India vs Australia 3rd T20I: సిరీస్‌ విజయమే లక్ష్యంగా... | Sakshi
Sakshi News home page

India vs Australia 3rd T20I: సిరీస్‌ విజయమే లక్ష్యంగా...

Published Tue, Nov 28 2023 2:12 AM

Team India targets an unassailable lead against Australia - Sakshi

గువాహటి: టి20ల్లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను 3–0తో ఇక్కడే కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే మూడో టి20 మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అటు బ్యాటర్స్, ఇటు బౌలర్స్‌ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ఆతిథ్య జట్టుకు సిరీస్‌ విజయం ఏమంత కష్టమేమీ కాదు.

గత రెండు మ్యాచ్‌ల్లోనూ 200 పైచిలుకు స్కోరు చేసిన భారత్‌ మళ్లీ గువాహటి ప్రేక్షకులకు అలాంటి మజానే అందించేందుకు సిద్ధమైంది. పైగా ఆల్‌రౌండ్‌ సామర్థ్యంతో జట్టు సమరోత్సాహంతో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం సిరీస్‌లో నిలవాలంటే కచి్చతంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. పరాజయాల ‘హ్యాట్రిక్‌’ అయితే మాత్రం సిరీస్‌ చేజార్చుకుంటుంది.

బ్యాటర్స్‌ను ఆపతరమా...
టాపార్డర్‌ బ్యాటర్స్‌ అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. యశస్వి దూకుడు ఆసీస్‌ను కంగారు పెట్టిస్తోంది. రెండు వరుస అర్ధ సెంచరీలతో ఇషాన్‌ కిషన్‌ ప్రత్యర్థి బౌలర్లపై సత్తా చాటగా,  రుతురాజ్‌ కూడా ఫిఫ్టీతో తొలిమ్యాచ్‌ డకౌట్‌ను మరచిపోయేలా చేశాడు. రింకూ సింగ్‌ డెత్‌ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

ఇక నిరూపించుకోవాల్సింది, సత్తా చాటుకోవాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే అది హైదరాబాదీ క్రికెటర్‌ తిలక్‌ వర్మే! ఎందుకంటే విశ్రాంతిలో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ తదుపరి రెండు మ్యాచ్‌లకు వైస్‌ కెపె్టన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తుది జట్టులో ఆడటం ఖాయం కావడంతో బెంచ్‌కు పరిమితమయ్యే పరిస్థితి తిలక్‌కే వస్తుంది.

అయితే ఇప్పుడు ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపిస్తే... ప్రస్తుతానికి పక్కన పెట్టినా టచ్‌లోకి వచి్చన బ్యాటర్‌గా జట్టు ఎంపికలో ఉంటాడు. ఇక బౌలింగ్‌ విభాగం కూడా గత మ్యాచ్‌లో మెరుగైంది. కీలకమైన వికెట్లను వరుస విరామాల్లో తీసి మ్యాచ్‌లో పట్టు సాధించింది. ప్రసి«ద్‌కృష్ణ, అర్‌‡్షదీప్‌లతో పాటు స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్‌ పటేల్‌ రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం.

ఆసీస్‌ రేసులోకొచ్చేనా...
ఆ్రస్టేలియా తొలి టి20లో 200 పైచిలుకు పరుగులు చేసినా ఓడింది. తర్వాతి మ్యాచ్‌లో 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న ఆ్రస్టేలియా గెలిచి నిలవడం సాధ్యమవుతుందా అనేది నేటి మ్యాచ్‌తో తేలుతుంది. గత మ్యాచ్‌లో అనుభవజు్ఞలైన డాషింగ్‌ బ్యాటర్‌ మ్యాక్స్‌వెల్, ప్రధాన స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాలను కూడా బరిలోకి దించినా కంగారూ జట్టుకైతే ఒరిగిందేమీ లేదు.

నిలకడ లేని బ్యాటింగ్, నియంత్రణ లేని బౌలింగ్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. స్మిత్, షార్ట్, ఇన్‌గ్లిస్, టిమ్‌ డేవిడ్, స్టోయినిస్‌లాంటి మేటి బ్యాటర్లున్నప్పటికీ ఈ సిరీస్‌లో గెలుపు దారిలో మాత్రం ఆసీస్‌ పడలేకపోతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తే తప్ప పటిష్టమైన ఆతిథ్య జట్టు జోరుకు కళ్లెం వేయలేదు.

జట్లు (అంచనా)
భారత్‌: సూర్యకుమార్‌ (కెపె్టన్‌), రుతురాజ్, యశస్వి జైస్వాల్, ఇషాన్‌ కిషన్, తిలక్‌వర్మ, రింకూ సింగ్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, అర్‌‡్షదీప్, ప్రసిధ్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌.
ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్‌ (కెపె్టన్‌), స్టీవ్‌ స్మిత్, షార్ట్, జోష్‌ ఇన్‌గ్లిస్, మ్యాక్స్‌వెల్, టిమ్‌ డేవిడ్, స్టోయినిస్, ఆడమ్‌ జంపా, సీన్‌ అబాట్, నాథన్‌ ఎలిస్, తనీ్వర్‌ సంఘా.

Advertisement
Advertisement