బడి వేళలు మార్చండి | Sakshi
Sakshi News home page

బడి వేళలు మార్చండి

Published Tue, Apr 9 2024 12:25 AM

-

ఎన్‌పీకుంట: జిల్లాలో రోజురోజుకూ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఒంటి పూట బడుల నిర్వహణ వేళలు మార్చాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే శ్రీసత్యసాయి జిల్లాలో రెండు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోందన్నారు. వడగాలులు వీచే అవకాశముందంటూ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు వడదెబ్బ బారినపడకుండా ఉండేదుకు పాఠశాలలను ఉదయం 7.30 నుంచి 11 గంటల వరకు నిర్వహించేలా పరిశీలించాలని కోరారు. అలాగే వార్షిక పరీక్షల పని వేళలను ఉదయం 8 నుండి 11 గంటల వరకు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement