గజపతినగరం మామిడిబంద కాలనీ... | Sakshi
Sakshi News home page

గజపతినగరం మామిడిబంద కాలనీ...

Published Wed, May 8 2024 7:04 AM

గజపతినగరం మామిడిబంద కాలనీ...

రోడ్‌ షో బృందం: చంద్రబాబు మళ్లీ వస్తే ఉచితంగా ఇసుక ఇస్తానంటున్నారు. గతంలో ఆయన పాలనలో ఇసుక ఉచితమేనా?

కర్రి వెంకటరమణ, భవననిర్మాణ కార్మికుడు: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. అప్పుడెప్పుడూ ప్రజలకు ఇసుక ఉచితం కాదు. టీడీపీ నాయకుల దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. నాలాంటి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్నది వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులతో మూడేళ్లుగా చేతినిండా పని దొరుకుతోంది. అంతేకాదు నా భార్య శస్త్ర చికిత్సకు వేలాది రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయించారు. మా పిల్లలను ఉన్నత విద్య చదివించుకుంటున్నాం. మద్యం అలవాటు పడినవాళ్లు మాత్రం వాళ్లకు కావాల్సిన బ్రాండ్‌ దొరకలేదని, రేట్‌ పెరిగిపోయిందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం జగన్‌మోహన్‌రెడ్డి వైపే ఉంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement