YS Viveka Murder Case: CBI Files Supplementary Chargesheet In Nampally Court - Sakshi
Sakshi News home page

వివేకా కేసులో ముగిసిన సుప్రీం గడువు!.. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ

Published Fri, Jun 30 2023 11:48 AM

Viveka Case: CBI files supplementary chargesheet in Nampally Court - Sakshi

సాక్షి, హైదరాబాద్ : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన విచారణ గడువు ఇవ్వాళ్టితో ముగియనుండడంతో CBI ఇవ్వాళ(శుక్రవారం) నాంపల్లి కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు, అనుమానితులను పలు మార్లు విచారించింది సీబీఐ. విచారణకు వచ్చిన వారందరి స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది. ఇప్పటివరకు దాఖలైన ఛార్జ్ షీట్ల సంఖ్య చూస్తే ఇవ్వాళ్టిది మూడోది.

  • 2021     తొలి ఛార్జ్ షీట్
  • 2022     జనవరిలో సప్లమెంటరీ ఛార్జ్ షీట్
  • 2023     జూన్ 30 ఫైనల్ చార్జిషీట్ దాఖలు 

ఈ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ ముగియటంతో కోర్టులో హాజరు పర్చారు సీబీఐ అధికారులు. అయితే వీరికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు.. కేసు విచారణను జులై 14 కు వాయిదా వేసింది. 

ఇక ఇదే కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జులై 3 న విచారించనుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సునీత పిటిషన్‌ వేయగా.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారించింది. ఈ కేసును జులై 3న తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి సిబిఐతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 

అయితే ఈ రోజుతో సిబిఐకి ఇచ్చిన విచారణ గడువు ముగియడంతో సునీత పిటిషన్‌కు ఎంత వరకు వాలిడిటీ ఉంటుందన్నది జులై 3న తేలనుంది.

ఇదీ చదవండి: ఎందుకీ ఈగో క్లాషెస్‌?.. సునీతకు సుప్రీంకోర్టు ప్రశ్న

Advertisement
 
Advertisement
 
Advertisement