రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు

Published Tue, Apr 16 2024 1:20 AM

- - Sakshi

వనపర్తి: స్థానిక డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో బుధవారం జిల్లాస్థాయి మిడిల్‌ అండ్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం అధ్యక్షుడు వాకిటి శ్రీధర్‌, ప్రధానకార్యదర్శి బి.నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న సూర్యాపేటలో జరిగే తెలంగాణ అంతర్రాష్ట్ర పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.

రామన్‌పాడుకు

జూరాల నీరు నిలిపివేత

మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో నీటి మట్టం తగ్గుతుంది. సోమవారం 1,011 అడుగులకు చేరింది. జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. తాగునీటి అవసరాల కోసం 20 క్కూసెక్కులు నీటిని వినియోగిస్తున్నామని ఏఈ సింగిరెడ్డి రనీల్‌రెడ్డి తెలిపారు.

ప్రాంతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి

కొత్తకోట రూరల్‌: ప్రాంతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోటలోని ఓ ప్రైవేట్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌, పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరిగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్‌పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తోందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలకు తెలిసేలా వివరించాలన్నారు. సాగునీరు అందక పంటలు ఎండుతుంటే ఏ మంత్రి వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవని.. ఐపీఎస్‌ మ్యాచ్‌ చూడటంపై ఉన్న శ్రద్ధ ప్రజాపాలనపై లేదని ఆరోపించారు. గడిచిన పదేళ్లలో మోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు చేసిన అభివృద్ధి ఎంతో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మోదీ మాటలకే గ్యారంటీ లేదని.. డీకే అరుణ మాటలు ఎవరు నమ్ముతారన్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే దేశం నాశనమవుతుందని, యువత, మేధావి వర్గం దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలకు ఓటు వేస్తేనే దేశానికి శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంత మౌనిక, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పి.సుఖేశిని, వైస్‌ చైర్మన్‌ బీసం జయమ్మ, చెన్నకేశవరెడ్డి, విశ్వేశ్వర్‌, గాడీల ప్రశాంత్‌, చీర్ల నాగన్నసాగర్‌, అయ్యన్న, సుభాష్‌, కౌన్సిలర్లు, కో–ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

పీయూలో క్యాంపస్‌

రిక్రూట్‌మెంట్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో సోమవారం క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యక్రమాన్ని దివాస్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ గ్రూప్‌లకు సంబంధించి 65 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రిన్సిపాల్‌ చంద్రకిరణ్‌, దివిస్‌ ల్యాబ్స్‌ హెచ్‌ఆర్‌ హరికృష్ణ, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ అర్జున్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement