పైపైనే గంగ.. లేదు బెంగ | Sakshi
Sakshi News home page

పైపైనే గంగ.. లేదు బెంగ

Published Tue, Apr 9 2024 3:00 AM

five yard well has a permanent spring of water - Sakshi

ఐదు గజాల బావిలో నిత్యం నీటి ఊటలు

6 ఎకరాల్లో పలు పంటలు సాగు చేస్తున్న రైతు  

మెదక్‌జోన్‌: మండే ఎండలకు చాలాచోట్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. బోర్లు మూలన పడ్డాయి. కానీ మెదక్‌ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ రైతు పొలంలో 25 ఏళ్ల క్రితం తవి్వన ఐదు గజాల బావిలో మాత్రం నీటి ఊటలు తరగడం లేదు. మండు వేసవిలో సైతం ఆ నీటితో ఆరు ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు.ళీ    మెదక్‌ జిల్లా హవేళిఘనాపూర్‌ మండలం శమ్నాపూర్‌కు చెందిన బద్దం వెంకట్రాంరెడ్డికి గ్రామ శివారులో 6ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

పాతికేళ్ల క్రితం తన భూమిలో కేవలం 5 గజాల లోతు బావిని తవ్వించాడు. అందులో విపరీతమైన నీటిధారలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ రైతు తన పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బావి తవి్వన స్థలంలో 2 ఎకరాలు ఉండగా.. కొంత దూరంలో 4 ఎకరాలు ఉంది. బావిలో మోటార్‌ బిగించి పైపులైన్‌ వేసి ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మామిడి తోట, ఎకరంలో పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు.

24 గంటలు మోటార్‌ నడిచినా.. 
ఐదు గజాల బావిలో మోటార్‌ బిగించిన రైతు వెంకట్రాంరెడ్డి 24 గంటల పాటు మోటార్‌ నడిపించినా నీటి ఊటలు ఏ మాత్రం తగ్గడం లేదు. పొలం పక్కన మరికొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వారు బావులు తవ్వినా వాటిలో కొద్దిపాటి నీరు మాత్రమే వచి్చంది. వెంకట్రాంరెడ్డి బావిలో మాత్రం 24 గంటల పాటు మోటార్‌ నడిచినా నీరు తగ్గడం లేదు.  

ఏ కాలంలోనైనా నిండుగా.. 
ఏకాలంలోనైనా మా బావిలో నీరు నిండుగా ఉంటుంది. కరెంట్‌ ఉన్నంత సేపు మోటార్‌ నడుస్తూనే ఉంటుంది. పంటకు నీటి తడులు అవసరం లేనప్పుడు మాత్రమే మోటార్‌ బంద్‌ చేస్తాం. – బద్దం వెంకట్రాంరెడ్డి, రైతు, శమ్నాపూర్‌

Advertisement
Advertisement