మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్‌ అలర్ట్‌! | Sakshi
Sakshi News home page

మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్‌ అలర్ట్‌!

Published Wed, Mar 27 2024 9:05 AM

Orange Alert Due To Sun Heat Waves In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో మంగళవారం  42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు, జైనథ్‌ మండలాల్లో మంగళవారం గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఇక​, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు.. రానున్న మూడు రోజులు కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా.. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీచేసింది. ఎండలో పనిచేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎండలో తిరగరాదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలుచోట్ల వర్షం కురిసిన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement