోల్పోయింది. జన్సెన్‌ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి యశస్వి జైస్వాల్‌ డకౌటయ్యాడు.

సెయింట్‌ జార్జ్స్‌ పార్క్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. స్వల్ప అనారోగ్యం కారణంగా రుతురాజ్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ ప్రకటించాడు. భారత జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లకు కూడా అవకాశం దక్కలేదు. తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ వీరి స్థానాల్లో జట్టులోకి వచ్చారు. 

టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌‌మన్‌ గిల్, తిలక్‌ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్.

సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్‌ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్‌ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, అండిల్‌ ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్‌ షంసీ. 

Advertisement
Advertisement